
సాక్షి, కర్నూలు: స్థానిక శ్రీ శ్రీశైల భ్రమరాంబ ఆలయ కుంభకోణంలో భాగస్వాములైన ఉద్యోగులపై చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపక్రమించింది. 11 మంది దేవస్థాన ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు ఆంధ్రాబబ్యాంకు, ఇతర ఏజెన్సీల ఉద్యోగులు మొత్తం 33 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వీరి వద్ద నుంచి సొమ్మును రికవరీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రూ. 2.56 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్లు నివేదికలో తేలింది. దేవాదాయశాఖ విచారణ అనంతరం వీరిపై చర్యలు తీసుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment