సాక్షి, రాజమండ్రి :అమాయకులు, నిరక్షరాస్యులైన గిరిజనం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రభుత్వ పథకాలను అమలు చేయాలి. కానీ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. ఎప్పుడో 2012లో సంభవించిన నీలం తుపాను పరిహారం ఇప్పటికీ పూర్తిస్థాయిలో పంపిణీ కాక పోవడమే ఇందుకు నిదర్శనం. పైగా ఈ విషయం లో వ్యవసాయ అధికారులు చెబుతున్న మాటలు ఏజెన్సీ రైతుల సంక్షేమంపై యంత్రాంగానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయాన్ని చాటుతున్నాయి.ఏజెన్సీ (విలీన ప్రాంతం మినహా) ఏడు మండలాల్లో నీలం తుపాను పరిహారం చెల్లింపు అంశం వివాదాస్పదంగా మారింది. నాడు తుపాను బాధితులను గుర్తించినప్పుడు సేకరించిన పేర్లు, నమోదు చేసిన వివరాలు, ఇవాళ పరిహారం పంపిణీ సమయంలో అధికారులకు కనిపించడం లేదని పలువురు గిరిజన రైతులు వాపోతున్నారు. నష్టం అంచనా, రైతుల వివరాలను పరిశీలించి సరిగ్గా ఉన్నాయా లేవా అనేది నిర్ధారించుకోవలసిన బాధ్యత అధికారులదే. అప్పట్లో అన్నీ చేశామన్న అధికారులు ఇప్పుడు కొందరు లబ్ధిదారులు కనిపించడం లేదని, కొందరికి బ్యాంకుల్లో ఖాతాలు లేవని, తప్పుడు ఖాతాలని పరిహారం నిలిపివేయడ రైతులు మండిపడుతున్నారు.
కొందరికే పరిహారం
రంపచోడరం, దేవీపట్నం, మారేడుమిల్లి, అడ్డతీగల, గంగవరం, రాజవొమ్మంగి, వై.రామవ రం మండలాల్లో 2012లో నీలం తుపాను వల్ల 10,710 మంది రైతులు నష్టపోయారని స ర్వేలో తేలగా 2013లో ప్రభుత్వం రూ.3.31 కో ట్ల ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేసింది. ఇప్పటి కి రూ.2.50 కోట్లను 8,193 మందికి పంపిణీ చే శారు. మిగిలిన 2517 మందికి రూ.81 లక్షలు చెల్లించాల్సి ఉంది. అయితే వారి వివరాలు లేవంటూ అధికారులు చెల్లించడం మానేశారు.
తేలని లెక్కలు
అధికారిక వివరాల ప్రకారం నీలం పరిహారం మంజూరైన రైతుల్లో 223 మంది వలస వెళ్లారు. అసలు ఆచూకీ లేనివారు 56 మంది కాగా అక్కౌంట్లు ప్రారంభించేందుకు శ్రద్ధ చూపనివారు 83 మంది ఉన్నారు. చనిపోయిన వారు 61మంది కాగా రెండుసార్లు నమోదైన వారు 35మంది. తప్పుడు అక్కౌంట్లు సమర్పించిన వారు 828మంది కాగా ట్రెజరీలో ఉన్న అక్కౌంట్లు 1048, కమిషనర్ కార్యాలయానికి వెళ్లినవి 183 అంటూ నివేదికలో పేర్కొంటున్నారు. నష్టపోయిన రైతుల వివరాల సేకరణలో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఈ లెక్కలను బట్టే తెలుస్తోంది. సర్వే సమయంలో అసంపూర్తి వివరాలను ప్రభుత్వానికి నివేదించి ఆనక దీనికి తమను బాధ్యులను చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
బినామీ ఖాతాల్లోకి నిధులు
నీలం తుపాను పరిహారం అసలు రైతుల ఖాతాల్లోకి కాకుండా బినామీల ఖాతాల్లోకి మళ్లించారని తాజాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల గిరిజనుల పేరిట బినామీ బ్యాంకు అక్కౌంట్లు సృష్టించి వాటిలోకి పరిహారాన్ని దారి మళ్లించారని, ఇందులో కొందరు ఉద్యోగుల ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.వివిధ కారణాలతో పరిహారం చెల్లించలేదంటున్న అధికారులు ఆ మొత్తం రూ. 81 లక్షలకు చెబుతున్న లెక్కలు కూడా గందరగోళంగా ఉన్నాయని సమాచారం. లెక్కల్లో తేడాల వల్లనే ‘రిస్క్’ తీసుకోవడం ఇష్టం లేక ఉన్నవీ, లేనివీ పలు కారణాలను సాకుగా చూపుతూ పరిహారాన్ని పెండింగ్‌లో పెట్టేశారని కూడా తెలుస్తోంది.
‘నీలం’ సాయం నేటికీ దూరం
Published Fri, Dec 26 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM
Advertisement
Advertisement