
సాక్షి, వైఎస్సార్ జిల్లా : కడప జిల్లాలో మరో విద్యా సంస్థ మోసం బయట పడింది. ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులకు జరిగిన మోసాన్ని మరవక ముందే జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రేస్ డైట్ కళాశాల యాజమాన్యం కాలేజీని కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. ఫీజుల పేరుతో విద్యార్థుల నుంచి కోట్ల రూపాయల మేర వసూలు చేసింది. తీర పరీక్షలు సమీపించడంతో వారిని రాజంపేట పిలిపించింది. ఆపై హాల్ టికెట్లు ఇవ్వకుండా యాజమాన్యం విద్యార్థులను వేధించింది. దీంతో తమ భవిష్యత్ ఏంటని 110 మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment