మహనీయుల స్ఫూర్తితో ముందడుగు | Greatmans with the inspiration to move forward | Sakshi
Sakshi News home page

మహనీయుల స్ఫూర్తితో ముందడుగు

Published Sun, Aug 16 2015 4:16 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

మహనీయుల స్ఫూర్తితో ముందడుగు - Sakshi

మహనీయుల స్ఫూర్తితో ముందడుగు

జెండా ఊంఛా రహే హమారా.. అంటూ త్రివర్ణ పతాకాన్ని మచిలీపట్నంలో సగర్వంగా ఎగరేశారు. 69వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. జిల్లా ప్రగతి, అభివృద్ధిపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రసంగం చేశారు.
 
 మచిలీపట్నం : భారత స్వాతంత్య్రం కోసం ఉద్యమాలు చేసిన మహనీయుల స్ఫూర్తితో ముందడుగు వేసి జిల్లాను అందరి సహకారంతో అభివ ృద్ధి పథంలో నడుపుతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. భారత 69వ స్వాతంత్య్రదిన వేడుకలు మచిలీపట్నంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం వైభవంగా నిర్వహించారు. తొలుత జాతీయ పతాకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

స్వాతంత్య్రదిన వేడుకలను పురస్కరించుకుని పోలీసు బలగాలు చేసిన మార్చ్‌ఫాస్ట్ ఆకట్టుకుంది. వివిధ ప్రభుత్వ పథకాలను చాటుతూ ఏర్పాటుచేసిన శకటాలు అలరించాయి. వివిధ ప్రభుత్వ విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.రవీంద్రబాబు, కలెక్టర్ బాబు.ఎ, జేసీ గంధం చంద్రుడు, ఎస్పీ జి.విజయ్‌కుమార్, ఇన్‌చార్జ్ డీఆర్వో పి.సాయిబాబు చేతుల మీదుగా అందజేశారు. స్వాతంత్య్ర సమరయోధులు మేకా నరసయ్య, సీహెచ్ పాండురంగారావులతో పాటు పద్మశ్రీ అవార్డు గ్రహీత గొరిపర్తి నరసింహరాజు యాదవ్‌లను ఈ సందర్భంగా సత్కరించారు. జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు.

 మహనీయులను స్మరించుకుంటూ...
 మంత్రి దేవినేని ఉమా తన ప్రసంగంలో జిల్లాకు చెందిన అయ్యదేవర కాళేశ్వరరావు, కొమరరాజు లక్ష్మణరావు, గొట్టిపాటి బ్రహ్మయ్య, తిపురనేని రామస్వామిచౌదరి, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలక ృష్ణయ్య, మాకినేని సుబ్రహ్మణ్యం, జెండా వీరుడు తోట నరసయ్య, కాశీనాథుని పూర్ణమల్లిఖార్జునుడు, కోటగిరి వెంకటక ృష్ణారావు, బండారు అచ్చమాంబ, వల్లభనేని సీతామహాలక్ష్మమ్మ, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వంటి ఎందరో మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. రాష్ట్ర పునర్విభజన శాస్త్రీయ పద్ధతిలో జరగకపోవటంతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

 కృష్ణా పుష్కరాలు వైభవంగా నిర్వహించేందుకు చర్యలు
 ఈ వేడుకల్లో మంత్రి ఉమా మాట్లాడుతూ జిల్లా ప్రగతి, చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను వెల్లడించారు. చేయబోతున్న అభివృద్ధి పనుల వివరాలు కూడా తెలియజేశారు. రైతు రుణమాఫీ మూడు విడతల్లో చేపట్టామని, మూడో విడత పేర్లు ఆన్‌లైన్‌లో పొందుపరిచామని వివరించారు. నదుల అనుసంధానంలో భాగంగా పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగంగా పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టామన్నారు. రూ.700 కోట్లు వెచ్చించి పోలవరం కుడికాలువ పనులు వేగవంతంగా చేస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పట్టిసీమ ప్రాజెక్టును జాతికి అంకితం చేశామన్నారు.

కేఎల్‌రావు సాగర్, పులిచింతల ప్రాజెక్టు పనులను పూర్తిచేసి కృష్ణాడెల్టాలో సకాలంలో సాగు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్వాక్రా రుణమాఫీ మొదటి విడతగా 48 వేల గ్రూపుల్లోని 4.9 లక్షల మంది సభ్యులకు రూ.134 కోట్లు వారి పొదుపు ఖాతాలో జమ చేశామన్నారు. జిల్లాలోని 2160 రేషన్‌షాపుల ద్వారా ఈ-పోస్ విధానంలో నిత్యావసర సరకులు అందజేస్తున్నామని, ఈ విధానం అమలు చేసిన ఘనత మన జిల్లాకే దక్కిందని తెలిపారు. చేపల వేట నిషేధం సమయంలో ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి రూ.4 వేలు ఆర్థిక సహాయం అందించనున్నామని చెప్పారు.

గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి అభివ ృద్ధి చేస్తామని, బందరు పోర్టు పనులు ప్రారంభిస్తామని, క ృష్ణా యూనివర్సిటీని అన్ని వసతులతో అభివ ృద్ధి చేస్తామని, ఆగిరిపల్లిలో మెగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పుతామని తెలిపారు. క ృష్ణా పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. భవానీ ద్వీపాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.

 ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
 స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. మచిలీపట్నం,, పెడన, బంటుమిల్లి, విజయవాడ, రుద్రవరం పాఠశాలల విద్యార్థులు చేసిన వివిధ ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. వీఎంఆర్ కృష్ణలంక విద్యార్థులకు ప్రథమ, గురుకుల పాఠశాల రుద్రవరం విద్యార్థులు ద్వితీయ, విజయవాడ మాంటిస్సోరీ గర్ల్స్ విద్యార్థులకు తృతీయ బహుమతులు ప్రకటించారు.
 
 ఎస్సీ కార్పొరేషన్ శకటానికి ప్రథమ బహుమతి
 స్వాతంత్య్ర దిన వేడుకల్లో ప్రభుత్వ పథకాలను తెలియజేసే వివిధ శకటాలను ప్రదర్శించారు. పౌర సరఫరాల విభాగం, ఈ-పోస్ ద్వారా సరకుల పంపిణీ, నీరు-చెట్టు కార్యక్రమం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యక్రమాలను వివరించే శకటం, ఎస్సీ కార్పొరేషన్, విద్యాశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, జాతీయ ఉపాధి హామీ పథకం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ శకటాలు ఆకట్టుకున్నాయి. వీటితో పాటు 108, 104 శకటాలను ప్రదర్శించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశుపోషణపై ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ శకటానికి ప్రథమ, డీఎస్‌వో కార్యాలయం ఏర్పాటు చేసిన శకటానికి ద్వితీయ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ శకటానికి తృతీయ బహుమతులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement