వారికి ధనికులే ముఖ్యం
- పాలక వర్గాల తీరుపై ధ్వజమెత్తిన పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్
నయీంనగర్ : కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల పాలకులకు ధనికుల స్వప్రయోజనాలే ముఖ్యమని ప్రముఖ పాత్రికేయు డు, మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినా థ్ విమర్శించారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐఏడబ్ల్యూఏ) 8వ జాతీయ మహాసభల ను పురస్కరించుకుని హన్మకొండ పబ్లిక్‌గార్డెన్‌లో శు క్రవారం రాత్రి ‘వ్యవసాయరంగం-ప్రపంచీకరణ’ అంశంపై ఆనంద్‌కుమార్ అధ్యక్షతన సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్యఅతిథిగా పాలగుమ్మి సాయినాథ్ హాజరై మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ఆయక ట్టు పెంచేందుకు అక్కడ పనులు చేయలేదని.. పరిశ్రమల ఏర్పాటు, సెజ్‌ల నిర్మాణం కోసమే పాలకులు హైరానా పడుతున్నారని ధ్వజమెత్తారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరందించలేని ప్రభుత్వం సంపన్న కుటుంబాలకు చెందిన స్విమ్మింగ్ పూల్స్‌కు మాత్రం నీటిని సరఫరా చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతోనే రైతులు తగ్గిపోయి వ్యవసాయ కూలీల సంఖ్య పెరుగుతుంద న్నారు. కేంద్ర బడ్జెట్‌లో రూ. 71వేల కోట్ల కార్పొరేట్ పన్ను, రూ. 2 లక్షల కోట్ల కస్టమ్ డ్యూటీ, రూ. 48 వేల కోట్ల బంగారం, వజ్రాలపై, రూ. 1.79 వేల కోట్ల ఎక్సైజ్ డ్యూటీ మాఫీ చేసేందుకు సిద్ధమైన ప్రభుత్వం రూ.34 వేల కోట్లు ఉపాధి హామీ పథకానికి కేటాయించడం గొప్ప విషయమేమికాదన్నారు.
విద్యా, వైద్యం, నీళ్లు, భూమి, ఉద్యోగాలు, సబ్సిడీ, తదితర రంగాల్లో పేదలకు, సంపన్న వర్గాల మధ్య ప్రభు త్వా లు నేటికి వివక్ష చూపిస్తున్నాయని ఆయన విమర్శిం చారు. జేఎన్‌టీయూ న్యూఢిల్లీ ప్రొఫెసర్ శీల బల్లా మాట్లాడుతూ కుటుంబాలు విడిపోయి జనాభా పెరగ డమే కాకుండా, రైతులకు చెందిన భూములను బడా పారిశ్రామిక, పెట్టుబడుదారులకు కేటాయించడం ద్వారా రైతు కమతాల సంఖ్య వేగంగా పెరిగిపోతుందన్నారు.
1991 నుంచి సరళీకరణాల అమలుతో ప్రభుత్వ సెక్టర్‌లో ఉపాధి తగ్గిందన్నారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ ప్రపంచీకరణతో దళిత, గిరిజనులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాం ట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని చెప్పడం హర్షించదగిన విషయమేనని, అయితే దళితులకు 15 శాతం రిజర్వేషన్ చేస్తే వారు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
ఎన్నికల ముందు దళి తుల అభ్యున్నతి కోసం పాటుపడుతామని చెప్పిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇప్పుడు కనీసం సబ్‌ప్లాన్ గురించి మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. గ్రామీణ యువకులు మంచి విద్యను నేర్చుకునేందు కు తగిన పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. వ్యవసాయ కార్మికులతో పాటు, దళిత ఉద్యమాలను ముందుండి నడిపించాల్సిన అవసరం పార్టీపై ఉందని ఆయన పేర్కొన్నారు.