పోల‘వరమా’.. శాపమా?
అయితే గతంలో వచ్చిన గోదావరి వరదలను పరిశీలిస్తే ఏపీలో విలీనమైన గ్రామాల కంటేæ ప్రస్తుతం భద్రాచలం డివిజన్‌లోనిæ బూర్గంపాడు, సంజీవరెడ్డిపాలెం, నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం, సారపాక, మోతె, ఇరవెండి, భద్రాచలం పరిసర గ్రామాలే ఎక్కువ ముంపునకు గురవుతాయి. కానీ పోలవరం ముంపు ప్యాకేజీలో తెలంగాణలో ఉన్న బూర్గంపాడు మండలాల్లోని ఈ గ్రామాలను పరిగణనలోకి తీసుకోకపో వటంతో భవిష్యత్‌లో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. గోదావరి వరదలను ప్రామాణికంగా తీసుకుని పోలవరం ముంపును గుర్తించాలని కోరుతున్నారు. ప్రసుత్తం ఏపీ ప్రభుత్వ పోలవరం ముంపు గెజిట్‌లో బూర్గంపాడు మండలంలోని 365 హెక్టార్ల భూమి ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.
వాస్తవానికి అశ్వాపురం, బూర్గంపాడు, భద్రాచలం మండలాల్లో సుమారు 1000 హెక్టార్లు మునిగే ప్రమాదం ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇది తమది కాదన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఈ విషయమై ఇటీవల సీతారామనగరం గ్రామంలో జరిగిన గ్రామసభకు హాజరైన పశ్చిమగోదావరి జిల్లా ఐఏఎస్ అధికారి షాన్‌మోహన్‌కు బూర్గంపాడు మండల ప్రజాప్రతినిధులు వివరించగా.. ఇది తెలంగాణ ప్రభుత్వమే చూసుకోవాలని ఆయన అన్నారు.కాగా, ఈ విషయమై రైతుల నుంచి ఎలాంటి వినతులు రాలేదని భద్రాచాలం ఆర్డీఓ శివనారాయణరెడ్డి అన్నారు. వినతులు వస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామనీ, ప్రాథమికంగా నివేదికలు తయారుచేసి పోలవరం ముంపు భూముల వివరాలను కలెక్టర్‌కు అందిస్తామని వివరించారు.