'బాబు డ్రామాలు ఆడుతున్నారు' | gudivada amarnath slams on chandrababu | Sakshi
Sakshi News home page

'బాబు డ్రామాలు ఆడుతున్నారు'

Published Sat, Apr 25 2015 1:48 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

gudivada amarnath slams on chandrababu

విశాఖ : విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్‌కాంగ్రెస్, కాంగ్రెస్, సీపీఎంలు శనివారం విశాఖపట్టణంలో ధర్నాలు నిర్వహించాయి. కలెక్టరేట్ వద్ద సీపీఎం... జగదాంబ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఆందోళనలకు దిగాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించాయి. వైఎస్సార్‌సీపీ విశాఖ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ... చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ప్రకటించనందున కేంద్ర సర్కారు నుంచి చంద్రబాబు బయటకు రావాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement