దాడులతోనూ నాకు సంబంధం లేదు | Gudsa Usendi quizzed by NIA | Sakshi
Sakshi News home page

దాడులతోనూ నాకు సంబంధం లేదు

Published Thu, Jan 16 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM

దాడులతోనూ నాకు సంబంధం లేదు

దాడులతోనూ నాకు సంబంధం లేదు

* దర్యాప్తు సంస్థల విచారణలో మావోయిస్ట్ నేత ఉసెండి వెల్లడి
* ఎన్‌ఐఏ, సీఆర్పీఎఫ్, చత్తీస్‌గఢ్ పోలీసుల విచారణ
* మూడో పెళ్లి విషయం పార్టీకి వివరించానని వెల్లడి
 
సాక్షి, హైదరాబాద్:  ఎలాంటి హింసాత్మక దాడుల్లోనూ పాల్గొనలేదంటూ మావోయిస్ట్ నేత గుమ్మడివెల్లి వెంకట కిషన్ ప్రసాద్ అలియాస్ గుడ్సా ఉసెండి దర్యాప్తు సంస్థల విచారణలో వెల్లడించాడు. ఇటీవల లొంగిపోయిన ఉసెండిని రాష్ట్ర పోలీసులతోపాటు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ), కేంద్ర రిజర్ దళం (సీఆర్పీఎఫ్), చత్తీస్‌గఢ్ పోలీసులు విచారిస్తున్నారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధిగా వ్యవహరించిన ఉసెండి,... చత్తీస్‌గఢ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి, అక్కడి కోర్టులో విచారణను ఎదుర్కోవలసి ఉంది. పార్టీ విధానాలతో విబేదించి, లొంగిపోయిన ఉసెండికి న్యాయ పరమైన ఇబ్బందులు కూడా కలిగించకుండా చూడాలని పోలీసుశాఖ భావిస్తోంది.

కోర్టు కేసులతో సంబంధంలేకుండానే తన లొంగుబాటును అంగీకరించాలన్న ఉసెండి షరతుకు అంగీకరించిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. కోర్టు అనుమతితో పనిలేకుండానే ఉసెండిని చత్తీస్‌గఢ్ పోలీసులువిచారిస్తున్నారు. చత్తీసగఢ్ పీసీసీ అధ్యక్షుడిని, కేంద్ర మంత్రి కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు జరిపిన దాడిపై ఎన్.ఐ.ఎ. అధికారులు, ఉసెండి నుంచి సమాచారం రాబడుతున్నారు. 2010 ఏప్రిల్ ఆరున చింతల్‌నార్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ 62వ బెటాలియన్‌కు చెందిన 76 మంది మృతికి కారణమైన మావోయిస్టుల దాడిపై సీఆర్పీఎఫ్ కూడా వివరాలు రాబడుతోంది.

రాజీతో విడిపోయి, సంతోషితో సహజీవనం
ఉసెండి మూడో పెళ్లిపై మావోయిస్టు పార్టీ చేసిన ప్రకటనతో, ఆ విషయం చర్చనీయాంశమైంది. భార్య రాజీ ఉండగానే ఉసెండి, సంతోషి మార్కంతో సంబంధం పెట్టుకున్నాడని, తాము చర్య తీసుకునేలోపే ఆతను పరారయ్యాడని పార్టీ ్రప్రకటించింది. సంతోషిని ఉసెండి భార్యగా పోలీసులు అధికారికంగా ప్రకటించినా, వారిద్దరికీ పెళ్లికాలేదని తెలిసింది. దీనితో ఈ విషయమై ఎలా సమాధానం చెప్పుకోవాలో పోలీసులకు బోధపడటంలేదు. ఆదివాసీ యువతి మిడ్కోను ఉసెండి 1996లో పెళ్లిచేసుకున్నాడు.

అతనికి మరో యువతితో సంబంధం ఉందని పార్టీ నేతలకు భార్య ఫిర్యాదుచేయడంతో వారు విచారణ జరిపి, 1999లోనే ఉసెండి స్థాయిని తగ్గించారు. ఎన్‌కౌంటర్‌లో మొదటి భార్య మిడ్కో మృతితో ఉసెండి, 2001లో రాజీని పెళ్లిచేసుకున్నాడు. ఐదేళ్ల క్రితం తమ మధ్య విబేధాల సంగతిని రాజీ, పార్టీ దృష్టికి తీసుకెళ్లింది. విభేదాలొస్తే విడాకులకు పార్టీలో అవకాశం ఉన్నా, ఉసెండి రాజీతో విడాకులు తీసుకోకుండానే సంతోషితో సహజీవనం ప్రారంభించాడు. కాగా, తన సహజీవనంపై పార్టీకి కూడా వివరించినట్టుట్టు ఉసెండి వాదిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement