గౌహతి-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు | guwahati-chennai express train catches fire | Sakshi
Sakshi News home page

గౌహతి-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు

Published Tue, May 20 2014 6:38 PM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM

guwahati-chennai express train catches fire

శ్రీకాకుళం: గౌహతి-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీల మధ్య మంటలు ఎగిసిపడడంతో కలకలం రేగింది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును వజ్రపుకొత్తూరు మండలం పూండి వద్ద నిలిపివేశారు. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. అయితే ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడినట్టు సమాచారం లేదు. గౌహతి-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోవడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement