బాబూ... ఏం చేశారని రైతుయాత్ర? | Half-hearted Loan waiver | Sakshi
Sakshi News home page

బాబూ... ఏం చేశారని రైతుయాత్ర?

Published Thu, Sep 24 2015 4:15 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

బాబూ... ఏం చేశారని రైతుయాత్ర? - Sakshi

బాబూ... ఏం చేశారని రైతుయాత్ర?

అరకొరగా రుణమాఫీ
♦ 20 శాతం మందికే వేరుశనగ విత్తనాలు
♦ మొక్కబడిగా బ్యాంకు రుణాలు
♦ మూడేళ్లగా కరువొచ్చినా ఇన్‌పుట్ సబ్సిడీ లేదు
♦ చంద్రబాబుపై రైతన్నల ఆగ్రహం
 
 సాక్షి, చిత్తూరు : రుణమాఫీ లేదు... బ్యాంకు రుణాలు లేవు... కరువొచ్చి నష్టపోయినా ఇన్‌పుట్ సబ్సిడీ ఊసే లేదు. చివరకు జిల్లాలో 15 శాతం మంది రైతులకు కూడా వేరుశనగ విత్తనాలు ఇవ్వలేదు. భూసార పరీక్షల ఫలితాలు కూడా పూర్తిగా ఇచ్చిన పాపాన పోలేదు. ఏం చేయకుండానే అన్నీ చేసినట్లు  ప్రలోభ పెట్టడం చంద్రబాబు ప్రత్యేకత. ఇప్పుడు చంద్రన్న రైతుయాత్ర పేరుతో మరోమారు రైతాంగానికి శఠగోపం పెట్టేందుకు సిద్ధం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  
                       
 రుణమాఫీ తీరిదీ...
 జిల్లావ్యాప్తంగా 8,70,321 మంది రైతులు 2013 డిసెంబర్ 31 నాటికి వివిధ బ్యాంకులలో రూ.11,180.25కోట్ల రుణాలు తీసుకున్నారు. బ్యాం కులు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రుణమాఫీకి 5.63 లక్షల మంది అర్హులని ప్రకటించారు. మొదటి విడతలో 3,06,544 మందికి, రెండో విడతలో మరో 54 వేల మందిని మాత్రమే రుణమాఫీ అర్హులుగా తేల్చారు. తరువాత మూడో విడతలో జిల్లా నుంచి 30 వేలకు మంది పైగా రైతులు రుణమాఫీ కోసం వినతులు సమర్పించగా కేవలం 9 వేల మందికి మాత్రమే రుణమాఫీ వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన మొత్తం 8,70321 మందికి 3,69,544 మందికి మాత్రమే ప్రభుత్వం రుణమాఫీ వర్తింపజేసి చేతులు దులిపేసుకుంది. వీరిలో 30 శాతం మంది రైతుల అకౌంట్‌లో వివిధ సాంకేతిక కారణాలతో రుణమాఫీ అర్హతకు నోచుకోక లబోదిబోమంటున్నారు. చంద్రబాబు వంచనపై దుమ్మెత్తి పోస్తున్నారు

 రుణాలివ్వని బ్యాంకులు
 2015-16 ఆర్థికసంవత్సరంలో జిల్లాలో 7493.94 కోట్ల రుణాలిస్తామని బ్యాంకుల రుణ ప్రణాళిక ప్రకటించింది. ఇందులో వ్యవసాయ అనుబధాలకు సం బంధించి 4,03,601 ఖాతాల పరిధిలో 4,411.69 కోట్లు రుణాలివ్వనున్నట్లు చెప్పిన బ్యాంకులు ఇప్పటివరకు కేవలం 400 కోట్ల రుణాలను మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నాయి. బ్యాంకు రుణాలు అందకపోవడంతో రైతులు పంటలకు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించలేకపోయారు. దీంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం కూడా వచ్చే పరిస్థితి లేదు.

 ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వని ప్రభుత్వం
 జిల్లాలో మూడేళ్లుగా వరుస కరువుతో రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం పైసా ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చిన పాపాన పోలేదు. జిల్లాలో 2013 ఏడాదికి ప్రభుత్వం 33 మండలాలలను కరువు మం డలాలుగా ప్రకటించింది. ఆ ఏడాది ఖరీఫ్‌లో 1.20 లక్షల మంది రైతులు 1.18 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంట సాగు చేసి నష్టపోయారు. రూ.108 కోట్ల మేర రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ప్రభుత్వం చెల్లించా ల్సి ఉంది.  2014 ఖరీఫ్‌లో 1,74,000 మంది రైతు లు 92 హెక్టార్లలో వేరుశనగ పంట సాగు చేసి సుమా రు  400 కోట్ల మేర నష్టపోయారు. వీరికి 122.16 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. తాజాగా ఈ ఏడాది  61 మండలాలను ఇప్పటికే కరువు కింద ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 2,07,502 హెక్టార్ల సాగు విస్తీర్ణంలో ఒక్క ఖరీఫ్‌లో 1,58,293 హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా 1,10,381 హెక్టార్లలో మాత్రమే వేరుశనగ పంట సాగైంది. అది కూడా కరువుతో దెబ్బతింది.

 ఈ ఏడాది ఖరీఫ్‌లో 83వేల క్వింటాళ్ల వేరువనగ విత్తనాలిస్తామన్న ప్రభుత్వం 40 వేల క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే పంపిణీ చేసింది. భూసార పరీక్షలు ఫలితాలను సైతం వ్యవసాయ శాఖ రైతులకు అందించిన పాపాన పోలేదు. పండ్ల తోటల రైతులకు రూ.10 వేల పరిహారం ఇస్తానన్న చంద్రబాబు హామీ ఇప్పటికీ నెరవేరలేదు. మామిడి ఎగుమతుల సంగతి ప్రభుత్వం పట్టించుకోలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement