సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు కేంద్రం నిర్ణయించడం, సమైక్యాంధ్ర కోసం ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టీ హైదరాబాద్‌పై, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఆదాయ పంపిణీపై కేంద్రీకృతమైంది. హైదరాబాద్ ఆదాయంలో వాటాలకు అంగీకరించే ప్రసక్తే లేదని టీఆర్‌ఎస్ తేల్చిచెప్పడంతో ఈ అంశానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్రానికి వివిధ రూపాల్లో వస్తున్న మొత్తం ఆదాయంలో దాదాపు సగం గ్రేటర్ హైదరాబాద్ (హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాలు) నుంచే ఉండటం గమనార్హం.
గత ఆర్థిక సంత్సరం (2012-13)లో రాష్ట్రానికి వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయం మొత్తం రూ.69,146 కోట్లు అయితే దానిలో దాదాపు సగం అంటే రూ.34,100 కోట్లు గ్రేటర్ హైదరాబాద్ నుంచే కావడం విశేషం. వ్యాట్, ఎక్సైజ్, రవాణా, రిజిస్ట్రేషన్లు, గనులు, అటవీ, భూముల వంటి ప్రధాన ఆదాయ వనరులతో పాటు ఇతర వనరుల ద్వారా ఈ ఆదాయం సమకూరుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌కు విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ద్వారా గణనీయంగా ఆదాయం లభిస్తోంది. రూ.34 వేలకు కోట్లకు పైగా ఆదాయంలో ఒక్క వ్యాట్ ద్వారానే రూ.30.5 వేల కోట్లకు పైగా ఆదాయం చేకూరుతుండటం గమనార్హం. రవాణా ద్వారా కూడా మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే ఎక్కువ ఆదాయం గ్రేటర్‌కు వస్తోంది.
రాష్ట్రాదాయంలో సగం హైదరాబాద్‌దే
Published Mon, Aug 19 2013 1:51 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement