గ్రేటర్ ఆర్టీసీకి రూ.15 కోట్లకు పైగా...
ద.మ.రైల్వేకు రూ.46.5 కోట్ల ఆదాయం
సిటీబ్యూరో: గ్రేటర్ ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వేలకు గోదావరి పుష్కరాలు కాసుల వర్షం కురిపించాయి. గోదావరి పుష్కరాలకు నగరం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు వెళ్లారు. ఆర్టీసీ 19 వేల ట్రిప్పులు నడిపినట్లు అంచనా. సుమారు 8 లక్షల మందికి పైగా భద్రాచలం, బాసర, ధర్మపురి, కాళేశ్వరం,పోచంపాడు తదితర ప్రాంతాలకు తరలి వెళ్లారు. పుష్కర ఘాట్‌లకు తరలించడమే కాకుండా తిరిగి నగరానికి చేరవే సేందుకు అత్యధిక ట్రిప్పులు నడిపినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పురుషోత్తమ్ నాయక్ తెలిపారు. ఆర్టీసీ అంచనాల మేరకు సుమారు రూ.15 కోట్ల ఆదాయం లభించింది.
పుష్కరాల సందర్భంగా రాజమండ్రితో పాటు, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే 823 ప్రత్యేక రైళ్లను నడిపింది. వీటిలో సుమారు 150 ప్యాసింజర్ రైళ్లు హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడల నుంచి భద్రాచలం, బాసర, రాజమండ్రి, తదితర పుణ్య క్షేత్రాలకు నడిచాయి. దక్షిణ మధ్య రైల్వేకు సుమారు రూ.46.5 కోట్ల ఆదాయం లభించింది. ఇందులో హైదరాబాద్ నుంచి రూ.18 కోట్ల వరకు ఉండవచ్చునని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.
పుష్కరం... లాభాలు పుష్కలం
Published Tue, Jul 28 2015 12:53 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
Advertisement
Advertisement