నిజాంసాగర్, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీకి చెందిన జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే ఆదివారం సాయంత్రం టీఆర్‌ఎస్ లో చేరనున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీ లో చేరుతారు. ఇందుకోసం నియోజకవర్గం నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. నిజాంసాగర్, బి చ్కుంద, జుక్కల్, మద్నూర్, పిట్లం మండలాలకు చెందిన మూడు వేల మంది కార్యకర్తలు, నాయకులను తరలించేందుకు 300 వాహనాలను ఏర్పాటు చేశారు. శనివారం ఎమ్మెల్యే సింధేతో పాటు పార్టీ ముఖ్య నాయకులు కొందరు అన్ని మండలాలలోని గ్రామాలవారీగా ఉన్న శ్రేణులతో ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు.
కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని కోరారు. ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్‌లో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నా, కొందరు వెనుకంజ వేస్తున్నారని సమాచారం. కాగా, తాము వంద వాహనాలలో హైదరాబాద్‌కు తరలివెళ్తున్నామని నిజాంసాగర్ టీడీపీ నాయకులు దుర్గారెడ్డి, రాజు, రమేశ్, గౌడ్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే సిం ధేతో పాటు మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడుతున్నామన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సుమారు వెయ్యి మంది నాయకులు, కార్యకర్తలతో వెళ్తున్నామని చెప్పారు.
నేడు కారెక్కనున్న సింధే
Published Sun, Dec 22 2013 6:39 AM | Last Updated on Sat, Aug 11 2018 4:32 PM
Advertisement
Advertisement