
'టి.బిల్లు మరింత పవిత్రమైంది'
హైదరాబాద్:తెలంగాణ బిల్లు ప్రతులను తగలబెట్టడం అంటే రాజ్యాంగాన్ని ఉల్లఘించడమేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. బిల్లు ప్రతులను తగలబెట్టిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు రాష్ట్రపతికి, కేంద్రానికి వివరిస్తున్నామన్నారు. ఆనాడు అగ్ని ప్రవేశం చేసిన సీతమ్మలా..టి బిల్లుల మరింత పవిత్రమైయ్యాయన్నారు. పండుగను సైతం అపవిత్రం చేసే విధంగా సీమాంధ్ర నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. టీ.బిల్లుపై ఓటింగ్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని ఆయన స్పష్టం చేశారు.