‘విభజన సమయంలో చాలా భయపడ్డం’ | Raja Sadaram honoured by Telangana government | Sakshi
Sakshi News home page

‘విభజన సమయంలో చాలా భయపడ్డం’

Published Fri, Sep 8 2017 2:12 PM | Last Updated on Sat, Aug 18 2018 4:16 PM

‘విభజన సమయంలో చాలా భయపడ్డం’ - Sakshi

‘విభజన సమయంలో చాలా భయపడ్డం’

హైదరాబాద్: నలుగురు సీఎంల వద్ద పనిచేసిన ఘనత రాజా సదారాందని తెలంగాణ శాసనసభా వ్యవహారాలు, నీటిపారుదలశాఖల మంత్రి హరీష్ రావు కొనియాడారు. తెలంగాణ అసెంబ్లీ మాజీ కార్యదర్శి రాజా సదారాం గౌరవ సన్మాన కార్యక్రమం నేడు నిర్వహించారు.

కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు సమయంలో రాజా సదారాం కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. విభజన సమయంలో మాకు కొంత భయమున్నా.. సదారాం ఉన్నారనే నమ్మకం ఉండేదన్నారు. నలుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసిన అనుభవం రాజా సదారాం సొంతమని పేర్కొన్నారు. ఆయన సేవలను తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని హరీష్ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement