హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వాలి
Published Mon, Sep 9 2013 4:52 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
చందెపల్లి(ఆతకూరు(ఎం), న్యూస్‌లైన్ : హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్నే ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ శాసన సభాపక్ష ఉపనాయకుడు టి.హరీష్‌రావు కేంద్రాన్ని డిమాం డ్ చేశారు. ఆదివారం మండలంలోని చందెపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని యన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్‌లో ఈ ప్రాంత ప్రజలు బహిరంగ సభ నిర్వహించుకుంటే లాఠీ చార్జీలు, బైండోవర్లు, ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తున్నారని, అదే సీమాంధ్రులు ఏర్పాటు చేస్తే మటుకు ముఖ్యమంత్రి, డీజీపీ రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక్క సీమాంధ్ర ప్రాంతానికే సీఎంగా వ్యవహరించడం తగదన్నారు. తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని ఆయన సీమాం ధ్రులను హెచ్చరించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఊసరవెల్లి కంటే హీనంగా రంగులు మారుస్తూ తెలంగాణ ఏర్పాటు విషయంలో రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణను అడ్డుకుంది ముమ్మాటికి చంద్రబాబే అన్నా రు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గొంగిడి సునీత మాట్లాడుతూ స్వాతంత్రం తెచ్చింది మహాత్మా గాంధీ అయితే తెలంగాణను తెచ్చింది టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
అంతకు ముందు గ్రామంలో తెలంగాణ వాదులు, టీఆర్‌ఎస్ నాయకులు, గ్రామస్తులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా కళాకారులు నరేష్, పుష్పలత ప్రదర్శించిన ఆటపాటలు ఆకట్టుకున్నాయి. మండలంలోని కాటపల్లి, ముత్తిరెడ్డిగూడెం స్టేజీల వద్ద ఆగిన హరీష్‌రావు పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించారు. పార్టీ మం డల అధ్యక్షుడు డి.రవీందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గొంగిడి మహేందర్‌రెడ్డి, యాస ఇంద్రారెడ్డి, మేడి రామనర్సయ్య, కె.మోహన్‌రెడ్డి, వేముల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement