The Chief Minister
-
15వేల స్కూళ్లలో నర్సరీల అభివృద్ధి - సీఎం చంద్రబాబు
- జులై 1 నుంచి రాష్ట్రమంతా మొక్కలు నాటే కార్యక్రమం - అనంతవరం వన మహోత్సవంలో సీఎం చంద్రబాబునాయుడు విజయవాడ రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల స్కూళ్లలో నర్సరీలను అభివృద్ధి పర్చనున్నామని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. డ్వాక్రా మహిళలకు మొక్కల పెంపకం బాధ్యతతో పాటు.. స్కూళ్ల మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తామని ప్రకటించారు. పచ్చదనం పెంపులో భాగంగా ప్రతి హైస్కూల్నూ నర్సరీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వివరించారు. రాజధాని అమరావతి పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవంలో పాల్గొన్నారు. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 15 లక్షల మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఏడాదికి 50 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. బ్లూ అండ్ గ్రీన్ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో అడవుల విస్తరణకు రూ.350 కోట్లు వెచ్చిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇకపై ఏటా జులై 1వ తేదీ నుంచి రాష్ట్రంలో మొక్కలు నాటే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, మంత్రిపత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, నక్కా అనందబాబు, మాజీ మంత్రి పుష్పరాజ్, నన్నపనేని రాజకుమారి, ఏఎస్ రామకృష్ణ, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి ఏకే ఫరీదా పాల్గొన్నారు. -
3 గంటల్లోనే ముగింపు
రాజమండ్రి : నగరంలో గురువారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జరిపిన పర్యటన.. అంతకు ముందు ఎంత హడావుడిగా ఖరారైందో అంతే హడావుడిగా జరిగింది. ఒకవైపు వర్షం, మరోవైపు ఆయన రాక ఆలస్యం కావడంతో పర్యటన మూడు గంటల్లోపే ముగిసింది. రాక ఆలస్యం కావడంతో సీఎం పుష్కర పనుల పరిశీలన రద్దు కాగా, సరిగ్గా గంటం పావులో సమీక్షా సమావేశం ముగించి ఆయన విజయవాడ బయలుదేరారు. పుష్కర పనులు మందకొడిగా సాగుతున్నాయనే విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రాజమండ్రి పర్యటనకు వచ్చారు. నిర్ణీత కార్యక్రమం ప్రకారం ఆయన ఉదయం పది గంటలకు ప్రత్యేక విమానంలో మధురపూడి చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్లో పట్టిసీమ వెళ్లాల్సి ఉంది. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు మధురపూడి చేరుకుని అక్కడ నుంచి 1.30 గంటలకు కోటిలింగాల, పుష్కరఘాట్లను పరిశీలించాలి. అనంతరం ఆర్అండ్బీ అతిథిగృహంలో సమీక్షా సమావేశంలో పాల్గొనాలి. అయితే బాబు విజయవాడ నుంచి హెలికాప్టర్లో పట్టిసీమ వెళ్లి, అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు మధురపూడి చేరుకున్నారు. ఈ సమయంలో రాజమండ్రిలో భారీ వర్షం పడుతోంది. దీనితో ఘాట్ల పరిశీలన రద్దు చేసుకుని విమానాశ్రయం నుంచి 4.15 గంటలకు ఆర్అండ్బీ అతిథిగృహం చేరుకున్నారు. దారిలో రాజమండ్రి రూరల్ మండలం గాడాలలో మధురపూడి - రాజమండ్రి నాలుగులేన్ల రోడ్డులో నాటిన మొక్కలను పరిశీలించారు. ఆర్ అండ్ బీ అతిథిగృహంలో సుమారు 1.15 గంటల పాటు సమీక్షా సమావేశం నిర్వహించిన బాబు అక్కడి నుంచి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని సాయంత్రం 6.30 గంటలకు విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద రాజమండ్రికి చెందిన అర్చక సమాఖ్య నాయకులు ముఖ్యమంత్రిని కలిసి పుష్కరాల సమయంలో పిండప్రదాన, ఇతర కార్యక్రమాలకు ధరలు నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. తమకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞాపన పత్రం అందజేశారు. ఆద్యంతం గందరగోళం.. ముఖ్యమంత్రి మధురపూడిలో దిగిన వెంటనే పుష్కరఘాట్ పరిశీలనకు వెళుతున్నట్టు చెప్పారు. తరువాత అది కాస్తా రద్దయింది. తర్వాత.. రాత్రికి ఆయన రాజమండ్రి ఆర్అండ్బీ అతిథిగృహంలో బస చేస్తారని, శుక్రవారం ఉదయం ఘాట్లను పరిశీలిస్తారనే సమాచారం వచ్చింది. తరువాత అది కూడా రద్దయినట్టు చెప్పారు. చివరకు సమీక్షా సమావేశం తరువాత మీడియాతో మాట్లాడతారని సమాచార శాఖాధికారులు చెప్పినప్పటికీ అది రద్దరుుంది. ‘ఓటుకు నోటు’ కేసు విషయాన్ని మీడియా లేవనెత్తుతోందనే అనుమానంతో బాబు మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నట్టు తెలిసింది. మొత్తం మీద బాబు జిల్లా పర్యటన 1.15 గంటల సమీక్షతో ముగిసిపోయింది. పర్యటనలో చంద్రబాబు ముభావంగా కనిపించారు. పార్టీ నేతలతో సైతం ఆయన పెద్దగా మనస్సు విప్పి మాట్లాడలేదని సమాచారం. -
11న తీర్పు?
అన్నాడీఎంకే పార్టీలో ఆందోళన, అన్ని రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ, దేశం చూపు కర్ణాటక హైకోర్టు వైపు అనే రీతిలో రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఎదుర్కొంటున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈనెల 11వ తేదీ తీర్పు వెలువడుతుందని తెలియడమే ఈ పరిస్థితులకు కారణం. - పార్టీ శ్రేణుల్లో భీతి - రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ - న్యాయవాదులు, మీడియా - బెంగళూరులో మకాం చెన్నై, సాక్షి ప్రతినిధి: ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని 1991-96 మధ్య కాలంలో జయలలిత *66.64 కోట్లు అక్రమార్జన చేశారని డీఎంకే మోపిన అభియోగంపై 18 ఏళ్లు నడిచిన కేసులో కర్ణాటక ప్రత్యేక కోర్టు తీర్పుచెప్పింది. నాలుగేళ్ల జైలు శిక్ష, *100 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఇదే కేసులో భాగంగా జయ నెచ్చెలి శశికళ, మాజీ దత్తపుత్రుడు సుధాకర్, ఇళవరసిలకు తలా రూ.10 కోట్లు జరిమానా, నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. జయ సహా నలుగురూ 22 రోజుల పాటూ కర్ణాటక జైలులో ఖైదీలుగా ఉండి బెయిల్‌పై వచ్చారు. తనకు పడిన శిక్షపై జయ సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా, కర్ణాటక హైకోర్టు అప్పీలు కేసును విచారిస్తోంది. మూడునెలల్లోగా కేసులో తీర్పుచెప్పాలన్న సుప్రీం ఆదేశాలతో వాదోపవాదాలు వేగంగా సాగాయి. అప్పీలు కేసు దాదాపు పూర్తయిన దశలో తీర్పుపై ఐదురోజులుగా అంచనాలు బయలుదేరాయి. శని, ఆదివారాలు కోర్టుకు శలవుదినాల దృష్ట్యా ఈనెల 11వ తేదీన సోమవారం నాడు తీర్పు వెలువడడం ఖాయమని తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన మీడియా ప్రతినిధులు కొందరు శని, ఆదివారాల్లో బెంగళూరుకు పయనం అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. మరో ఏడాదిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఈ తీర్పు పార్టీ భవిష్యత్తును ప్రభావితం చేయగలదు. దీంతో అన్ని పార్టీల్లో తీర్పుపై ఆసక్తి నెలకొంది. వెలువడనున్న తీర్పు జయకు సానుకూలమా లేక ప్రతికూలమా అనే చర్చ మొదలైంది. 11వ తేదీన తీర్పును ప్రకటిస్తామనే సమాచారాన్ని శుక్రవారం సాయంత్రమే బెంగళూరు కోర్టు ప్రకటిస్తుందని అందరూ అంచనావేశారు. అన్నాడీఎంకే పార్టీకి చెందిన న్యాయవాదులు బెంగళూరులోనే మకాం వేసి ఉన్నారు. అయితే రాత్రి 7 గంటల వరకు సమాచారం లేదు. అభిమాని కుటుంబానికి *3లక్షలు జయ కేసులో తీర్పు ఎలా ఉంటుందో అనే ఉత్కంఠను భరించలేక ఆత్మాహుతికి పాల్పడిన సేలం జిల్లా అస్తంపట్టికి చెందిన బాలకృష్ణన్ కుటుంబానికి జయ *3లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. -
పరమేశ్వర్ ఆశలపై నీళ్లు
‘దళిత సీఎం’కు ఇది సమయం కాదన్న డిగ్గీరాజా ముఖ్యమంత్రికి కావాల్సిన అన్ని అర్హతలున్నాయన్న కేపీసీసీ చీఫ్ బెంగళూరు: దళిత ముఖ్యమంత్రి డిమాండ్‌ను లేవనెత్తడం ద్వారా ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని భావించిన కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ ఆశలపై కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ నీళ్లు చల్లారు. దళిత నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పేముందంటూ పరమేశ్వర్ శనివారమిక్కడ వ్యాఖ్యలు చేసిన వెంటనే, దళిత సీఎం అంశంపై చర్చించేందుకు ఇది సరైన సమయం కాదంటూ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. శనివారమిక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ మాట్లాడుతూ....‘ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి కావాల్సిన అన్ని అర్హతలు నాకున్నాయి. అందువల్ల అవకాశం వచ్చినపుడు తప్పకుండా ఆ స్థానాన్ని చేపడతాను’ అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను ముఖ్యమంత్రి పదవి కాంక్షితుల్లో ఒకడినని, అయితే ఎన్నికల్లో ప్రజలు తనను తిరస్కరించారని అన్నారు. అంతమాత్రాన తనకు ముఖ్యమంత్రినయ్యే అర్హత లేదనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇక కొన్ని దళిత సంఘాలు చేస్తున్న దళిత సీఎం డిమాండ్‌లో తప్పేమీ లేదని, వారి అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వాతంత్య్రం వారికి ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఇక ముఖ్యమంత్రి పదవి కోసం తనే దళిత సంఘాల నేతలతో ‘దళిత సీఎం’ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చాననడంలో ఎంతమాత్రం నిజం లేదని పరమేశ్వర్ వెల్లడించారు. కాగా, పరమేశ్వర్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు పరమేశ్వర్ ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాయని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. శనివారమిక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న దిగ్విజయ్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ...‘దళిత సీఎం అంశంపై చర్చించేందుకు ఇది సరైన సమయం కాదు. రాష్ట్రంలో ప్రస్తుతం వినిపిస్తున్న దళిత సీఎం విషయంపై ఇప్పుడు నేనేమీ మాట్లాడలేను. అసలు దళిత సీఎం విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ప్రస్తుతం లేదు’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యల ద్వారా సీఎం పీఠాన్ని దక్కించుకోవాలనుకున్న పరమేశ్వర్‌కు దిగ్విజయ్ సింగ్ తాత్కాలికంగా బ్రేక్ వేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
భారీ భద్రత నడుమ సీఎం పర్యటన
నెల్లూరు(క్రైమ్) : భారీ భద్రత ఏర్పాట్ల నడుమ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నెల్లూరు నగర, కోవూరు పర్యటన సాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పర్యటన ముగియడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లా పోలీసులతో పాటు ప్రకాశం, గుంటూరు జిల్లాల పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. గుంటూర్ రేంజ్ ఐజీ పి.వి.సునీల్‌కుమార్, సీఎం భద్రత అధికారి చిట్టెయ్యలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. చంద్రబాబునాయుడు రేణిగుంట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 10 గంటలకు నెల్లూరు పోలీసు కవాతు మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకోవాల్సి ఉండగా సుమారు గంట ఆలస్యంగా వచ్చారు. ఉదయం 8.30 గంటలకే టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాళ్లపాక అనురాధ, నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు అంచెలవాణి, మాజీ ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం, కంభం విజయరామిరెడ్డి, పరసా రత్నం, బీద మస్తాన్‌రావు, మాజీ ఎంపీ ఉక్కాల రాజేశ్వరమ్మ, నాయకులు బెజవాడ ఓబుల్‌రెడ్డి, వేనాటి రామచంద్రారెడ్డి, తాళ్లపాక రమేష్‌రెడ్డి, జెడ్.శివప్రసాద్, కిలారి వెంకటస్వామి నాయుడు, నువ్వుల మంజుల, యారం మంజుల, జ్యోత్స్నలత తదితరులు కవాతు మైదానంలోని పోలీసు అతిథిగృహానికి చేరుకున్నారు. విక్రమ సింహపురి వర్సిటీ వీసీ రాజారెడ్డి, సీని యర్ ఐఏఎస్ అధికారులు అనంతరామ్, వాణిమోహన్, కలెక్టర్ శ్రీకాంత్, ఎస్పీ సెంథిల్‌కుమార్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెం డెంట్ డాక్టర్ కె. శ్రీనివాస్ తదితరులు కూడా ఇక్కడికి వచ్చారు. సుమారు ఉదయం 11.05 గంటలకు వచ్చిన సీఎంకు టీడీపీ నాయకులు, అధికారులు పుష్పగుచ్ఛాలిచ్చి ఘన స్వాగతం పలికారు. సమయాభావం కావడంతో పోతిరెడ్డిపాలెంలోని కార్యక్రమాలను అధికారులు రద్దుచేశారు. దీంతో ఆయన ప్రత్యేక వాహనంలో హెలిప్యాడ్ నుంచి రోడ్డుమార్గాన వెంకటేశ్వరపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చేరుకున్నారు. ఇక్కడి బహిరంగ సభ ముగించుకొని మధ్యాహ్నం 2.45 గంటలకు పోలీసు కవాతు మైదానానికి చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం పోలీసు అతిథిగృహంలో ముఖ్యమంత్రి భోజనం చేయాల్సి ఉంది. సమయం మించిపోవడంతో ఆయన ప్రత్యేక బస్సులోనే భోజనం చేశారు. బస్సులోనే కొద్దిసేపు మంత్రి నారాయణ, బీద రవిచంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో పాటు నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడు, నూనె మల్లికార్జునయాదవ్లతో పాటు పలువురితో మాట్లాడారు. మధ్యాహ్నం 3 గంటలకు పోలీసు కవాతు మైదానం నుంచి మంత్రి నారాయణ, కలెక్టర్‌తో కలిసి ఆయన హెలికాప్టర్లో డక్కిలికి బయలుదేరి వెళ్లారు. టీడీపీ నాయకులు, అధికారులు హెలిప్యాడ్ వద్ద సీఎంకు వీడ్కోలు పలికారు. టీడీపీ సీనియర్ నాయకుడు బెజవాడ ఓబుల్‌రెడ్డి కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన టెంట్లో కూర్చొని ఉండగా ఎండ తీవ్రత కు సొమ్మసిల్లిపడిపోయారు. పార్టీ నాయకులు ఆయన్ను పోలీసు అతిథి గృహంలోకి తీసుకెళ్లి గ్లూకోజ్ నీరు ఇవ్వడంతో తేరుకున్నారు. -
ఒట్టి హామీలే !
వినుకొండ/శావల్యాపురం/ సాక్షి,గుంటూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా పర్యటనలో ఆద్యంతం ఒట్టి హామీలతోనే సరిపుచ్చారు. బుధవారం జిల్లాలోని వినుకొండ, రేపల్లె నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన ఎక్కడా రైతుల ఊసెత్తలేదు. తొలుత వినుకొండ చేరుకున్న సీఎం అక్కడి ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. సుమారు అర్ధ గంటపాటు మాట్లాడిన విద్యార్థులు స్వచ్ఛ్ భారత్ ఆవశ్యకతను వివరించారు. పాఠ్యపుస్తకాల బరువుతో పడుతున్న అవస్థలను తెలియజేశారు. అన్నిచోట్లా అవినీతి పెచ్చుమీరిందని చెప్పారు. విద్యార్థుల ప్రసంగాలకు ఆశ్చర్యం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి మెరికల్లా, చిచ్చరపిడుగుల్లా ఉన్నారంటూ వారిని అభినందించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ వినుకొండను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతానన్నారు. పట్టణంలో పశువైద్య కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీర్ఘకాలంగా ఫ్లోరైడ్ బారిన పడుతున్న వినుకొండ, ఒట్టి హామీలే ! ఠమొదటిపేజీ తరువాయి మాచర్ల, గురజాల ప్రాంతాల ప్రజలకు సాగర్ జలాలు అందేవిధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు పుస్తకాల భారాన్ని తగ్గించేందుకు ట్యాబ్లాయిడ్లు అందుబాటులోకి తెస్తానని తెలిపారు. గురుకుల పాఠశాలలకు సమానంగా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనల చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకొక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తానన్నారు. అనంతరం శివయ్యస్థూపం సెంటర్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. మండల కేంద్రమైన శావల్యాపురం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీఎం 121 డ్వాక్రా సంఘాల సభ్యులకు రూ.5 కోట్ల రుణాల చెక్కు అందజేశారు. ఎమ్మెల్యే జీవీ మాట్లాడుతూ నియోజకవర్గానికి తాగునీటి సౌకర్యం తీర్చాలని కోరటంతోపాటు సీఎం వెటర్నరీ కాలేజీ ఏర్పాటుకు హామీ ఇవ్వటంపై కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని నిర్మాణానికి శివశక్తి పౌండేషన్ ఆధ్వర్యంలో రూ.10 లక్షల చెక్కును ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు దంపతులు ఘనంగా సత్కరించారు. కార్యకర్తలు గజమాలను బహూకరించారు. యువ నాయకులు నాగలిని బహూకరించారు. ఇటీవల ఆధార్ కార్డు, రేషన్ కార్డుల్లో తప్పులు ఉన్నాయని పింఛన్లు తొలగించిన వయ్యకల్లు, బొందిలిపాలెం, మతుకుమల్లి గ్రామాల నుంచి వచ్చిన వృద్ధులు, రుణమాఫీపై ప్రశ్నించేందుకు వచ్చిన రైతులను సీఎంను కలిసేందుకు అనుమతించలేదు.చివరకు వారంతా వెనుదిరిగి వెళ్లిపోయారు. సాగు నీటి సమస్యలతో రైతులు పీకల్లోతు ఇబ్బందుల్లో ఉన్నా సీఎం ఆ ఊసెత్తకపోవడంతో రైతులు నిరాశకు గుర య్యారు. నాగార్జునసాగర్‌లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు జోన్ -2 పరిధిలోని పలు ప్రాంతాల్లోని రైతాంగం నాట్లు వేయని దుస్థితి ఉన్నా ప్రజాప్రతినిధులు సైతం సీఎం దృష్టికి తీసుకువెళ్లకపోవడంతో సభలకు హాజరైన రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపి రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్, ఎమ్మెల్సీ నన్నప నేని రాజకుమారి, పిన్నెల్లి లక్ష్మారెడ్డి, కుర్రి పున్నారెడ్డి, నలబోలు వెంకట్రామయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జాన్‌బీ, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జిల్లా అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానానికి సహకరించాలి జిల్లాలోని రైతులు ల్యాండ్ పూలింగ్ విధానానికి సహకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు. రేపల్లె నియోజకవర్గం నగరంలో జరిగిన ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. భూసేకరణ విషయంలో జిల్లాలోని రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.అనంత రం ముత్తుపల్లిల్లో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో యానిమేటర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ డివిజన్ నాయకులు సీహెచ్. మణిలాల్ ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమంలో మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, నక్కా అనంద్‌బాబు, తెనాలి శ్రావణ్ కుమార్, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు, జియాఉద్దీన్, జేసీ సీహెచ్. శ్రీధర్, డీఆర్డీఏ పీడీ ప్రశాంతి, ఎంపీపీ వి.వీరయ్య పాల్గొన్నారు. -
నేడు సీఎం రాక
సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం జిల్లాకు రానున్నారు. వినుకొండ, రేపల్లె నియోజకవర్గాల్లో జరిగే ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే సీఎం పర్యటన ఏర్పాట్లను మంగళవారం శావల్యాపురంలో పరిశీలించారు. రాష్ట్ర రాజధాని ఏర్పాటులో గుంటూరు జిల్లా కీలకం కానున్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటన సైతం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడ పరిసరాల్లో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన అనంతరం సీఎం చంద్రబాబు జిల్లాకు రావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో రాజధానికి సంబంధించి భూసేకరణపై స్పష్టమైన ప్రకటన చేస్తే బాగుంటుందని జిల్లాప్రజలు ఆశగాఎదురు చూస్తున్నారు. టెక్స్టైల్ పార్కు నిమిత్తం యడ్లపాడు మండలం బోయపాలెం వద్ద శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ప్రారంభమే కాలేదు. స్పైసెస్ పార్కు పనులు పూర్తయినప్పటి కీ ప్రారంభానికి నోచుకోలేదు. వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపి త్వరితగతిన అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు సూచిస్తున్నారు. రుణ మాఫీపై రైతులు, మహిళలు, చేనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు అందక రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. దీనికి తోడు వ్యవసాయ పనిముట్లు, ప్రోత్సాహాలు సైతం ప్రభుత్వం నుంచి సరిగా అందకపోవడంతో అందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 15 వేల మందికి పైగా కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇచ్చినా వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి పర్యటించే వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు, బొల్లాపల్లి, నూజెండ్లలో ఫ్లోరిన్ సమస్యతో అక్కడి ప్రజలు సతమతమవుతున్నారు. ఆప్రాంత వాసులు మంచినీటికి శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. వెనకబడిన పల్నాడు ప్రాంతంలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు చేసిన ప్రకటన కార్య రూపం దాల్చలేదు. రేపల్లె నియోజకవర్గంలో ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. నిజాంపట్నం హార్బర్ అభివృద్ధికి కొన్ని ఏళ్ల కిందటే రూ. 200 కోట్లతో జెట్టి నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ అటవీ అనుమతులు, సాంకేతిక కారణాల నేపథ్యంలో పనులు ప్రారంభం కాకపోవడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యకారుల సంక్షేమం సైతం అటకెక్కింది. తమిళనాడు తరహాలో ప్యాకేజీని ఇవ్వాలని ఇక్కడి మత్స్యకారులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా సముద్ర తీరం వెంబడి హార్బర్లను అభివృద్ధి చేయాలని వేడుకుంటున్నారు. రేపల్లె పట్టణం పేరుకు మున్సిపాలిటీ అయినప్పటికీ అక్కడ వర్షం వస్తే నగరం నడిబొడ్డులో సైతం మోకాలి లోతు నీరు నిలిచి ఉంటుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనతో పట్టణానికి ఏమైనా వరాలు కురిపిస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో ముఖ్యంగా కొండవీడు, అమరావతి, వంటి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక ప్యాకేజి ప్రకటిస్తే బాగుంటుందనే భావన వ్యక్తమవుతోంది. నాగార్జునసాగర్ ఆధునికీకరణ పనుల నత్తనడకన సాగుతున్నాయి. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి పునరావాస పనులు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. జిల్లా వ్యాప్తంగా నత్తనడకన జరుగుతున్న జలయజ్ఞం పనుల్లో కదలిక తెచ్చి ఆయకట్టును అభివృద్ధి చేస్తారేమోనన్న ఆశ జిల్లా ప్రజల్లో కనిపిస్తుంది. గుంటూరు నగరాన్ని మెగా సిటీగా ప్రకటించాలని నగర వాసులు కోరుకుంటున్నారు. -
అబ్బే.. అదేం లేదు!
ముంబై: పక్షం రోజుల కిందట ముఖ్యమంత్రి కావాలన్న అభిలాషను వ్యక్తం చేసిన శివసేన అధినేత ఉద్ధవ ఠాక్రే ఇప్పుడు మాట మార్చారు. తనకు అటువంటి కోరికే లేదని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనకు మద్దతు తెలిపేందుకు, తనను ఆశీర్వదించేందుకు వార్కారీ సమాజ్‌కు చెందిన వారు మంగళవారం తన వద్దకు వచ్చారని ఉద్ధవ్ తెలిపారు. తనపట్ల వారు కురిపించిన ప్రేమ తనకు చాలని అన్నారు. తనకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ లేదని చెప్పారు. విఠల్ భక్తులైన వార్కారీ సమాజ్ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి కావాలని ఉంటుందని, ఆ కుర్చీ కోసం పోట్లాడుతారని అన్నారు. ‘నేను ఎంత అదృష్టవంతుడినో చూడండి. నా తలపై కిరీటం వద్దని నేననుకుంటున్నాను. ప్రజలేమో నన్ను సీఎంగా చూడాలనుకుంటున్నారు. ఈ ప్రేమను గెలుచుకోవాలి’ అని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. మరోవైపు కాషాయ కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్ ఉండాలని శివసేన పట్టుబడుతోంది. కానీ బీజేపీ మాత్రం ఎన్నికల తర్వాతనే నాయకుడిని ప్రకటించాలని భావిస్తోంది. ఈనెల 13 వ తేదీన ఓ టీవీ చానెల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఉద్ధవ్ ఠాక్రే, మొదటిసారిగా ఓ బహిరంగ వేదికపై నుంచి, తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు తనకో అవకాశం ఇవ్వాలని కోరుతున్నానని, ఆపై వారికి ఫిర్యాదు చేసే అవకాశం తానివ్వబోనని ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రి పదవి కోసం కలలు కనడం లేదని, అయితే ఆ బాధ్యత లభిస్తే మాత్రం వెనుకంజ వేయబోనని చెప్పారు. నేటి దినాల్లో ముఖ్యమంత్రులు ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం లేదని, వైమానిక సందర్శనలు చేసి ఆ తర్వాత పండర్పూర్ యాత్రకు వెళ్లిపోతారని ఉద్ధవ్ విమర్శించారు. ఎమ్మెన్నెస్‌పై కూడా ఉద్ధవ్ విమర్శలు సంధించారు. ప్రస్తుతం కాంగ్రెస్, ఎన్సీపీపై తాము పోరాడుతున్నామని,ఈ బరిలో మూడో పక్షం కూడా ఉందని ఆయన ఎమ్మెన్నెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ మూడో ఖాళీ ఎన్నడూ భర్తీ కాదని, అవసరమైతే దానికి (ఎమ్మెన్నెస్) వ్యతిరేకంగా కూడా తాము పోరాడుతామని ఠాక్రే స్పష్టం చేశారు. నిర్లక్ష్యాన్ని సహించం: రాందాస్ సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో తమను నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని మహాకూటమి నాయకులను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే హెచ్చరించారు. మంత్రాలయలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. మహాకూటమిలో సీట్లసర్దుబాటుపై లుకలుకలుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాకూటమికి తమతో అవసరం లేదనుకుంటే, ఆ విషయాన్ని తమకు ముఖాముఖి చెప్పేస్తే ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కుంటామన్నారు. ఇరుపార్టీల నాయకులు తొందరపడవద్దని హితవు పలికారు. ‘పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ ప్రజాస్వామ్య కూటమిని గద్దె దింపే సమయం ఆసన్నమైంది.. మహాకూటమికి అధికారాన్ని చేజిక్కించుకునే సమయం దగ్గరపడింది..ఇలాంటి సందర్భంలో గత 25 ఏళ్లుగా కొనసాగుతున్న బంధాన్ని చెడగొట్టుకోవడం భావ్యంకాద’న్నారు. ఇరు పార్టీల నాయకుల్లో ఎవరో ఒకరు కొంత మెతక వైఖరి అవలంభించాలని ఆయన సూచించారు. లేదంటే అధికారం కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి చేతిలోకి వెళుతుందని హెచ్చరించారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తనతో సంప్రదించిన విషయం వాస్తవేమనన్నారు. దళితుల ఓట్లు గ్రేస్ మార్కుల లాంటివని, ఒకవేళ మహాకూటమి పొత్తు బెడిసి కొడితే ఎన్సీపీలోకి రావాలని పవార్ విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ఒకవేళ మహాకూటమి విడిపోతే తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే, అత్యధిక స్థానాలు ఇచ్చే పార్టీకి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. -
కరుణపై మరో దావా, విజయకాంత్‌కు అరెస్ట్ వారెంట్ జారీ
డీఎంకే అధినేత కరుణానిధిపై ముఖ్యమంత్రి జయలలిత మరో పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్‌ను ఆమె తరపున కార్పొరేషన్ న్యాయవాది ఎం.ఎల్.జగన్ బుధవారం చెన్నై మొదటి సెషన్స్ కోర్టులో దాఖలు చేశారు. అలాగే డీఎండీకే అధినేత విజయకాంత్‌కు తంజావూరు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా ఆధార రహిత ఆరోపణలు ఎవరు చేసినా పరువు నష్టం దావాల మోత మోగుతోంది. ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్‌పై రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో కేసులు దాఖలై ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిపై రెండేళ్ల కాలంలో పది పరువు నష్టం దావా పిటిషన్లను జయలలిత దాఖలు చేశారు. ఈ పిటిషన్లలో కొన్నింటి నుంచి కరుణకు విముక్తి లభించింది. మరికొన్ని పిటిషన్ల విచారణకు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా కరుణానిధిపై 11వ పిటిషన్‌ను జయలలిత బుధవారం దాఖలు చేశారు. ఇదీ కారణం కార్పొరేషన్ న్యాయవాది ఎం.ఎల్.జగన్ చెన్నై మొదటి సెషన్స్ కోర్టులో బుధవారం ఉదయం పిటిషన్ దాఖలు చేశారు. గత నెలలో మద్రాసు వర్సిటీ స్నాతకోత్సవం ఘనంగా జరిగిందని తెలిపారు. ఇందులో ముఖ్యమంత్రి జయలలిత ప్రసంగిస్తున్న సమయంలో మంత్రులు హాయిగా నిద్రపోయారంటూ కల్పిత చిత్రాలతో మురసోలి పత్రిక కథనం ప్రచురించిందని పేర్కొన్నారు. ఆమె ప్రసంగాన్ని మంత్రులు వింటూ ఉంటే వాళ్లందరూ నిద్ర పోయినట్టు కథనాన్ని ప్రచురించి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జయలలిత ప్రతిష్టకు భంగం కలిగించారని వివరించారు. ఈ దృష్ట్యా కరుణానిధిపై సెక్షన్ 500, 501 కింద పరువు నష్టం పిటిషన్లు దాఖలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి చొక్కలింగం త్వరలో విచారణ చేపట్టనున్నారు. కెప్టెన్‌కు అరెస్ట్ వారెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్‌కు తంజావూరు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. కెప్టెన్ తన పుట్టినరోజును పురస్కరించుకుని గత ఏడాది అన్ని జిల్లాల్లో పర్యటించారు. ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే ఆయనకు అనేక కోర్టులు పీటీ వారెంట్ జారీ చేశారుు. కోర్టుకు డుమ్మా కొడుతూ వస్తున్న విజయకాంత్‌పై తంజావూరు కోర్టు బుధవారం కన్నెర్ర చేసింది. మూడు వాయిదాలకు ఆయన రాకపోవడంతో న్యాయమూర్తి సేతుమాధవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో జిల్లా కోర్టులో జరుగుతున్న విచారణకు హాజరు కావాల్సి ఉన్నందునే ఇక్కడి రాలేదంటూ విజయకాంత్ తరపు న్యాయవాదులు వాదించినా ఫలితం లేకపోయింది. విజయకాంత్‌ను కోర్టులో హాజరు పరచాలంటూ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు. -
హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వాలి
చందెపల్లి(ఆతకూరు(ఎం), న్యూస్‌లైన్ : హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్నే ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ శాసన సభాపక్ష ఉపనాయకుడు టి.హరీష్‌రావు కేంద్రాన్ని డిమాం డ్ చేశారు. ఆదివారం మండలంలోని చందెపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని యన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్‌లో ఈ ప్రాంత ప్రజలు బహిరంగ సభ నిర్వహించుకుంటే లాఠీ చార్జీలు, బైండోవర్లు, ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తున్నారని, అదే సీమాంధ్రులు ఏర్పాటు చేస్తే మటుకు ముఖ్యమంత్రి, డీజీపీ రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక్క సీమాంధ్ర ప్రాంతానికే సీఎంగా వ్యవహరించడం తగదన్నారు. తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని ఆయన సీమాం ధ్రులను హెచ్చరించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఊసరవెల్లి కంటే హీనంగా రంగులు మారుస్తూ తెలంగాణ ఏర్పాటు విషయంలో రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణను అడ్డుకుంది ముమ్మాటికి చంద్రబాబే అన్నా రు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గొంగిడి సునీత మాట్లాడుతూ స్వాతంత్రం తెచ్చింది మహాత్మా గాంధీ అయితే తెలంగాణను తెచ్చింది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అంతకు ముందు గ్రామంలో తెలంగాణ వాదులు, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా కళాకారులు నరేష్, పుష్పలత ప్రదర్శించిన ఆటపాటలు ఆకట్టుకున్నాయి. మండలంలోని కాటపల్లి, ముత్తిరెడ్డిగూడెం స్టేజీల వద్ద ఆగిన హరీష్‌రావు పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. పార్టీ మం డల అధ్యక్షుడు డి.రవీందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గొంగిడి మహేందర్‌రెడ్డి, యాస ఇంద్రారెడ్డి, మేడి రామనర్సయ్య, కె.మోహన్‌రెడ్డి, వేముల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికులకు చార్జీల చిట్టా
ఆటోచార్జీల వివరాలతో కూడిన ప్యాకెట్ చిట్టాను ప్రయాణికులకు పంపిణీ చేయనున్నారు. రెండు లక్షల చిట్టాలను రవాణాశాఖ సిద్ధం చేసింది. మరోవైపు ఆటో కార్మిక సంఘాలు ముఖ్యమంత్రి జయలలితతో మంగళవారం భేటీ అయ్యాయి. ఆటోలకు చార్జీలు ఖరారు చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలిపాయి. సాక్షి, చెన్నై: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చెన్నైలో నిర్ణీత ఆటోచార్జీల్ని ప్రభుత్వం గత నెలలో ప్రకటించింది. కనీస చార్జీగా రూ.25 నిర్ణయించింది. అలాగే 1.8 కిలోమీటర్ల అనంతరం ప్రతి కిలోమీటర్‌కు రూ.12 తీసుకోవాలి. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు మీటరుపై యాభై శాతం అదనపు చార్జీ వసూళ్లు చేసుకోవచ్చు. ప్రతి ఐదు నిమిషాలకు వెయిటింగ్ చార్జీ 3.50 రూపాయలుగా నిర్ణయించింది. అలాగే జీపీఎస్, బిల్లింగ్ సౌకర్యంతో కూడిన మీటర్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 15వ తేదీలోపు చార్జీలను అమలు చేయడమే లక్ష్యంగా రవాణాశాఖ కసరత్తులు చేస్తోంది. చెన్నై మహానగరంలో 77 వేల వరకు ఆటోలు ఉన్నాయి. చార్జీల వివరాలతో కూడిన కరపత్రాల్ని ట్రాఫిక్, రవాణా సిబ్బంది ద్వారా ఆటోడ్రైవర్లు, యజమానులకు సిబ్బంది అందజేస్తున్నారు. ప్యాకెట్ చిట్టా చార్జీలపై ప్రయూణికులకు సైతం అవగాహన కల్పిం చేందుకు రవాణాశాఖ నిర్ణయించింది. ప్యాకెట్ క్యాలెం డర్ తరహాలో చిట్టాను సిద్ధం చేసింది. తొలి విడతగా నగరంలో రెండు లక్షల ప్యాకెట్ చిట్టాల్ని పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంది. అలాగే ప్రయూణికులతో వ్యవహరించాల్సిన తీరుపై ఆటోడ్రైవర్లకు శిక్షణ ఇచ్చేం దుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ముఖ్యమంత్రితో భేటీ ఆటోచార్జీలు ఖరారు చేయడం పట్ల ఆటో సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సంఘాల నేతలు ముఖ్యమంత్రి జయలలితతో మంగళవారం భేటీ అయ్యారు. రవాణాశాఖ మంత్రి సెంథిల్ బాలాజీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్, ఏఐటీయూసీ అనుబంధ ఆటో కార్మిక సంఘం, మద్రాసు మెట్రో ఆటో కార్మిక సంఘం, ఐఎన్టీయూసీ తదితర సంఘాల నాయకులు శేషసాయి, లక్ష్మణన్, మారియప్పన్, స్వామినాథన్, అశోకన్ తదితరులు హాజరయ్యూరు. ఆటోచార్జీలు ఖరారు చేయడం పట్ల ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు జయలలిత సానుకూలంగా స్పందించారు. చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ భేటీ అనంతరం ఆటో కార్మిక సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఆటో కార్మికుల్ని ఇంత వరకు ఏ ముఖ్యమంత్రీ ఆహ్వానించిన దాఖలాలు లేవన్నారు. తమతో జయలలిత సమావేశం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. -
‘ఎఫ్ఐఆర్’పై హైకోర్టుకు ఢిల్లీ సర్కారు
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం హైకోర్టును ఆశ్రయించింది. 2008 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పార్టీ ప్రచారం నిమిత్తం రూ. 11 కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ బీజేపీ నేత విజేంద్ర గుప్తా, ఆర్టీఐ కార్యకర్త వివేక్ గార్గ్ స్థానిక లోకాయుక్తలో ఫిర్యాదుచేశారు. దీనిపై విచారించిన ఆ కోర్టు నిధుల దుర్వినియోగం విషయంలో సీఎం షీలాదీక్షిత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని గత నెల 31న ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వెంకటరమణ, జస్టిస్ ప్రదీప్ నంద్రజోగ్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ కేసు అత్యంత ముఖ్యమైంది కాబట్టి ఈ రోజే దీనిపై విచారణ జరపాలని ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సిద్ధార్థ్ లూత్రా హైకోర్టును కోరడంతో మధ్యాహ్నం గం.2.15 ని.లకు విచారణకు స్వీకరించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ ప్రచారం నిమిత్తం అప్పటి ముఖ్యమంత్రి, ప్రచార శాఖకు ఇన్చార్జిగా ఉన్న షీలాదీక్షిత్ రూ.22.56 కోట్ల రూపాయలను వినియోగించారని బీజేపీ నేత విజేంద్ర గుప్తా స్థానిక లోకాయుక్తలో ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఈ ఏడాది మే 22న ఢిల్లీ లోకాయుక్త జస్టిస్ మన్మోహన్ సరిన్ ముందు ఫిర్యాదు దాఖలు చేశారు. ఆ ఎన్నికల సంవత్సరంలో షీలా ప్రభుత్వం దిన, వారపత్రికల్లో ముమ్మరంగా ప్రకటనలను జారీచేశారని తన ఫిర్యాదులో నివేదించారు. అలాగే యూపీఏ చైర్పర్సన్ సోని యా గాంధీ, షీలాదీక్షిత్ ఫొటోలు ఉన్న పెద్ద పెద్ద హోర్డింగ్‌లను ఢిల్లీ మెట్రో, బస్ షెల్టర్లలో ఏర్పాటుచేశారని, రేడియో, టీవీల్లో సైతం ప్రభుత్వ, కాంగ్రెస్ పార్టీ అనుకూల ప్రచారాలతో హోరెత్తించారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం నిమిత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని, నిధులను విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని విమర్శించారు. కాగాా, దీనిపై విచారణ జరిపిన పిదప లోకాయుక్త తన ఫిర్యాదుతో ఏకీభవించినట్లు గుప్తా పేర్కొన్నారు. షీలాదీక్షిత్ నాయకత్వంలో ఢిల్లీ సర్కారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని, సదరు సొమ్ములో సగం అంటే సుమారు రూ.11 కోట్లను ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ గాని, ఆమె పార్టీగాని తిరిగి చెల్లించేలా హెచ్చరించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లోకాయుక్త కోరినట్లు వివరించారు. బీజేపీ నేతకు హైకోర్టు నోటీసులు ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై ‘ఎఫ్ఐఆర్’ కేసులో బీజేపీ సీనియర్ నాయకుడు విజేంద్ర గుప్తా, సిటీ పోలీస్ కమిషనర్లకు హైకోర్టు మంగళవారం నోటీసులు జారీచేసింది. 2008 ఎన్నికలకు ముందు తమపార్టీ ఎన్నికల ప్రచార నిమిత్తం ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ బీజేపీ సీనియర్ నేత విజేంద్ర గుప్తా ఢిల్లీ లోకాయుక్తను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన లోకాయుక్త పిటిషనర్ వాదనతో ఏకీభవించింది. నిధుల దుర్వినియోగంపై ఎఫ్ఐఆర్ను నమోదుచేయాలని గత నెల 31న పోలీస్‌శాఖను ఆదేశించింది. కాగా, దీనిపై మంగళవారం ఢిల్లీ సర్కారు హైకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వ వాదనపై ఈ నెల 19లోగా స్పందించాలని బీజేపీ సీనియర్ నేత విజేంద్ర గుప్తా, సిటీ పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీచేసింది. -
‘ఎఫ్ఐఆర్’పై హైకోర్టుకు ఢిల్లీ సర్కారు
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం హైకోర్టును ఆశ్రయించింది. 2008 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పార్టీ ప్రచారం నిమిత్తం రూ. 11 కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ బీజేపీ నేత విజేంద్ర గుప్తా, ఆర్టీఐ కార్యకర్త వివేక్ గార్గ్ స్థానిక లోకాయుక్తలో ఫిర్యాదుచేశారు. దీనిపై విచారించిన ఆ కోర్టు నిధుల దుర్వినియోగం విషయంలో సీఎం షీలాదీక్షిత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని గత నెల 31న ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వెంకటరమణ, జస్టిస్ ప్రదీప్ నంద్రజోగ్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ కేసు అత్యంత ముఖ్యమైంది కాబట్టి ఈ రోజే దీనిపై విచారణ జరపాలని ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సిద్ధార్థ్ లూత్రా హైకోర్టును కోరడంతో మధ్యాహ్నం గం.2.15 ని.లకు విచారణకు స్వీకరించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ ప్రచారం నిమిత్తం అప్పటి ముఖ్యమంత్రి, ప్రచార శాఖకు ఇన్చార్జిగా ఉన్న షీలాదీక్షిత్ రూ.22.56 కోట్ల రూపాయలను వినియోగించారని బీజేపీ నేత విజేంద్ర గుప్తా స్థానిక లోకాయుక్తలో ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఈ ఏడాది మే 22న ఢిల్లీ లోకాయుక్త జస్టిస్ మన్మోహన్ సరిన్ ముందు ఫిర్యాదు దాఖలు చేశారు. ఆ ఎన్నికల సంవత్సరంలో షీలా ప్రభుత్వం దిన, వారపత్రికల్లో ముమ్మరంగా ప్రకటనలను జారీచేశారని తన ఫిర్యాదులో నివేదించారు. అలాగే యూపీఏ చైర్పర్సన్ సోని యా గాంధీ, షీలాదీక్షిత్ ఫొటోలు ఉన్న పెద్ద పెద్ద హోర్డింగ్‌లను ఢిల్లీ మెట్రో, బస్ షెల్టర్లలో ఏర్పాటుచేశారని, రేడియో, టీవీల్లో సైతం ప్రభుత్వ, కాంగ్రెస్ పార్టీ అనుకూల ప్రచారాలతో హోరెత్తించారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం నిమిత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని, నిధులను విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని విమర్శించారు. కాగాా, దీనిపై విచారణ జరిపిన పిదప లోకాయుక్త తన ఫిర్యాదుతో ఏకీభవించినట్లు గుప్తా పేర్కొన్నారు. షీలాదీక్షిత్ నాయకత్వంలో ఢిల్లీ సర్కారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని, సదరు సొమ్ములో సగం అంటే సుమారు రూ.11 కోట్లను ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ గాని, ఆమె పార్టీగాని తిరిగి చెల్లించేలా హెచ్చరించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లోకాయుక్త కోరినట్లు వివరించారు. బీజేపీ నేతకు హైకోర్టు నోటీసులు ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై ‘ఎఫ్ఐఆర్’ కేసులో బీజేపీ సీనియర్ నాయకుడు విజేంద్ర గుప్తా, సిటీ పోలీస్ కమిషనర్లకు హైకోర్టు మంగళవారం నోటీసులు జారీచేసింది. 2008 ఎన్నికలకు ముందు తమపార్టీ ఎన్నికల ప్రచార నిమిత్తం ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ బీజేపీ సీనియర్ నేత విజేంద్ర గుప్తా ఢిల్లీ లోకాయుక్తను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన లోకాయుక్త పిటిషనర్ వాదనతో ఏకీభవించింది. నిధుల దుర్వినియోగంపై ఎఫ్ఐఆర్ను నమోదుచేయాలని గత నెల 31న పోలీస్‌శాఖను ఆదేశించింది. కాగా, దీనిపై మంగళవారం ఢిల్లీ సర్కారు హైకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వ వాదనపై ఈ నెల 19లోగా స్పందించాలని బీజేపీ సీనియర్ నేత విజేంద్ర గుప్తా, సిటీ పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీచేసింది. -
మహానేతా.. మనసాస్మరామి..
చెరగని చిరునవ్వు.. చెదరని ఆత్మవిశ్వాసం.. ఎదనిండా మంచితనం.. ఎదురులేని రాజసం.. రాజన్నా! నిన్నెలా మరిచిపోగలం..! అంటూ జిల్లా ప్రజ ఆ మహానేతను తలచుకుంటోంది. నువ్వు దూరమై నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా మా మధ్యనే ఉన్నట్లుంది.. అంటూ గుండె తడి చేసుకుంటోంది. జ్ఞాపకాలను నెమరువేసుకుంటోంది. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా నాటి గురుతుల పునరావలోకనం.. సాక్షి, గుంటూరు : ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడాయన. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లు పాలన అందించిన మహానేత. రైతులకు వైఎస్ పాలన ఓ సువర్ణయుగం. పేదోడు తలెత్తుకుని కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంది ఆయన పరిపాలనలోనే. జిల్లాతో విడదీయలేని అనుబంధం ఉన్న దివంగత మహానేత వైఎస్ దూరమై నేటికి సరిగ్గా నాలుగేళ్లు. రైతుల బతుకుచిత్రాన్ని మార్చే క్రమంలో భాగంగా ఆయన రూ.1.50 లక్షల కోట్లతో జలయజ్ఞం కింద చేపట్టిన 86 ప్రాజెక్టుల్లో మొట్టమొదటిది జిల్లా రైతుల స్థితి గతుల్ని మార్చే పులిచింతల ప్రాజెక్టే. మహానేత వైఎస్ చివరిగా సంతకం చేసిన ఫైల్ కూడా జిల్లాలో మిర్చి రైతులకు వాతావరణ ఆధారిత బీమా కింద ప్రయోజనం చేకూర్చేదే. ఈ బీమాతో జిల్లాలో మిర్చి రైతులు రూ.17 కోట్లకు పైగా లబ్ధిపొందారు. గుంటూరుకు ప్రాధాన్యం.. జిల్లా ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థికంగా, రాజకీయంగా గుంటూరుకు వైఎస్ ఎంతో ప్రాధాన్యం కల్పించారు. జిల్లాకు మంత్రి పదవుల్ని కేటాయించడంతో పాటు పథకాల అమల్లోనూ పెద్దపీట వేశారు. రాష్ట్రవ్యాప్తంగా చేసిన రూ.12 వేల కోట్ల రుణమాఫీలో జిల్లాకు రూ.560 కోట్ల మేర రైతులకు ప్రయోజనం చేకూరింది. ఇందిరప్రభ జిల్లాలో ప్రారంభించి రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేశారు. జిల్లా పరిషత్తు ఉద్యోగులకు యాభై ఏళ్లుగా ఉన్న జీతాల సమస్యను పరిష్కరించి 010 పద్దు కింద తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. గుంటూరు నగరానికి దాహార్తి తీర్చేందుకు రూ.6.50 కోట్లతో తక్కెళ్ళపాడు రా వాటర్ ప్లాంట్ నుంచి తక్కెళ్ళపాడు నీటి శుద్ధి ప్లాంట్ వరకు రెండో పైపు లైన్ నిర్మించారు. నగర ప్రజలకు నీటి కష్టాలు తీర్చిన మహానేతను నగరవాసులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రపంచ బ్యాంకు నిధులైన రూ.460 కోట్లతో చేపట్టనున్న సమగ్ర తాగునీటి పథకానికి అంకురార్పణ చేశారు. దీంతో రాబోయే 40 సంవత్సరాల నగర జనాభా నీటి అవసరాలు తీరనున్నాయి. కోస్తాలో అతి పెద్ద ఆస్పత్రిగా పేరొందిన జీజీహెచ్‌లో మిలీనియం బ్లాక్ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేసిన ఘనత వై.ఎస్.కే దక్కుతుంది. అన్ని వర్గాలకు ప్రయోజనాల్ని కల్పించి భధ్రత కల్పించింది వైఎస్సేనని రాజకీయాలకతీతంగా నేతలు అంగీకరిస్తున్నారంటే జనహృదయాల్లో ఎంతటి చెరగని ముద్ర వేసుకున్నారో అవగతమవుతుంది. జిల్లా మొత్తానికి కృష్ణా జలాలు అందించాలన్న ఆయన ఆశయం ప్రస్తుత ప్రభుత్వం అటకెక్కించింది. రూ.1,281 కోట్ల వ్యయంతో పులిచింతల ప్రాజెక్టును పూర్తిచేసేందుకు అన్ని ప్రాంతాల ప్రజల్లో వ్యక్తమైన వ్యతిరేకత, అపోహల్ని తొలగించి యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు వైఎస్ కృషిచేస్తే ఈ ప్రాజెక్టు నేటికీ పూర్తికాక ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. ఆయన దూరమై నాలుగేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ ఓ కలగానే ఉందని జిల్లా రైతాంగం పేర్కొంటోంది. ఆదుకుంది ఆ మహానేతేనంటూ స్మరించుకుంటున్నారు. ప్రజల మదిలో సుస్థిర స్థానం ప్రత్తిపాడు : సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. పేద, బడుగు, బలహీన వర్గాలతో అన్ని వర్గాల ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చిందాలనే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మహనీయుడాయన. ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళినా.. ప్రత్తిపాడు ప్రజల గుండెల్లో మాత్రం ఆయన గురుతులు మెదులుతూనే ఉన్నాయి. వైఎస్సార్‌కు ప్రత్తిపాడుతో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. తొలిసారిగా ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదాలో 1996 ఏప్రిల్ 16న ప్రచారం నిమిత్తం ప్రత్తిపాడుకు వచ్చారు. అనంతరం 1998లో రెండవసారి వచ్చారు. 1998 సెప్టెంబరు 13న యడ్లపాడు మండలం ఉన్నవ నుంచి ప్రత్తిపాడు మీదుగా ముట్లూరు వరకు మినీ పాదయాత్ర చేశారు. అనంతరం ముఖ్యమంత్రి అయిన తర్వాత 2006 మే 10న సీఎం హోదాలో మొదటిసారిగా ప్రత్తిపాడు వచ్చిన ఆయన ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే వైఎస్ ప్రత్తిపాడుకు రావడం చివరిసారి. ఎన్నికల హామీలను నెరవేర్చి ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. రాజన్నా.. నిను మరువం.. చిలకలూరిపేట రూరల్ : చిలకలూరిపేట ప్రాంతంలోని జన హృదయాల్లో వైఎస్సార్ చిరస్థాయిగా ఉన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమం కోసం నాటి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ప్రతిపాదించిన కార్యక్రమాలకు నిధులు విడుదల చేసి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించారు. ముస్లిం మైనార్టీ బాలికలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాన్ని మర్రి కృషితో పోతవరం గ్రామంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఓగేరు వాగుపై పోతవరం - రాజాపేట మధ్య, మద్దిరాల - గోపాళంవారిపాలెం, కుప్పగంజివాగుపై మద్దిరాల - గోపాళంవారిపాలెం గ్రామాల మధ్య బ్రిడ్జిలు నిర్మించారు. పంటపొలాలకు సాగునీటి ఆయకట్టు పరిధిని పెంపొందించేందుకు బొప్పూడి-3, 4, పసుమర్రు-2, మానుకొండవారిపాలెం, గోపాళంవారిపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుకు నిధులు, యడవల్లి ఎస్సీల భూములను సాగులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక లిఫ్ట్ ఇరిగేషన్లను ఏర్పాటు చేయించారు. అపర భగీరధుడు అచ్చంపేట : దివంగతనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అచ్చంపేట మండలానికి బహుళ ప్రయోజనాలు సమకూరాయి. ముఖ్యమంత్రిగా ఉన్న ఆరేళ్లకాలంలో రెండుసార్లు మండలానికి వచ్చారు. తాగునీటి కష్టాలు తీర్చేందుకు పుట్లగూడెం వద్ద రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు ఆయన చలవే. రైతులు ఏడాదిలో రెండు పంటలు పండించుకునేందుకు నాలుగు ఎత్తిపోతల పథకాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన చేసిన కృషి ఇక్కడి ప్రజలు మరచిపోరు. చెంతనే కృష్ణానది పారుతున్నా మంచినీటికి నోచుకోని 14 గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు పుట్లగూడెం కృష్ణానది వద్ద రక్షిత మంచినీటి పథకానికి రూ.8 కోట్లు మంజూరు చేయించారు. జలయజ్ఞంలో భాగంగా మండలంలోని మాదిపాడు పంచాయతీ పంధిలోగల చట్టుబడి మోటు తండా వద్ద మహానేత వైఎస్సార్ పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ చేశారు. ఏడాదిలో రైతులు రెండు పంటలు పండించుకోవాలనే లక్ష్యంతో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో నాలుగు ఎత్తిపోతల పథకాలకు మహానేత రూపకల్పన చేశారు. మండలంలోని గింజుపల్లి ఎత్తిపోతల పథకానికి రూ.3 కోట్లు మంజూరు చేయించారు. అదేవిధంగా గ్రంథశిరిలో ఎత్తిపోతల పథక నిర్మాణానికి రూ.17 కోట్లు మంజూరు అయ్యాయి. వేల్పూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముకు రూ.67కోట్లు, పెదపాలెం స్కీముకు రూ.29కోట్లతో దివంగత నేత వైఎస్సార్ అంచనాలు తయారు చేయించారు. ఈ రెండు ప్రాజెక్టులకు కూడా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ శిలాఫలకాలను 2008, జూన్ 5 ఆవిష్కరించారు. మహానేత ముఖ్యమంత్రి ఉండగానే మండలానికి ఇన్ని పథకాలు సాధ్యపడ్డాయ ప్రజలు విశ్వసిస్తున్నారు. నేడు వర్ధంతి కార్యక్రమాలు మహానేత సేవలను ఆయన వర్ధంతి (సెప్టెంబర్ 2) సోమవారం స్మరించుకునేందుకు వైఎస్సార్ సీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. భారీ అన్నదాన కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టేది కాదని ప్రతిఒక్కరూ వ్యాఖ్యానిస్తున్నారు. సాక్షాత్తూ దేశ ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా ఉటంకిస్తున్నారు. -
ఎన్నికల్లో అవినీతి బిల్లుకు నో
న్యూఢిల్లీ: ఎన్నికల్లో అవినీతిని కేసు పెట్టతగిన నేరంగా (కాగ్నిజబుల్ అఫెన్స్) గుర్తించేందుకు వీలు కల్పించేందుకు చట్టాన్ని రూపొందించాలన్న ఎన్నికల సంఘం కలనెరవేరే అవకాశం కనిపించడం లేదు. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సానుకూలత వ్యక్తం చే యలేదు. సోమవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో దీనిపై విముఖత వ్యక్తమయింది. ఎన్నికల్లో అవినీతి నిరోధానికి భారత శిక్షాస్మృతిలో ప్రస్తుతమున్న నిబంధనలు సరిపోతాయని మెజారిటీ మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్ర హోంశాఖ ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాలను గతంలోనే కోరింది. ఎన్నికల సంఘం ప్రతిపాదనల ప్రకారం పోటీ చేసే అభ్యర్థులు అవినీతికి పాల్పడితే దానిని కేసుకు అర్హమైన నేరంగా పరిగణించాలి. అయితే ప్రస్తుతం నియమాల ప్రకారం దీనిని కేసు పెట్టతగిన నేరంగా పరిగణించడం లేదు. సోనియాకు అభినందనలు ఆహార భద్రతా బిల్లు లోక్‌సభ ఆమోదం పొందడంతో యూపీయే చైర్పర్సన్ సోనియాగాంధీ, కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి పార్లమెంటరీ సెక్రటరీ ముఖేష్ శర్మ ప్రవేశపెట్టిన అభినందన తీర్మానాన్ని ఢిల్లీ విధానసభ ఆమోదించింది. ఈ బిల్లు చట్టరూపం దాల్చడం వల్ల దేశ వ్యాప్తంగా లక్షలాది మందికి అతి తక్కువ ధరలకే ఆహార ధాన్యాలను సరఫరా చేస్తారని తీర్మానం తెలిపింది. ఇదిలా ఉంటే, ఉల్లి ధరలపై ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మండిపడింది. ధరల నియంత్రణకు తీసుకున్న చర్యలేంటో తెలియజేయాలని డిమాండ్ చేసింది. విధానసభ ఎదురుగా పలువురు సభ్యులు ఉల్లిదండలను మెడలో వేసుకొని నిరసన తెలిపారు. ఇదిలా ఉంటే రాజకీయ ప్రయోజనాల కోసం షీలా దీక్షిత్ కోట్లాది రూపాయల వ్యయంతో నగరవ్యాప్తంగా హోర్డింగులు ఏర్పాట చేయడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. బీజేపీ మాజీ కార్యదర్శి సునీల్ ఆధ్వర్యంలో జోర్‌బాగ్ మెట్రో స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. -
జిల్లాలో 153 కాంట్రాక్ట్ కార్యదర్శుల పోస్టుల క్రమబద్ధీకరణ
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీ ఎట్టకేలకు నెరవేరింది. పదేళ్లుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన గ్రామాల్లో సేవలందిస్తున్న కార్యదర్శులను క్రమబద్ధీకరిస్తూ పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వి.నాగిరెడ్డి జీఓ నంబర్ 379ను జారీ చేశారు. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు అందినట్లు జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ వి.సత్యసాయిశ్రీనివాస్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 2,261 మంది, జిల్లాలో 153 మంది కాంట్రాక్ట్ కార్యదర్శుల పోరాటం, నిరీక్షణ ఫలించింది. తమను రెగ్యులరైజ్ చేయటం పట్ల జిల్లా కాంట్రాక్ట్ కార్యదర్శుల సంఘం అధ్యక్ష, కార్యదర్శ, కోశాధికారులు వై.రమణ, సీహెచ్ అప్పలనాయుడు, కె.తౌడుబాబు సంఘం తరఫున హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రస్తుతం 921 పంచాయతీలున్నాయి. ఈ మొత్తం పంచాయతీలకు 328 మంది కార్యదర్శులు ఉండగా అందులో 175 మంది రెగ్యులర్ పోస్టుల్లో, 153 మంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వారు 2003 లో విధుల్లో చేరారు. కాంట్రాక్టు కార్యదర్శులను రెగ్యులర్ చేస్తామని 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. అయితే దురదృష్టవశాత్తు వైఎస్ మరణంతో వారి క్రమబద్ధీకరణ విషయం అక్కడితో ఆగిపోయింది. 2012లో కాంట్రాక్ట్ కార్యదర్శులను తొల గించి, వారి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖలో 2,677పోస్టుల భర్తీకి గత ఏడాది ఏప్రిల్ 2న అప్పటి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిత్తరంజన్ బిస్వాల్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ప్రకటన ద్వారా పంచాయతీ కార్యదర్శుల నియామకాలు నేరుగా జిల్లా ఎంపిక కమిటీ ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈక్రమంలో జిల్లాకు సుమారు 201పోస్టులు మంజూ రు చేశారు. దీంతో గత తొమ్మిదేళ్లుగా పని చేస్తున్న 153 మంది కాంట్రాక్ట్ కార్యదర్శులు కాం ట్రాక్టు ఉద్యోగులుగానే మిగిలి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారంతా ఉద్య మ బాట పట్టి పాలన స్తం భింపజేశారు. చివరికి ప్రభుత్వం దిగి వచ్చి రెండు నెలల్లో రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చింది. ఎట్టకేలకు ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.