సాక్షి, హైదరాబాద్: ‘‘గుండెపోటు చెప్పి రాదు.. ఒక్కోసారి లక్షణాలు కూడా కనిపించడం లేదు. నాకు ఇప్పటికి మూడుసార్లు గుండెపోటు వచ్చింది. వచ్చిన గంటలోగా ఆస్పత్రికి చేరుకుంటే ఫర్వాలేదు.. లేదంటే ప్రాణం కోల్పోవాల్సి వస్తుంది’’ అని బీజేపీ శాసనసభ్యులు విష్ణుకుమార్‌రాజు చెప్పారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ప్రాజెక్టు ద్వారా ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదకర జబ్బులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విష్ణుకుమార్ సూచించారు.