ఎక్సైజ్ పోలీసుల దాడుల్లో పట్టుబడిన వ్యక్తి, మద్యం సీసాలు
సాక్షి, తెర్లాం : స్థానిక ఎక్సైజ్ పోలీసుస్టేషన్ పరిధిలో గల తెర్లాం, బాడంగి మండలాల్లో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తెర్లాం ఎక్సైజ్ సీఐ పిన్నింటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో విస్తృతంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో ఎటువంటి అనుమతి లేకుండా తరలిస్తున్న 179 మద్యం సీసాలు, 12 బీర్లు బాటిళ్లను సీజ్ చేయడంతో పాటు ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్టు సీఐ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు.
బాడంగి మండలం డొంకినవలస గ్రామ పరిధిలో అదే మండలం పిన్నవలసకు చెందిన ఎన్.శివరామకృష్ణ అనే వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న 96 మద్యం సీసాలు, 12బీర్లు స్వాధీనం చేసుకున్నారు. తెర్లాం మండలం డి.గదబవలస గ్రామానికి చెందిన సీహెచ్ బలరాం నుంచి 25 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేశారు. మండలంలోని కుసుమూరు గ్రామానికి చెందిన రెడ్డి లకు‡్ష్మనాయుడు అనే వ్యక్తి అనధికారికంగా నిర్వహిస్తున్న బెల్ట్ దుకాణంపై దాడి చేసి 58మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని, అతన్ని అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఆయనతో పాటు ఎక్సైజ్ ఎస్‌ఐ జీవీ రమణ, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment