Exice Department
-
రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రిగా జూపల్లి
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి పదవి మరోసారి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకే దక్కింది. నూతనంగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రిగా కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కట్టబెట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు, తాజాగా మరోసారి పాలమూరు జిల్లాకే ఆ శాఖల బాధ్యతలు రావడంతో నల్లమల ప్రాంతం, ఇక్కడి విశిష్టమైన వన, జంతు సంపద, ఎకో టూరిజం, కృష్ణాతీర ప్రాంతాల అభివృద్ధిపై జిల్లావాసుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త ప్రభుత్వ పాలనలో ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, దర్శనీయ స్థలాలు, ప్రకృతి రమణీయ ప్రదేశాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించి.. అభివృద్ధి పనులు కొనసాగుతాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకం రంగంపై.. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా పర్యాటక అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయి. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన భారీ రిజర్వాయర్ల వద్ద బోటింగ్ ఏర్పాటు, సౌకర్యాల కల్పనతో పెద్దఎత్తున పర్యాటకలను ఆకర్షించేందుకు ఆస్కారం ఉంది. పురాతన ఆలయాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద సౌకర్యాల కల్పనతో పర్యాటకం పెరగనుంది. జోగుళాంబ శక్తిపీఠం, నల్లమలలోని శైవక్షేత్రాలు, శ్రీశైల ఉత్తరద్వారంగా పేరొందిన ఉమామహేశ్వర క్షేత్రం, మన్యంకొండ తదితర ప్రాంతాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి పర్చాల్సి ఉంది. పురావస్తు శాఖ సైతం జూపల్లి పరిధిలోనే ఉండగా.. జోగులాంబ శక్తిపీఠం సమీపంలోని పురాతన బ్రహ్మదేవాలయాలు, క్షేత్ర అభివృద్ధిపై మరింత దృష్టిసారించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎకో టూరిజంతో మేలు.. ప్రకృతి రమణీయ ప్రాంతాలు, సహజసిద్ధమైన వనాలు, వన్య మృగాలను సంరక్షిస్తూనే పర్యాటకులను ఆకర్షించే ఎకో టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించాలన్న డిమాండ్ స్థానికుల్లో నెలకొంది. ప్రధానంగా నల్లమల అభయారణ్యంలో పర్యాటకులు, సందర్శకుల ద్వారా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఎకోటూరిజం ద్వారా అమూల్యమైన వృక్షసంపద, వన్యప్రాణులను వీక్షించేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇప్పటికే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో టైగర్ స్టే ప్యాకేజీ, టైగర్ సఫారీ, వ్యూ పాయింట్ వీక్షణం కొనసాగుతున్నా పర్యాటకులకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిస్థాయిలో లేవు. అలాగే కృష్ణాతీర ప్రాంతంలోని సోమశిల, అమరగిరి, మంచాలకట్ట, మల్లేశ్వరం తదితర తీరప్రాంతాల్లో కాటేజీలు, బోటింగ్ సౌకర్యం కల్పించాల్సి ఉంది. ఎకో టూరిజం, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ద్వారా స్థానికంగా ఉన్న యువత, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవకాశం దక్కనుంది. ఇవి చదవండి: పవన్ సీఎం రేసులో లేనట్టే! -
కల్తీ కల్లేనా..? కలుషిత నీరేనా..? రంగంలోకి దిగిన 3 శాఖలు..
సంగారెడ్డి: దుబ్బాక ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. వాంతులు, విరేచనాలు ఏ కారణంతో జరిగాయి? వృద్ధుడు ఎలా మృతిచెందాడు? అనే ప్రశ్నల చిక్కుముడి విప్పడానికి 3 శాఖల అధికారులు రంగంలోకి దించింది. కల్తీ కల్లునా? కలుషిత నీరు తాగి మృతిచెందాడా? పలువురు ఎందుకు అస్వస్థతకు గురయ్యారా? అని నిర్థారించే పనిలో నిమగ్నమయ్యారు. దుబ్బాక మండలం దుంపలపల్లి, బల్వంతపూర్, నర్లెంగడ్డ, పద్మశాలి గడ్డ గ్రామాలకు చెందిన వారు కూలీ పనులకు వెళ్లి వస్తున్న క్రమంలో కల్లు తాగారు. గురువారం తెల్లవారుజాము నుంచి వారికి వాంతులు, విరేచనాలై అస్వస్థతకు గురయ్యారు. 33 మందికి పైగా దుబ్బాకలో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 28 మంది ఇంటి వద్దే మందులు వాడుతున్నారు. శుక్రవారం ఉదయం పద్మశాలి గడ్డకు చెందిన కుంటయ్య (65) మృతిచెందాడు. భిన్నాభిప్రాయాలు కల్లు వల్లే వాంతులు, విరేచనాలు అయ్యయని కొందరు పేర్కొంటుండగా, మరికొందరు కలుషిత నీరే కారణమని కొందరు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. వర్షాలతో కల్లు విక్రయ కేంద్రాలలో అమ్మకాలు లేక నిల్వను విక్రయించడంతోనే అస్వస్థతకు కారణమా? అన్నది తేలాల్సి ఉంది. కల్తీ కల్లుతోనే వాంతులు, విరేచనాలు అయ్యాయని వైద్యులు ప్రాథమికంగా నిర్థారించారు. శాంపిల్స్ సేకరణ ఎందువల్ల అస్వస్థతకు గురయ్యారని నిర్థారించేందుకు ఎక్సైజ్ శాఖ, మిషన్ భగీరథ, వైద్యారోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఎక్సైజ్ అధికారులు దుంపలపల్లి, బల్వంతపూర్, నర్లెంగడ్డలలోని కల్లు విక్రయ కేంద్రాల నుంచి కల్లు శాంపిల్స్ సేకరించారు. మిషన్ భగీరథ అధికారులు ఆయా గ్రామాల్లో సరఫరా అయిన నీటిని శాంపిల్స్ సేకరించారు. వైద్య అధికారులు 10 మంది నుంచి బ్లడ్, స్టూల్, మూత్రం శాంపిల్స్ తీసి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంట్ మెడిసిన్ ల్యాబ్ (ఐపీఎం)కు పంపించారు. కల్తీ కల్లు తాగడంతో వృద్ధుడు మృతిచెందాడా? బాధితులు తాగు నీటితో వాంతులు, విరేచనాలయ్యాయా? అన్నది తేలాలంటే రిపోర్టు రావాల్సిందే. -
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్
Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ధిక్కరణ పిటిషన్‌తో ప్రభుత్వ అధికారులు ముందుకొచ్చారు. ఈడీ అడిగిన అన్ని వివరాలను ఎక్సైజ్ శాఖ ఇచ్చేసింది. డిజిటల్ రికార్డ్స్, కాల్ డేటా, ఎఫ్ఎస్ఎల్ నివేదికలను ఈడీకి అందజేశారు ప్రభుత్వ అధికారులు. ఈడీకి వివరాలు అందజేసినట్లు ప్రభుత్వం హైకోర్టులో మెమో దాఖలు చేసింది. దీంతో సీఎస్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌పై హైకోర్టులో వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. ఇక మళ్లీ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు పెంచనుంది. ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ ఇచ్చిన డిజిటల్ రికార్డ్స్, కాల్ డేటా పరిశీలించనుంది. మరోసారి సినీ తారలను ఈడీ అధికారులు విచారించనున్నారు. డ్రగ్స్ లావాదేవీలు, డ్రగ్స్ కొనుగోళ్లు, మనీ లాండరింగ్‌పై కూపీ లాగనున్నారు. కాగా మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించిన నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది. హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని బుధవారం (మార్చి 23) ఈడీ పిటిషన్ వేసింది. వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తుంది. సోమేష్ కుమార్, సర్ఫరాజ్‌కు న్యాయవాది ద్వారా ఈనెల 13న నోటీసు ఇచ్చామని ఈడీ పేర్కొంది. -
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్..
ED Files Contempt Of Court Petition Against Telangana CS Excise Director: టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వట్లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. సీఎస్ సోమేష్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరిన వివరాలను ఈడీకి ఇవ్వాలని ఫిబ్రవరి 2న ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తర్వాత మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించిన నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది. హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని బుధవారం (మార్చి 23) ఈడీ పిటిషన్ వేసింది. వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తుంది. సోమేష్ కుమార్, సర్ఫరాజ్‌కు న్యాయవాది ద్వారా ఈనెల 13న నోటీసు ఇచ్చామని ఈడీ పేర్కొంది. -
అంతర పంటగా గంజాయి!
సాక్షి, సంగారెడ్డి(మెదక్): ఆంధ్ర, ఒడిశా సరిహద్దులకు పరిమితమైన గంజాయి సాగు ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లోనూ విస్తరిస్తోంది. ప్రధానంగా సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలో విస్తారంగా సాగవుతోంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని కర్ణాటక సరిహద్దు మారుమూల గ్రామాల్లో గంజాయి క్షేత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా వేల సంఖ్యలో గంజాయిని సాగు చేస్తున్న క్షేత్రాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. గంజాయిని అంతర పంటగా సాగు చేస్తున్న పొలాలను తరచూ గుర్తిస్తున్న ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులు మొక్కలను ధ్వంసం చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఒకేచోట రూ.ఐదు కోట్ల విలువైన మొక్కలు ► సంగారెడ్డి జిల్లా ఏడాకులపల్లి గ్రామ శివారులో వెంకటేశ్ అనే వ్యక్తికి చెందిన ఐదెకరాల్లో ఇటీవల మూడు వేలకు పైగా గంజాయి మొక్కలు సాగవుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఈ గంజాయి మొక్కల విలువ సుమారు రూ.5 కోట్లు ఉంటుందని అధికారులు ప్రకటించారు. ► కర్ణాటక సరిహద్దు జహీరాబాద్ డివిజన్లోని పలు గ్రామాల్లో 12 గంజాయి క్షేత్రాలను ఎక్సైజ్, పోలీసుశాఖ అధికారులు గుర్తించి, వేల సంఖ్యలో మొక్కలను ధ్వంసం చేశారు. రాయ్‌కోడ్ మండలం ఉలిగెరలో నాలుగు వేల మొక్కలను గుర్తించారు. పత్తి, చెరుకు, అరటి తోటల్లో భారీగా గంజాయి సాగవుతోంది. ► బాన్సువాడ మండలంలోని సోమ్లానాయక్ తం డాలో, గాంధారి మండలం ధన్‌సింగ్‌తండా శివా రులోనూ ఇటీవల గంజాయి సాగవుతున్నట్లు గు ర్తించి మొక్కలను దహనం చేశారు. రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలోనూ గంజాయి క్షేత్రాలపై ఇటీవల అధికారుల దాడులు కొనసాగాయి. జైళ్లలో మగ్గుతున్నది రైతులే.. ముంబైకి చెందిన స్మగ్లింగ్ ముఠాలు తమ ఏజెంట్ల ద్వారా ఇక్కడి అమాయక రైతులను ట్రాప్ చేసి గంజాయిని సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. కొందరు రైతులు స్థానికేతరుల భూములు కౌలుకు తీసుకొని అందులో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎక్సైజ్ అధికారి అశోక్‌కుమార్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఈ పంట సాగుతో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తుండటంతో కొందరు అమాయక రైతులు దీనివైపు మొగ్గు చూపుతున్నారు. అయితే పట్టుబడితే నెలల తరబడి జైలులో మగ్గుతున్నారు. గంజాయి సాగుచేస్తున్న అమాయక రైతులు ఎన్డీపీఎస్ వంటి కేసులను ఎదుర్కొంటుండగా, ముంబైలో కూర్చుని రూ.కోట్లు గడిస్తున్న దందా సూత్రధారులపై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఇద్దరు మైనర్లపై కేసు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మేడిపల్లి గ్రామంలో ఇద్దరు బాలురు తమ వ్యవసాయ క్షేత్రంలో గంజాయి సాగు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం వ్యవసాయ క్షేత్రంలో తనిఖీలు చేసి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు మూడు నెలల క్రితం తమ వ్యవసాయ క్షేత్రంలో గంజాయి విత్తనాలు నాటారని సమాచారం అందిందని మెట్పల్లి సీఐ శ్రీను వివరించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చదవండి: Singareni Employees: ఒక్కో కార్మికుడికి రూ.1.15 లక్షలు -
3 వైన్స్‌లు.. 30 ‘బెల్ట్’లు: లాభాల కోసం ‘చీప్’ ట్రిక్స్..
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో అనధికారిక మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్క జిల్లా కేంద్రంలోని లైసెన్స్ వైన్ షాపుల నుంచే బెల్ట్ షాపులకు ప్రతినెలా కోట్ల రూపాయల విలువైన మద్యం తరలిపోతోంది. బెల్ట్ షాపుల నిర్వాహకులు అధిక ధరల కు మద్యం విక్రయిస్తూ వచ్చిన లాభాల్లో మద్యం షా పులు యజమానులకు వాటా పంచుతున్నారు. అనధికారిక విక్రయాలతో వచ్చే లాభం బాగుండడంతో వైన్ షాపుల యజమానులు కూడా బెల్ట్ షాపులను మరింత ప్రోత్సహిస్తున్నారు. దీంతో అనధికారిక దందా మూడు వైన్ షాపులు.. ముప్పై బెల్ట్ షాపులు అన్న చందంగా సాగుతోంది. ఆదిలాబాద్ పట్టణంలో తొమ్మిది లైసెన్స్ మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ షాపుల యజమానులంతా సిండికేటుగా ఏర్పడి అనధికారిక విక్రయాలను ప్రోత్సహిస్తున్నారు. ప్రతీనెల మూడు షాపుల నుంచి మద్యం పట్టణంతోపాటు, సమీపంలోని బెల్ట్ షాపులకు తరలించేలా ఒప్పందం చేసుకున్నారు. నెలకు ఒక్కో షాపు నుంచి రూ.75 లక్షల విలువైన మద్యాన్ని నేరుగా బెల్ట్ షాపులకే విక్రయిస్తున్నారు. మూడు షాపుల నుంచి రూ.2.25 కోట్ల విలువైన సరుకు అనధికారిక విక్రయ షాపులకు తరలిస్తున్నా రు. ఈ మద్యాన్ని బెల్ట్ షాపుల నిర్వాహకులు అధిక ధరకు మందుబాబులకు విక్రయించి లాభాలు గడిస్తున్నారు. ఇందులో మద్యం షాపులకు వచ్చే వాటా ను తొమ్మిది షాపుల యజమానులు పంచుకుంటున్నారు. విక్రయాలు, లాభాలు, వాటా లెక్కల కోసం వీరు ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారంటే లాభాలు ఏమేరకు ఉన్నాయో ఊహించుకోవచ్చు. జిల్లాలో వెయ్యికిపైగా బెల్ట్ షాపులు.. బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు అనధికారికం. ఎక్సైజ్ అధికారుల భాషలో చెప్పాలంటే అన్ ఆథరైజ్డ్ ఔ ట్‌లెట్. ప్రభుత్వ లైసెన్స్ పొందిన వైన్స్‌లు, బార్లు మద్యం విక్రయిస్తుండగా.. ఈ వైన్స్‌ల నుంచి వచ్చే సరుకును బెల్ట్ షాపుల్లో విక్రయిస్తున్నారు. జిల్లాలో 31 మద్యం షాపులు ఉన్నాయి. వీటి ద్వారా మద్యం కొనుగోలు చేసి అనధికారికంగా విక్రయించే బెల్ట్ షాపులు మాత్రం వెయ్యి నుంచి 1,200 వరకు ఉన్నాయి. వీటి నిర్వాహకులు 31 లైసెన్స్ మద్యం షాపుల నుంచి ఎమ్మార్పీ ధరకు మద్యం కొనుగోలు చేసి తీసుకెళ్లారు. అనధికారిక షాపుల్లో అధిక ధరతోపాటు, కల్తీ చేసి విక్రయిస్తున్నారు. మద్యం సీసాల మూతలు తెరిచి అందులోని మద్యం ఖాళీ సీసాలో కొంత తీసి, ఖాళీ అయిన మద్యం స్థానంలో నీళ్లు లేదా స్పిరిట్ కలుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కల్తీ మద్యాన్ని లూజ్‌గా విక్రయస్తున్నారు. దీంతో రెట్టింపు లాభాలు గడిస్తున్నారు. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ.. అనధికారిక మద్యం విక్రయ దందా జిల్లాలో జోరుగా సాగుతున్నా ఎక్సైజ్ శాఖ మాత్రం మామూళ్ల మత్తులో జోగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోనే సిండికేట్ దందా సాగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం విమర్శలకు బలం చేకూరుస్తోంది. అనధికారిక దందా, కొన్ని బ్రాడ్ల విక్రయాలు బహిరంగంగా జరుగుతున్నా ఎవరైనా ఫిర్యాదు చేస్తే ‘మా దృష్టికి రాలేదు.. తనిఖీలు చేస్తాం.. అక్రమ మద్యం విక్రయాలను అరికడతాం’ అని చెప్పి తప్పించుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. పత్రికల్లో, టీవీ చానెళ్లలో వార్తలు వచ్చినప్పుడు మాత్రం దాడుల పేరుతో రెండు మూడు రోజులు హడావుడి చేస్తారనే అపవాదు ఉంది. లాభాల కోసం ‘చీప్’ ట్రిక్స్.. జిల్లాలో మద్యం షాపుల యజమానులు అదనపు లాభాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొన్నిరకాల బ్రాండ్ల(ఎక్కువ కమీషన్ ఇచ్చే కంపెనీల) మద్యాన్ని మాత్రమే షాపుల్లో విక్రయిస్తున్నారు. తక్కువ కమీషన్ ఇచ్చే బ్రాండ్ల మద్యాన్ని అందుబాటులో ఉంచడం లేదు. ఓ బ్రాండ్ చీప్ లిక్కర్ మాత్రం బెల్ట్ షాపుల్లో విరివిగా లభిస్తుండడం ఇందుకు నిదర్శనం. దానికి పోటీగా ఉన్న మరో బ్రాండ్ లిక్కర్ ఇటు వైన్ షాపులు, అటు బెల్ట్ షాపుల్లో దొరకదు. కమీషన్ రూపంలో లాభం పొందడమే కాకుండా అదే మద్యాన్ని బెల్ట్ షాపులకు సరఫరా చేస్తూ వారి నుంచి కూడా లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. కొన్ని మద్యం కంపెనీలు ఎమ్మార్పీపై ఇచ్చే కమీషన్‌తో పాటు ప్రతీ కాటన్‌పై అదనంగా కమీషన్ ఇస్తున్నాయి. మద్యం షాపుల యజమానులు అలాంటి బ్రాండ్ల మద్యాన్నే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. తమ లాభాల కోసం ఇలాంటి ట్రిక్స్ చేయడంలో జిల్లాలోని మద్యం షాపుల యజమానులు సిద్ధహస్తులు. -
వామ్మో.. రోజుకు లక్ష కేసులు తాగేస్తున్నారు!
హైదరాబాద్: ఎండ తాపానికి తట్టుకోలేని మందుబాబులు ‘బీర్లు’లాగించేస్తున్నారు. ఒక్క మార్చి నెలలోనే రోజుకు లక్ష కేసుల చొప్పున దాదాపు 30 లక్షల కేసులు బీర్లు అమ్ముడయ్యాయని ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. గత మూడు నెలల్లో మార్చి నెలలోనే ఎక్కువ సంఖ్యలో బీర్ల విక్రయాలు జరగ్గా, అదే స్థాయిలో లిక్కర్ కూడా అమ్ముడయింది. ఈ నెలలో 30 లక్షల కేసులకు పైగా మందు విక్రయం జరిగింది. అయితే, జనవరిలోనూ ఇదే స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినా, ఫిబ్రవరిలో కొంత తగ్గుముఖం పట్టాయి. మార్చిలో భారీగా బీర్ అమ్మకాలు పెరగడానికి మండుతున్న ఎండలే కారణమని ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. ఇక, 2020–21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.27,288 కోట్లకు పైగా విలువైన మద్యాన్ని మందుబాబులు లాగించేశారు. ఈ మూడు నెలల్లో జనవరిలో అత్యధికంగా మద్యం అమ్ముడుపోగా, ఫిబ్రవరిలో కొంత తగ్గింది. మళ్లీ మార్చిలో పుంజుకుంది. జనవరిలో రూ.2727.15 కోట్లు, ఫిబ్రవరిలో రూ.2,331.65 కోట్లు, మార్చి నెలలో రూ. 2,473.89 కోట్లు కలిపి మొత్తంగా రూ.7,532.69 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం చివర్లోకి రావడంతో వీలున్నంత మేర విక్రయాలు పెంచి ఆదాయాన్ని రాబట్టుకోవా లని ఎక్సైజ్ శాఖ.. అధికారులకు టార్గెట్లు విధించి మరీ వైన్‌షాపుల యజమానుల చేత ఇండెంట్లు పెట్టించారు. అయితే, బీర్లకు మార్చిలో సాధారణంగానే గిరాకీ పెరిగిందని, 40 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో బీర్లవైపే మందుబాబులు మొగ్గుచూపుతున్నారనే చర్చ ఎక్సైజ్ వర్గాల్లో జరుగుతోంది. ఇక, బీర్లు, లిక్కర్ వారీగా పరిశీలిస్తే.. జనవరిలో 33 లక్షల ఐఎంఎల్ కేసులు అమ్ముడుపోగా, 28 లక్షలకు పైగా బీర్ కేసులు అమ్ముడయ్యాయి. ఫిబ్రవరిలో 29 లక్షల కేసుల ఐఎంఎల్, 22 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. మార్చి నెలలో 30 లక్షల కేసుల లిక్కర్, 29.59 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. రోజుకు రూ.75 కోట్లు.. 2020–21లో మొత్తం 27,288.72 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 3.3 కోట్ల ఐఎంఎల్ కేసులు, 2.7 కోట్ల బీర్ కేసులు అమ్ముడుపోయాయి. అంటే రోజుకు సగటున 90వేలకు పైగా లిక్కర్ కేసులు, 74వేలకు పైగా కేసుల బీర్లను రాష్ట్రంలోని మందుబాబులు తాగేశారన్నమాట. రాష్ట్రంలో ఈ ఏడాది సగటున రోజుకు దాదాపు రూ.75 కోట్ల విలువైన మందు హుష్‌పటాక్ అయింది. మరి... మందుబాబులా... మజాకా...! -
మరో 13% మద్యం షాపులు మూత
సాక్షి, అమరావతి: దశలవారీ మద్యపాన నియంత్రణలో భాగంగా రాష్టప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు మరిన్ని కఠిన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మద్యం షాపుల సంఖ్యను ఈ నెలాఖరు నాటికి 13 శాతం తగ్గిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది ఆగస్టులో 20 శాతం షాపులను తొలగించిన ప్రభుత్వం.. ఏడాదిలోపే మరో 13 శాతం షాపులను తొలగించేందుకు తాజా ఉత్తర్వులిచ్చింది. గతంతో పోలిస్తే.. ఈ నిర్ణయం వల్ల కేవలం 10 నెలల్లోనే 33 శాతం షాపులను తగ్గించినట్లవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,500 మద్యం దుకాణాలు ఉండగా.. తాజా నిర్ణయంతో ఈ నెలాఖరు నాటికి ఆ సంఖ్య 2,934 తగ్గనుంది. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43 వేల బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించిన సంగతి తెలిసిందే. మద్యం వినియోగాన్ని తగ్గించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. సారాకు అడ్డుకట్ట మరోవైపు నాటు సారాను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. తయారీదారులపై నిఘా పెట్టి తరచూ దాడులు జరిపిస్తోంది. సారా అధికంగా తయారు చేసే 147 ‘ఏ’ కేటగిరీ గ్రామాలను గుర్తించి విస్తృత తనిఖీలు చేయిస్తోంది. సారాను అరికట్టేందుకు వార్డు వలంటీర్లు, గ్రామ మహిళా మిత్ర, మహిళా రక్షక్‌ల సేవలను వినియోగిస్తోంది. దీంతోపాటు పొరుగు పక్క రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. నియంత్రణకు తీసుకున్న చర్యలివీ.. ► మద్యం దుకాణాల వద్ద గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 4,380 పర్మి ట్ రూమ్‌ల రద్దు. ఒక వ్యక్తి గరిష్టంగా మ ద్యం లేదా బీరును కేవలం మూడు బాటి ల్స్ వరకు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం. అంతకు మించి కొనుగోలు చేసినా.. అమ్మినా చట్టపరమైన చర్యలకు ఆదేశం. ► మద్యం అమ్మకాలను తగ్గించేందుకు విక్రయ వేళల కుదింపు. గతంలో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు జరిపేవారు. ప్రస్తుతం ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే విక్రయాలకు అనుమతి. ► మద్యం వినియోగాన్ని గణనీయంగా తగ్గించే చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న షాపుల సంఖ్య 4,380 నుంచి 3,500కు తగ్గిస్తూ గతేడాది ఆగస్టులో నిర్ణయం. ► అక్రమ అమ్మకాలను నియంత్రించే చర్యల్లో భాగంగా ఏపీ బెవరేజేస్ కార్పొరేషన్ లిమిటెడ్, స్వయంగా రిటైల్ అవుట్ లెట్స్ ద్వారా మద్యం అమ్మకాలు. ► మరోవైపు వినియోగాన్ని తగ్గించేందుకు ధరలను పెంచుతూ నిర్ణయం. మద్యం కొనాలంటేనే భయపడేలా.. షాక్ కొట్టే విధంగా ధరల పెంపుదల. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బార్ల సంఖ్యలో 40 శాతం తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ. ఫలితంగా రాష్ట్రంలో ఉన్న 840 బార్లు 530కి తగ్గాయి. మద్యం వినియోగాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా మద్య విమోచన ప్రచార కమిటీని ఏర్పాటు. మద్యపానం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించడం, మద్యం మహమ్మారి కుటుంబాలను ఏ విధంగా నాశనం చేస్తుందో తెలియజెప్పే ప్రచార కార్యక్రమాలకు చర్యలు. ► మద్యం వినియోగాన్ని దశలవారీగా తగ్గించడానికి తీసుకున్న అన్ని చర్యలు సానుకూల ఫలితాలిస్తున్నాయి. 2019 అక్టోబర్ నుంచి 2020 మార్చి వరకు మద్యం అమ్మకాలు 24 శాతం, బీరు అమ్మకాలు 55 శాతం తగ్గాయి. -
తెరుచుకోనున్న మద్యం షాపులు
గువాహటి: లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ అస్సాం రాష్ట్రంలో సోమవారం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. అలాగే బాట్లింగ్ ప్లాంట్లు, డిస్టిలరీలు, బ్రూవరీలు కూడా పని చేస్తాయి. మద్యం దుకాణాలను రోజుకు 7 గంటలు మాత్రమే తెరిచి ఉంచాలని అస్సాం ఎక్సైజ్‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్యశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను అందరూ తప్పనిసరిగా పాటించాలని తేల్చిచెప్పింది. అస్సాంలో ఇకపై ప్రభుత్వం అనుమతించిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లిక్కర్ షాపులు తెరిచి ఉంటాయి. -
షాక్ : నీటికి కటకట.. నల్లాల్లో మద్యం వరద..!
తిరువనంతపురం : రోజూలానే ఉదయం నిద్రలేవగానే నీటి కుళాయిలు తిప్పిన కేరళలోని ఓ కాలనీ వాసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నల్లా పైపుల్లోంచి నీటికి బదులు మద్యం రావడంతో ఆశ్చర్యంలో మునిగిపోయారు. త్రిశూర్‌లోని సోలోమన్ అవెన్యూలో ఈ విశేషం వెలుగుచూసింది. అక్కడ దాదాపు 18 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన చుట్టపక్కలవారు ఇదేం వింతరా బాబూ.. నీటికి కటకట తెలిసిందే కానీ... నల్లాల్లో మందు సరఫరా అవుతోందని తండోపతండాలుగా అక్కడకు చేరుకున్నారు. (చదవండి : వైరల్ : ఎర్రచీరలో ఇరగదీసింది) ఈ ఘటనపై అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది. రచనా బార్‌పై ఆబ్కారీ పోలీసుల దాడి గురించి తెలిసింది. ‘ఆరేళ్ల క్రితం సోలోమన్ అవెన్యూకు సమీపంలో ఉండే రచనా బార్లో అక్రమంగా వేల లీటర్ల మద్యం నిల్వలు ఉన్నాయని ఫిర్యాదులు అందాయి. దాదాపు 6 వేల లీటర్ల మద్యం బాటిళ్లను నాశనం చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో.. బార్లోనే ఓ గొయ్యి తీసి మద్యాన్ని దాంట్లో నింపేశాం. అది భూమిలో ఇంకిపోయింది. కానీ, బార్‌కు సమీపంలోనే ఈ అపార్ట్మెంట్ నిర్మించడంతో... అక్కడి బోరుబావిలోకి మద్యం చేరింది. నీటితో కలసి కుళాయిల్లోకి ప్రవహించింది’అని ఆబ్కారీ పోలీసులు చెప్పారు. ఇది అనుకోకుండా జరిగిన తప్పిదని పేర్కొన్నారు. అయితే, అబ్కారీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అపార్ట్మెంట్ వాసులు మున్సిపల్ అధికారులను కోరారు. (చదవండి : కరోనా కలకలం : ఈ-వీసాల నిలిపివేత) -
మద్యంలోకి రియల్
సాక్షి, యాదాద్రి : ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించనున్న తరుణంలో ఈ వ్యాపార రంగంలోకి కొత్త రక్తం దూసుకురావడానికి సిద్ధమవుతోంది. గడచిన రెండేళ్లలో మద్యం అమ్మకాలు పెరగడం, లాభాలుకూడా భారీగా రావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం వ్యాపారంలో ఉన్నవారితో పాటు కొత్తవారు పోటీకి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించడంతో చాలా మంది రియల్టర్లు మద్యం వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. నూతన మద్యం పాలసీ ప్రకారం ముందుగా దరఖాస్తు ఫారానికి డబ్బులు జమచేసి పోటీలో దిగితే చాలనుకుంటున్నారు. అదృష్టం వరించి లాటరీలో దుకాణం వస్తే ఆ తర్వాత సిండికేట్ కావచ్చన్న ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలో ఈ సారి మద్యం దుకాణాల కోసం పెద్ద ఎత్తున పోటీ పడే అవకాశం ఉంది. పెరగనున్న దరఖాస్తు ఫీజు..! ప్రభుత్వం ఈసారి మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలకు పెంచనుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో వ్యాపారులు ఆసక్తిగా ఉన్నారు. లాటరీలో దుకాణం వచ్చిన తర్వాతే ఈఎండీ చెల్లించాలన్న నిబంధన సడలింపుతో పోటీదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు సైతం భావిస్తున్నారు. జిల్లాలో మొత్తం 67 వైన్స్‌లు, 4 బార్లు ఉండగా 2017లో 1130మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష రుసుం తిరిగి చెల్లించని మొత్తాన్ని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వానికి రూ.11.30 కోట్లు ఆదాయం వచ్చింది. ప్రధానంగా భువనగిరి, ఆలేరు, రామన్నపేట, మోత్కూర్ సర్కిళ్లలో అడ్డగూడూరు మండలం మినహా మిగతా 15 మండలాల్లో మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. తాజాగా అడ్డగూడూరు మండలంతోపాటు, నూతన మన్సిపాలిటీల్లో బార్లు రాబోతున్నాయి. 2015లో మద్యం దుకాణం దరఖాస్తు రుసుం రూ.50వేలు ఉండగా ఆ మొత్తాన్ని 2107లో రూ.లక్షకు పెంచినప్పటికీ దరఖాస్తులు భారీగా వచ్చాయి. ఈసారి బార్లు, వైన్స్‌ల సంఖ్యతోపాటు మద్యం రెంటల్ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. రెండేళ్లలో రూ.991.40 కోట్ల మద్యం అమ్మకాలు గడిచిన రెండేళ్లలో జిల్లాలో మద్యం, బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. అక్టోబర్ 2017 నుంచి సెప్టెంబర్ 2018 వరకు రూ.468.62 కోట్ల విలువ చేసే మద్యం, బీర్లు సేవించారు. 7,35,309 మద్యం సీసాలు, 14,06,130 బీరు బాక్సులు ఖాళీ చేశారు. అయితే రెండో సంవత్సరంలో అమ్మకాలు మరింత పెరిగాయి. అక్టోబర్ 2018 నుంచి ఆగస్టు 2019 వరకు రూ.522.83 కోట్ల విలువైన మద్యాన్ని, బీర్లను సేవించారు. ఇందులో 7,60,337 మద్యం సీసాలు, 15,01,709 బీరు బాక్సుల అమ్మకం జరిగింది. దీంతో ప్రభుత్వానికి, వ్యాపారులకు ఆదాయం భారీగానే సమకూరింది. ఈసారి మరింత ఆదాయం లక్ష్యంగా ప్రభుత్వం నూతన పాలసీని తీసుకురాబోతుంది. -
ఆగని ‘కల్తీ’ మద్యం దందా..!
సాక్షి, యాదాద్రి: జిల్లాలో ఏడాది కాలంగా కల్తీ మద్యం దందా జోరుగా సాగుతోంది. ఈ వ్యవహారం పెద్ద ఎత్తున కొనసాగుతున్నా ఎక్సైజ్‌శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో బెల్టుషాపులు కేంద్రంగా నకిలీ మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న అనుమానం మద్యం ప్రియులు వ్యక్తం చేస్తున్నారు. మద్యం వ్యాపారుల ధన దాహానికి అడ్డూఅదుపు లేకుండా రెక్టిఫైడ్ స్పిరిట్‌తో మద్యాన్ని తయారు చేసి పలురకాల బ్రాండ్లతో విక్రయించిన తీరు మద్యంప్రియులను తీవ్రంగా కలిచివేస్తోంది. ఎన్నికల సీజన్లో కల్తీ మద్యం వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా మద్యం దుకాణాల ద్వారా, బెల్టుదుకాణాల ద్వారా కల్తీ మద్యాన్ని విక్రయించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కల్తీ మద్యం విక్రయదారులను పోచంపల్లితోపాటు, బాలాపూర్, వికారాబాద్‌లలో అరెస్టు చేశారు. మరో నెలరోజుల్లో మద్యం దుకాణాల లైసెన్స్‌ల గడువు ముగియనున్న నేపథ్యంలో ఎక్సైజ్ పోలీస్‌లు పట్టుకున్న మద్యంతో చీకటి వ్యాపారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పదిమంది నిందితులు అరెస్ట్ చేసిన పోలీస్‌లు మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. ఒరిజనల్‌గా నమ్మిస్తూ: అక్రమ మద్యం వ్యాపారులు రెక్టిఫైడ్ స్పిరిట్‌ను తమ రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసి పలురకాల బ్రాండ్లకు చెందిన మూతలు, లేబుళ్లను కొనుగోలు చేసి పాత సీసాల్లో రెక్టిఫైడ్ స్పిరిట్‌ను నింపి వాటిలో మద్యం రంగు వచ్చే విధంగా క్యారామాల్ లిక్విడ్‌ను కలిపారు. మద్యం కొనుగోలుదారునికి ఎలాంటి అనుమానం రాకుండా ప్యాక్ చేసి ప్రభుత్వ సరఫరా లేబుళ్లను అంటించి అన్ని రకాల మద్యాన్ని డూప్లికేట్ సీసాల్లో ఒరిజినల్ ధరకే విక్రయించారు. బయటబడిన బండారం.. భూదాన్‌పోచంపల్లి మండలం అబ్దుల్లానగర్‌లో గత నెల 14న రెక్టిఫైడ్ స్పిరిట్‌తో క్యారామిల్ కలిపి మద్యాన్ని తయారు చేస్తున్న మద్ది అనిల్‌రెడ్డితోపాటు మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి లక్షల రూపాయలు విలువ చేసే రెక్టిఫైడ్ స్పిరిట్, క్యారామిల్ మద్యం సీసాల మూతలను పలు బ్రాండ్లకు సంబంధించిన లేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సుమారు 10మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మరికొంత మంది కోసం గాలింపు చేపట్టారు. భూదాన్‌పోచంపల్లి మండలం ముక్తాపూర్ శివారులో గత నెల 19న పెద్ద ఎత్తున నకిలీ మద్యం పట్టుబడిన నేపథ్యంలో పోలీసులు ఇప్పటి వరకు 10మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా మరో నలుగురి కోసం వెతుకుతున్నారు. భూదాన్‌పోచంపల్లి మండలం అబ్దుల్లానగర్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్న స్పిరిట్, సామగ్రి, మద్యం సీసాల మూతలు (ఫైల్) మూడు నెలలుగా జిల్లాలో నకిలీ మద్యం ఛాయలు గుర్తించినట్లు ఎక్సైజ్ పోలీసులు చెబుతుండగా అంతకంటే ముందు ఏడాది కాలంనుంచే కల్తీ దందా పెద్ద ఎత్తున సాగుతున్నట్లు తెలుస్తోంది. కల్తీ మద్యం కేసులో తాజాగా మద్యం సీసాల నకిలీ మూతలను విక్రయించే హైదరాబాద్‌కు చెందిన లాయిఖ్అలీ, స్టిక్కర్స్‌ను విక్రయించే హైదరాబాద్‌కు చెందిన సుదీర్‌లను ఇప్పటికే అరెస్టు చేయగా తాజాగా స్పిరిట్‌ను సరఫరా చేసే తాండూరుకు చెందిన మొగులప్ప స్టిక్కర్స్‌ను కొనుగోలు చేసిన మహబూబాబాద్‌కు చెందిన శశాంక్గౌడ్లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. అయితే ఢిల్లీలో హోలోగ్రామ్స్ తయారు చేసే కంపెనీపై దృష్టిసారించిన పోలీసులు అక్కడి నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. ఈ మద్యం కేసులో కర్ణాటకకు చెందిన ఇద్దరు, మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన ఒక్కొక్కరు చొప్పున నిందితుల వేటలో పోలీసులు బిజీగా ఉన్నారు. బెల్టుషాపుల ద్వారా విక్రయం.. నకిలీ మద్యం కొన్ని మద్యం షాపులతోపాటు బె ల్టుషాపుల్లో పెద్ద ఎత్తున విక్రయించినట్లు ఎక్సైజ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే నారా యణపూర్, చౌటుప్పల్ మండలం మల్కాపూర్‌లో మద్యం దుకాణాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ప్రధాన నిందితులై న అనిల్‌రెడ్డితోపాటు మరికొంత మంది తమ కు తెలిసిన వారి ద్వారా జిల్లాతోపాటు హైదరాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌జిల్లాల్లో విక్రయించినట్లు ఇప్పటికే బయటపడింది. నకిలీ మద్యం కేసును ఛేదించడం ద్వారా జిల్లాలో భారీ రాకెట్‌కు తెరదించినట్లైందని ఎక్సైజ్ పోలీసులు భావిస్తున్నారు. నిందితులందరినీ పట్టుకుం టామని ఎక్సైజ్ పోలీసులు చెబుతున్నారు. -
రాష్ట్ర రెవెన్యూపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర రెవెన్యూపై వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా శాఖ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులెలా ఉన్నాయో విభాగాల వారీగా ఆయా శాఖల అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. అనంతరం సీఎం జగన్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ‘మద్య నియంత్రణ, నిషేధం అమలుకు ఎన్ఫోర్స్మెంట్, పోలీసు విభాగాలను మరింత బలోపేతం చేయాలి. స్మగ్లింగ్ జరగకుండా.. నాటు సారా తయారీ కాకుండా కఠిన చర్యలు చేపట్టాలి. మద్యం వల్ల వచ్చే అనర్థాలపై పాఠ్యప్రణాళికలో చేర్చాలి. గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగులకు మద్య నియంత్రణ, నిషేధంపై శిక్షణనివ్వాలి. మద్య నిషేధం అమలుకోసం గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుల సేవల్ని వినియోగించుకోవాలి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లంచాల వ్యవస్థ ఉండకూడదు’అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులిలా.. అంతకు ముందు ఆయా శాఖల అధికారులు సీఎం దృష్టికి పలు అంశాలు తీసుకొచ్చారు. వాణిజ్యపన్నుల్లో 14శాతం వృద్ధి ఉండాల్సి ఉండగా 5.3శాతానికి తగ్గిందని అధికారులు సీఎంకు వివరించారు. గడచిన నాలుగు నెలల్లో ఆదాయంలో అనుకున్నంతమేర వృద్ధిలేదని తెలిపారు. స్టీల్, ఇనుము, సిమెంటు రేట్లు కూడా తగ్గడం ఆదాయంపై ప్రభావం చూపుతోందని అన్నారు. వాహన రంగంలో మందగమనం వల్ల జీఎస్టీ తగ్గిందని పేర్కొన్నారు. కాని, ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆదాయాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. జీఎస్టీ పరిహారం కింద వచ్చే నెల (సెప్టెంబర్) మొదటివారంలో రూ.597 కోట్లు ఆదాయం వస్తుందని సీఎంకు తెలిపారు. వాణిజ్య పన్నుల్లో 14శాతం వృద్ది ఉంటుందని అన్నారు. లిక్కర్ వినియోగం గణనీయంగా తగ్గిందని చెప్పారు. 2018–2019లో 125 లక్షల కేసుల లిక్కర్ విక్రయాలు జరగగా.. బెల్టుషాపుల ఏరివేత వల్ల 2019 జులై వరకూ 12 లక్షల కేసుల వినియోగం తగ్గిందని చెప్పారు. ప్రైవేటు మద్యం దుకాణాలు తొలగింపునకు రంగం సిద్ధమైందని తెలిపారు. దుకాణాల సంఖ్య 4380 నుంచి 3500 తగ్గిస్తున్నామన్నారు. మద్యనియంత్రణ, నిషేధానికి, డీఎడిక్షన్ సెంటర్లకు రూ.500 కోట్లు పెంచుతున్నామన్నారు. -
జిల్లాలో సారా పరవళ్లు
సాక్షి, చీరాల(ప్రకాశం) : జిల్లా ప్రస్తుతం కరువు కాటకాలతో అల్లాడుతోంది. సాగు, తాగునీరు లేక దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటోంది. కరువు బృందాలు జిల్లాలో పర్యటిస్తున్నాయి. ఇటువంటి కరువు జిల్లాలో నాటుసారా మాత్రం పరవళ్లు తొక్కుతోంది. ముఖ్యంగా చీరాలతో పాటు జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలైన గిద్దలూరు, పెద్దదోర్నాల, పుల్లలచెరువు, అర్ధవీడు, మార్కాపురం ప్రాంతాల్లో జోరుగా నాటుసారా తయారీ, విక్రయాలు చేస్తున్నారు. చీరాలకు గుంటూరు జిల్లా స్టూవర్టుపురం నుంచి రోజుకు 1000 లీటర్లకుపైగా నాటుసారా సరఫరా అవుతోంది. చీరాల్లోని రామ్‌నగర్‌లో తయారీదారులు నేరుగా ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్ ఇసుక భూముల్లో సారా తయారు చేస్తున్నారు. పశ్చిమాన అటవీ ప్రాంతాలతో పాటు తండాల్లో తయారీ చేసి పట్టణాలు, గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. సారా లభించని గ్రామాలు లేవంటే అతిశయోక్తి కాదు. గతం టీడీపీ ప్రభుత్వం జిల్లాలో నాటుసారా లేదని ప్రకటించింది. పాలకులు మాత్రం నాటుసారా రహిత జిల్లాగా ఎలా ప్రకటించారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు చీరాలకు మరో పేరు క్షీరపురి. అంటే ఒకప్పుడు పాడిపరిశ్రమతో ఈ ప్రాంతం కళకళలాడేది. ప్రస్తుతం ఆ స్థానంలో సారా వెల్లువగా మారింది. చీరాల ప్రాంతంలో ఎక్కువగా నివసించేది బడుగు, బలహీన వర్గాల వారే. కాయ కష్టం చేసుకుని జీవనం సాగిస్తుంటారు. పని ఒత్తిళ్లు, ఇతర కారణాలతో మద్యం మత్తుకు ఎక్కువ మంది బానిసలవుతున్నారు. కూలి చేసుకుని బతికే ఈ వర్గాల ప్రజలు మద్యం కొనుగోలు చేసి తాగే ఆర్థిక స్థితి లేక ప్రత్యామ్నాయ మార్గంగా సారా వైపు దృష్టి సారిస్తున్నారు. కొన్నేళ్లుగా చీరాల ప్రాంతంలో సారా పరవళ్లు తొక్కుతోంది. చీరాలకు కూతవేటు దూరంలో అంటే ఐదు కిలోమీటర్లలోపే గుంటూరు జిల్లా స్టూవర్టుపురం మందుబాబులతో కోలాహలంగా ఉంటుంది. నాటుసారా కడుపునిండా తాగి తమతో కలిసి మద్యం తాగే వారికి పార్శిల్ రూపంలో కొనుగోలు చేసి రైళ్లలో రోజూ తెస్తుంటారు. వేటపాలెం, పందిళ్లపల్లి, జాండ్రపేట, రామకష్ణాపురం, చీరాల, ఈపూరుపాలెంతో పాటు చినగంజాం, పలు ప్రాంతాల నుంచి స్టూవర్టుపురం వెళ్లి సారాతాగి వెంట కూడా తెచ్చుకోవటం నిత్యకత్యం. సారా రహిత జిల్లా ఎక్కడ? జిల్లాలో నాటుసారా ఊసేలేదని గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ఎక్సైజ్ మంత్రి జవహర్ ప్రకటించారు. కానీ ఎక్కడా సారా ఆగలేదు. జిల్లాలోని చీరాల, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి ప్రాంతాలతో పాటు మారుమూల తండాల్లో కొందరు కొన్నేళ్లుగా నాటుసారా తయారు చేస్తున్నారు. ఏదో చాటుమాటుగా కాకుండా ఇళ్ల వద్దే సారా కాస్తున్నారంటే సారా అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చీరాల, రామ్‌నగర్, ఆదినారాయణపురం, సాయికాలనీ, తోటవారిపాలెం వీవర్స్ కాలనీకి చెందిన కొందరు స్టూవర్టుపురంలో సారాను ఐదు లీటర్ల క్యాన్ రూ.400 కొనుగోలు చేసి మందుబాబులకు గ్లాస్ రూ.10, క్వార్టర్ రూ.20 నుంచి 30 చొప్పున విక్రయిస్తున్నారు. అందులోనూ మొదటి క్వాలిటీ, రెండో క్వాలిటీని బట్టి డబ్బులు వసూలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే చీరాల ప్రాంతంలోని దండుబాట, స్వర్ణ రోడ్డు, జాలమ్మ గుడి, ఉజిలీపేట, శంగారపేట, గాంధీనగర్, ఎఫ్‌సీఐ గోడౌన్స్ సమీపంలో కూడా సారా విక్రయాలు రోజూ భారీ స్థాయిలో జరుగుతుంటాయి. స్థానికంగా కూడా తయారీ గతంలో కేవలం స్టూవర్టుపురంలో మాత్రమే సారా తయారై చీరాలకు సరఫరా చేసేవారు. కానీ సారాకు డిమాండ్ పెరగటంతో స్థానికంగా తయారు చేస్తున్నారు. ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్ పక్కన, రామ్‌నగర్ గ్యాంగి, మత్య్సకార గ్రామం వాడరేవు, విజిలీపేట, జాలమ్మగుడి, ఫ్లయిఓవర్ బ్రిడ్జి కింద, జవహర్‌నగర్ ప్రాంతాలు కాపుసారా అమ్మకాలకు నిలయాలుగా మారాయి. ఇందుకోసం ఎక్సైస్ అధికారులు కొందరు ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని సారా నియంత్రణకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ప్రైవేటు వ్యక్తులు సారా అమ్మకందారులతో చేతుల కలపడంతో సారా పరవళ్లు తొక్కుతోంది. కాపుసారా తయారీకి అధిక మోతాదులో మిరపకాయలు, యూరియా, బ్యాటరీ పౌడర్‌తో పాటు ఇతర హానికర విష పదార్థాలు కలుపుతున్నట్లు సమాచారం. నామమాత్రపు దాడులతో సరి నాటుసారా వ్యవహారాన్ని స్థానిక పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటారు. స్టూవర్టుపురం నుంచి చీరాలకు ఆటోలు, టూవీలర్స్‌లో నేరుగా తరలిస్తుంటారు. ఈపూరుపాలెం రోడ్డు పక్కనే రూరల్ పోలీస్‌స్టేషన్ దాటుకుని నేరుగా ఈపూరుపాలెం, చీరాల ప్రాంతాలకు నాటుసారా తరలిస్తున్నా స్థానిక పోలీసులు సారా పట్టుకుంటే మనకేమి వస్తుందిలే అనుకున్నారెమో గానీ వారి జోలికి వెళ్లడం లేదు. ఎక్సైజ్ పోలీసులు పరిస్థితి మరీ దారుణం. వారికి సారా సామ్రాట్లు అంటే మహా భయం. ఎక్సైజ్ పోలీసులపై సారా అమ్మే మాజీ నేరగాళ్లు పలుమార్లు దాడులు చేసి గాయపరిచిన సంఘటనలు అనేకం ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్‌తో పాటు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, సబ్‌డివిజన్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఉన్నా వారు సారా నియంత్రించడంలో నామమాత్రంగా కూడా దృష్టి పెట్టడం లేదు. -
ఏసీబీ వలలో ‘ఎక్సైజ్’ చేపలు!
నిజామాబాద్‌అర్బన్: లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కారు. కల్లు బట్టి నుంచి శాంపిల్స్ సేకరించి, డబ్బులు డిమాండ్ చేసిన ఎక్సైజ్ టాస్క్‌పోర్స్ ఇన్స్పెక్టర్ జె.వెంకట్‌రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ స్రవంతిలను ఏసీబీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ ప్రసన్నరాణి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ రూరల్ మండలంలోని గూపన్పల్లిలో పులి రాజాగౌడ్ కల్లుబట్టి నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ జె.వెంకట్‌రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ స్రవంతి కల్లు బట్టిపై దాడి చేసి, శాంపిల్స్ సేకరించారు. తదుపరి చర్యలు చేపట్టకుండా ఉండేందుకు గాను అధికారులు రాజాగౌడ్ నుంచి రూ.40 వేలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో రాజాగౌడ్ రూ.30 వేలు ఇస్తానని అంగీకరించాడు. ఆ తర్వాత అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. బుధవారం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం, సీఐ కార్యాలయాలను తనిఖీ చేశారు. మధ్యాహ్యం 2 నుంచి రాత్రి 9.30 గంటల వరకు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా కల్లు బట్టీ నిర్వాహకులను, ఎక్సైజ్ శాఖ అధికారులను విచారించారు. శాంపిల్స్ సేకరించిన తర్వాత పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారా.. లేదా అన్న దానిపై విచారణ జరిపారు. శాంపిల్స్ సేకరించి తమ వద్దే ఉంచుకున్నట్లు వెల్లడైందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్ సంబంధించి గతంలో జరిగిన తనిఖీలు, వివిధ విషయాలపై విచారణ అనంతరం లంచం డిమాండ్ నేరం కింద టాస్క్ఫోర్సు ఇన్స్పెక్టర్ జె.వెంకట్‌రెడ్డి, సబ్ఇన్స్పెక్టర్ స్రవంతిలను అరెస్టు చేశారు. -
భారీగా మద్యం సీసాలు స్వాదీనం..
సాక్షి, తెర్లాం : స్థానిక ఎక్సైజ్ పోలీసుస్టేషన్ పరిధిలో గల తెర్లాం, బాడంగి మండలాల్లో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తెర్లాం ఎక్సైజ్ సీఐ పిన్నింటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో విస్తృతంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో ఎటువంటి అనుమతి లేకుండా తరలిస్తున్న 179 మద్యం సీసాలు, 12 బీర్లు బాటిళ్లను సీజ్ చేయడంతో పాటు ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్టు సీఐ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. బాడంగి మండలం డొంకినవలస గ్రామ పరిధిలో అదే మండలం పిన్నవలసకు చెందిన ఎన్.శివరామకృష్ణ అనే వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న 96 మద్యం సీసాలు, 12బీర్లు స్వాధీనం చేసుకున్నారు. తెర్లాం మండలం డి.గదబవలస గ్రామానికి చెందిన సీహెచ్ బలరాం నుంచి 25 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేశారు. మండలంలోని కుసుమూరు గ్రామానికి చెందిన రెడ్డి లకు‡్ష్మనాయుడు అనే వ్యక్తి అనధికారికంగా నిర్వహిస్తున్న బెల్ట్ దుకాణంపై దాడి చేసి 58మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని, అతన్ని అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఆయనతో పాటు ఎక్సైజ్ ఎస్ఐ జీవీ రమణ, సిబ్బంది ఉన్నారు. -
అధికార పార్టీ ‘‘మందు’’చూపు
సాక్షి, కర్నూలు: ఎన్నికలు అనగానే తాయిలాల నుంచి మద్యం వరకు అంతా సందడే. ఓటర్ల కొనుగోలు ప్రక్రియలో భాగంగా మద్యం పారించి ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే మద్యం కిక్కు పెంచేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున ‘ఇండెంట్లు’ ఇచ్చి అంతకంతకూ పెంచుకుని రహస్య ప్రదేశాల్లో భారీ ఎత్తున మద్యాన్ని నిల్వ చేశారు. తర్వాత అధిక రేట్లకు బెల్టు దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ విచారణలో బయటపడింది. నాలుగు మద్యం దుకాణాలు సీజ్ ఎన్నికల నియమావళి అమలులో భాగంగా ఎక్సైజ్ అధికారులు అక్రమ మద్యం నిల్వలపై దృష్టి సారించారు. గూడూరులో నందవరం అక్షిత వైన్స్‌లో 70 కేసుల మద్యం, గూడూరులో సూర్య వైన్స్‌లో 1,076 బాక్సులు, నంద్యాల సూర్య వైన్స్‌లో 200 బాక్సులు, బేతంచర్ల రమ్య వైన్స్‌లో 300 బాక్సులు మద్యాన్ని ఆయా దుకాణాలకు దూరంగా రహస్యంగా నిల్వ ఉంచినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని షాపులను మొత్తం సీజ్ చేశారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన నందవరం మద్యం దుకాణం టీడీపీకి చెందిన కౌన్సిలర్ రామకృష్ణ నిర్వహిస్తున్నట్లు సమాచారం. అలాగే నంద్యాల, బేతంచర్ల, గూడూరులో కూడా అధికార పార్టీ నాయకుల అనుచరులే మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ మొబైల్ పార్టీ సీఐలు వరలక్ష్మి, లక్ష్మణదాసు నేతృత్వంలో గూడూరు, నందవరం లో తనిఖీలు నిర్వహించి దుకాణాలు సీజ్ చేయగా నంద్యాల, బేతంచర్లలో స్టేట్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) అధికారులు దాడుల్లో పాల్గొన్నారు. కొంతకాలంగా తనిఖీలు శూన్యం కొంతకాలంగా పెద్ద ఎత్తున మద్యం నిల్వలు చేస్తున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు దుకాణాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. జిల్లాలో 206 మద్యం దుకాణాలు, 48 బార్లు, రెండు క్లబ్‌లు ఉన్నాయి. ప్రతి నెలా సంబంధిత స్టేషన్ అధి కారి లేదా ఎన్ఫోర్స్మెంట్, డీటీఎఫ్ అధికారులు మద్యం షాపుల్లో విక్రయాలు, నిల్వలు తదితర అంశాలపై తనిఖీలు చేయాల్సి ఉంది. జిల్లాలో ఉన్న మద్యం దుకాణాల్లో అత్యధిక భాగం అధికార పార్టీకి చెందినవి కావడంతో ఎక్సైజ్ అధికారులు దుకాణాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కొను గోలు కేంద్రాల నుంచి దుకాణాలకు మద్యం తరలించేటప్పుడు ట్రాన్స్‌పోర్టు పర్మిట్లను ఎక్సైజ్ అధికారు లు తనిఖీ చేయాలి. అలాగే దుకాణాల్లో ఆర్–1, ఆర్–2 రిజిస్టర్లు కూడా విధిగా తనిఖీ చేయాల్సి ఉం ది. గతంలో డీటైల్డ్ ఇన్స్పెక్షన్ నిర్వహించేవారు. ఆ విధానానికి స్వస్తి చెప్పడంతో మద్యం వ్యాపారులు దుకాణాల్లోని మద్యాన్నంత బెల్టు షాపులకు అధిక రేట్లకు కట్టబెట్టి సొమ్ము చేసుకుంటున్నా ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు ఉంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. రహస్య ప్రాంతాల్లో రూ.500 కోట్ల మద్యం నిల్వలు ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు సుమారు రూ.500 కోట్లకు పైగా విలువ చేసే మద్యాన్ని ముందుగానే రహస్య స్థావరానికి తరలించి నిల్వ చేసినట్లు సమాచారం. జిల్లాలో నంద్యాల, కర్నూలులో మద్యం సరఫరా చేసే డిపోలు ఉన్నాయి. ఆయా డిపోల నుంచి కొనుగోలు చేసే మద్యమే కాకుండా కర్ణాటక నుంచి భారీ ఎత్తున నకిలీ మద్యాన్ని దిగుమతి చేసుకుని నిల్వ ఉంచినట్లు సమాచారం. కర్నూలు, నంద్యాల ఐఎంఎల్ డిపోలో వారం రోజులుగా రేషన్ విధానం అమలులోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ విధానం అమలు చేసి పరిమితంగా మద్యం సరఫరా చేస్తున్నారు. దీంతో ఎన్నికల బరిలో ఉన్న అధికార పార్టీ నేతలు పొరుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున మద్యాన్ని జిల్లాలోకి దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున అక్రమ మద్యం ఎన్నికల ప్రకటన వెలువడకముందే అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున మద్యం నిల్వలను వారి వారి నియోజకవర్గాల్లో డంప్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా పత్తికొండ, డోన్, బనగానపల్లె, నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో భారీ ఎత్తున అధికార పార్టీ నేతలు మద్యాన్ని నిల్వ చేసి ఊరూరా బెల్టు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఎమ్మార్పీకి అదనంగా రూ.10 వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో అర్ధరాత్రి కూడా పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. సాధారణ రోజుల్లో ప్రతినెలా వంద కోట్లకు పైగా మద్యం కొనుగోళ్లు జరిగేవి. అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీకి చెందిన నాయకులు రెట్టింపు మద్యాన్ని ముందుగానే కొనుగోలు చేసి రహస్య ప్రదేశాల్లో నిల్వ చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. -
లిక్కర్ అమ్మకాలకు డబుల్ కిక్కు
సాక్షి, హైదరాబాద్: లిక్కర్ అమ్మకాలకు ఎన్నికల వాతావరణం కిక్కు ఎక్కిస్తోంది. మరోవైపు దసరా సంబురాలు సమీపిస్తుండటంతో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. గ్రేటర్ పరిధిలో నిత్యం రూ.10 కోట్ల మేర వివిధ రకాల బ్రాండ్ల మద్యం, బీర్లు అమ్ముడవుతుండగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరవాత అమ్మకాల్లో 15 శాతం పెరుగుదల నమోదైనట్లు ఆబ్కారీ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మహానగరం పరిధిలో సుమారు 400 మద్యం దుకాణాలు, మరో 500 బార్లు వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తల సమావేశాలు, చీర్స్ పార్టీలతో హోరెత్తుతున్నాయి. గతేడాది దసరా కంటే ఈసారి అమ్మకాల్లో 25 శాతం వృద్ధి నమోదవుతుందని ఆబ్కారీ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గ్రేటర్లో రోజుకు సుమారు పది లక్షల లీటర్ల బీరు, ఐదు లక్షల లీటర్ల మేర దేశీ, విదేశీ బ్రాండ్ల మద్యాన్ని నిషాచరులు సేవిస్తున్నట్లు ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. ప్రతి శుక్ర, శని వారాల్లో మద్యం వాడకం అధికంగా ఉందని ఆబ్కారీశాఖ లెక్కలు చెబుతున్నాయి. ప్రధానంగా 16–35 ఏళ్ల మధ్యనున్నవారు బీరు, 35–55 మధ్య వయస్కులు విస్కీ సేవిస్తుండటం గమనార్హం. వీకెండ్లో జోష్... ఐటీ, బీపీవో, కేపీవో, రియల్టీ, సేవారంగాల్లో పనిచేస్తున్నవారిలో అత్యధికులు శుక్ర, శనివారాల్లో లిక్కర్ కిక్కుతో పసందు చేసేందుకు మక్కువ చూపిస్తున్నట్లు తాజా మద్యం అమ్మకాల తీరుతో తెలుస్తోంది. గ్రేటర్లో సాధారణ రోజుల్లో నిత్యం సుమారు రూ.10 కోట్ల మద్యం అమ్మకాలు సాగుతుండగా, అవి వీకెండ్లో రూ.20 కోట్లకు పైమాటే ఉంటున్నాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. బడా లిక్కర్ మాల్ క్యాకమాల్... జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని ఓ బడాలిక్కర్ మాల్ మందుబాబులు, గ్రేటర్ సిటీజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ లిక్కర్‌మాల్ ఆసియాలోనే అత్యంత పెద్దదిగా ప్రాచుర్యం పొందింది. దీనిలో సుమారు 1,100 రకాల దేశీ, విదేశీ బీరు, విస్కీ, బ్రాందీ, వైన్ రకాలు లభిస్తున్నాయి. రూ.300 ధర పలికే బీరు మొదలు రూ.5.23 లక్షల విలువ చేసే ఖరీదైన విస్కీ వరకు ఇక్కడ లభిస్తున్నాయి. ఇక్కడ నెలకు రూ.5 కోట్ల మేర అమ్మకాలవుతున్నాయి. ఇందులో సింహభాగం విదేశీ సరుకుదే. ఏ విదేశీ మద్యాన్ని ఎలా ఆస్వాదించాలి.. ఏ మద్యం సేవిస్తే, ఎలాంటి స్టఫ్ తీసుకోవాలన్న అంశంపై కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో అవగాహన కల్పించేందుకు సైతం ఈ మాల్లో ఏర్పాట్లు చేయడం విశేషం. క్షణాల్లో బీ(రు) రెడీ... బీర్బలుల దాహార్తిని తీర్చేందుకు క్షణాల్లో బీరును సిద్ధం చేసి చిల్డ్‌గా సర్వ్ చేసేందుకు గ్రేటర్ పరిధిలో ఏడు మినీ బ్రూవరీలు సైతం అందుబాటులోకి రావడం విశేషం. వీటికి ఇటీవలి కాలంలో ఆదరణ బాగా పెరిగినట్లు నిర్వాహకులు ’సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ఓ బ్రూవరీని నిత్యం వెయ్యిమందికిపైగానే సందర్శిస్తుండగా అది వీకెండ్లో 2500–3000 వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
గంజాయి ‘సాగు’తోంది
జిల్లాలో మళ్లీ గంజాయి వాసన గుప్పుమంటోంది. పంట చేలలో అంతరపంటగా సాగవుతోంది. ఒకప్పుడు పెద్ద ఎత్తున గంజాయి సాగైన గాంధారి మండలంలోనే మరోసారి ఆనవాళ్లు లభించాయి. రవాణాకూ ఇదే ప్రాంతం అడ్డాగా మారడం ఆందోళన కలిగిస్తోంది. సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దశాబ్ద కాలం క్రితం వరకు భారీ ఎత్తున గంజాయి పంట సాగైంది. గంజాయి సాగుతో పాటు దందా కూడా పెద్ద ఎత్తున చేశారు. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు గంజాయి రవాణా జరిగేది. అయితే ప్రభుత్వం గంజాయిపై కఠినంగా వ్యవహరించడంతో అప్పట్లో గంజాయి సాగు ఆగిపోయింది. అయినా ఎక్కడో ఒకచోట గంజాయి మొక్కలు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఇటీవల గాంధారి మండలంలోని సీతాయిపల్లి శివారులో గల మక్క చేనులో ఆనవాళ్లు లభించాయి. మక్క చేనులో అంతరపంటగా సాగవుతున్న గంజాయి మొక్కలను పీకేయించి సాగుదారులపై కేసులు నమోదు చేశారు. అంతరపంటగా.. మక్క చేను, కూరగాయల మొక్కల మధ్య గంజాయిని అంతర పంటగా సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో గుడుంబా తయారీని అరికట్టామని, గంజాయి వాసన లేకుండా చేశామని ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. కానీ వాటి ఆనవాళ్లు ఇంకా ఉండడం గమనార్హం. జిల్లాలోని అటవీ ప్రాంతంలో, పలు గ్రామాల్లో పంట చేలల్లో గంజాయి సాగవుతున్నట్టు తెలుస్తోంది. వైజాగ్ టు మహారాష్ట్ర వయా గాంధారి... గంజాయి అక్రమ రవాణాకు గాంధారి అడ్డాగా మారింది. రెండు నెలల కాలంలో గంజాయిని తరలిస్తుండగా గాంధారి ప్రాంతంలో రెండుసార్లు పట్టుకున్నారు. గత డిసెంబర్లో 58 కిలోల గంజాయిని, జనవరిలో 3 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో గంజాయి దందాలో రాటుదేలిన వాళ్లు ఇప్పటికీ ఆ దందాను మరిచిపోలేకపోతున్నారని తెలుస్తోంది. ఇటీవల వెలుగు చూస్తున్న ఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ ప్రాంతం నుంచి గంజాయిని మహారాష్ట్రకు పెద్ద ఎత్తున తరలిస్తుంటారు. ఈ రవాణా గాంధారి మీదుగా సాగుతోందని తెలుస్తోంది. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ సంఘటనలు కూడా గాంధారిలోనే జరగడం, తాజాగా గంజాయి సాగు వ్యవహారం కూడా అదే మండలంలో వెలుగు చూడడంతో గంజాయి మూలాలు ఇంకా పోలేదని భావిస్తున్నారు. గంజాయిపై మరింత నిఘా వేయాల్సిన అవసరం ఉంది. గంజాయి సాగు చేస్తే కేసులు తప్పవు గంజాయి సాగు, రవాణా చేయడం నేరాలు. గంజాయి అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. కేసుల్లో ఇరుక్కున్నవారు ఇబ్బందులు పడతారు. గంజాయి సాగుపై నిఘా ఉంచాం. పంట చేనులో గంజాయి సాగు చేస్తే సాగుదారుతోపాటు భూమి యజమానిపై కూడా కేసులు పెడ్తాం. – శ్రీనివాస్,ఎక్సైజ్ సూపరింటెండెంట్, కామారెడ్డి జిల్లా -
ఉత్సాహంగా ఎక్సైజ్ ఆటల పోటీలు
విజయవాడ స్పోర్ట్స్ : జిల్లా ఎక్సైజ్ శాఖ ఆటల పోటీలు గురువారం స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఉత్సాహంగా జరిగాయి. పోటీలను ఆ శాఖ డెప్యూటీ కమిషనర్ డీవీ సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కబడ్డీ, షటిల్, బాల్‌బ్యాడ్మింటన్, వాలీబాల్, అథ్లెటిక్స్, క్యారమ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల నుంచి జనవరి 6వ తేదీన ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి ఎక్సైజ్ శాఖ ఆటల పోటీల్లో పాల్గొనే జట్లను ఎంపిక చేయనున్నారు.