సాక్షి, నల్లగొండ : పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లాలో 38 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేయగా 5,640 దరఖాస్తులు అధికారులకు అం దాయి. ఒక్కో పోస్టుకు దాదాపు 149 మంది పోటీ పడుతున్నారు. జిల్లాలో నిరుద్యోగ తీవ్రతకు ఇది అద్దం పడుతోంది. ఉన్నత చదువులు అభ్యసించినా ప్రభుత్వం ఏదైనా పర్వాలేదని భావించి అధిక సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాంట్రాక్ట్ కార్యదర్శులను వెయిటేజీ పద్ధతిన నియమిస్తారు. ఏడాది సర్వీసుకు మూడు మార్కులు చొప్పున మొత్తం 15, డిగ్రీ పూర్తయినప్పటి నుంచి ఏడాదికి ఒక మార్కు లెక్కన 10కి మించకుండా వేయిటేజీ కల్పిస్తారు. అభ్యర్థికి గరిష్టంగా 25 మార్కులు వెయిటేజీ రూపంలో లభిస్తాయి. మిగిలిన అభ్యర్థులను కేవలం మెరిట్ ప్రాతిపదికనే ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఇం టర్వ్యూలు ఉండవు.
చర్యలు తప్పవు : కలెక్టర్
పంచాయతీ కార్యదర్శి పోస్టులను పార్శదర్శకంగా భర్తీ చేస్తామని కలెక్టర్ చిరంజీవులు పేర్కొన్నారు. మధ్యవర్తులు, దళారులను నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సూచించారు. అభ్యర్థులను మోసం చేసినట్లు గుర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
పంచాయతీ కార్యదర్శి పోస్టులకు తీవ్ర పోటీ
Published Wed, Nov 6 2013 4:16 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement