Heavy competition
-
టీడీపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి
-
వరంగల్ టికెట్ కోసం పోటాపోటీ!
హైదరాబాద్: మీకు తెలుసా.. వరంగల్ లోక్‌సభ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో పోటీ ఎక్కువగా ఉందట! స్వయంగా తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డే ఈ విషయం చెప్పారు. వరంగల్ లోక్‌సభ టికెట్ కావాలని ఎనిమిది మంది కోరారని ఆయన వెల్లడించారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కడియం శ్రీహరి వరంగల్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. గెలుపు అవకాశాలపై సర్వే చేయించినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ నెల 21, 22 తేదీల్లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వరంగల్, హైదరాబాద్‌లలో పర్యటిస్తారని తెలిపారు. ఈ నెల 17న జగ్గారెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. -
'రాజ్యసభ' కోసం నేతల పోటాపోటీ
ఎన్నికల షెడ్యూలు విడుదలతో నేతల యత్నాలు తమకు మళ్లీ అవకాశం ఇవ్వాలంటున్న సిట్టింగ్ సభ్యులు బడా పారిశ్రామికవేత్తలను దింపే యోచనలో కాంగ్రెస్, టీడీపీ తన వర్గీయుల కోసం సీఎం తెరవెనుక యత్నాలు సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో టికెట్ కోసం ఆయా పార్టీల్లో చాలామంది నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్, టీడీపీలు బడా పారిశ్రామికవేత్తలను రంగంలో నిలిపే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి కేవీపీ రామచంద్రరావు, ఎంఏ ఖాన్, నంది ఎల్లయ్య, రత్నాభాయి, టి.సుబ్బిరామిరెడ్డిల పదవీ కాలం ముగుస్తుండగా.. తిరిగి తమకే అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. కేవీపీ రామచంద్రరావు, నంది ఎల్లయ్యలకు మరోసారి అవకాశం కల్పిస్తారని పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఈసారి రంగంలో నిలవాల్సిందిగా పారిశ్రామికవేత్త, జీవీకే గ్రూపు చైర్మన్ జీవీకే రెడ్డిని కాంగ్రెస్ కోరే అవకాశాలున్నాయి. ఈసారి అభ్యర్థుల ఎంపికను పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యవేక్షిస్తారని చెబుతుండటంతో ఒకరిద్దరి పేర్లు అనూహ్యంగా తెరపైకి రావొచ్చని వినిపిస్తోంది. సుబ్బిరామిరెడ్డి విశాఖపట్నం నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నందున ఆయన పేరు పరిశీలనలో ఉండే అవకాశం లేదు. కేంద్ర కేబినెట్లో అత్యధికంగా సీమాంధ్రకు చెందిన వారికే చోటు కల్పించినందున.. రాజ్యసభ స్థానాల్లో రెండింటిని విభజన పరిణామాల నేపథ్యంలో తెలంగాణ వారికి ఇస్తారని భావిస్తున్నారు. ఎంఐఎంతో ఉన్న చెలిమి దృష్ట్యా ఆపార్టీ సభ్యుల వుద్దతు కోసం మైనార్టీ కోటా కింద ఆపార్టీ సహకారం అందించే నేతను కాంగ్రెస్ ఎంపిక చేయువచ్చని చెబుతున్నారు. ఇదివరకు ఈ కోవలో ఎంఏ ఖాన్ ఎంపికయ్యూరు. ఈసారి కూడా తనకు అవకాశం ఇవ్వాలని ఆయున అధిష్టానాన్ని కోరుతున్నారు. ఇలా ఉండగా విభజనను విభేదిస్తున్నట్లుగా పైకి ప్రకటనలు చేస్తూ లోలోపల అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్న వుుఖ్యవుంత్రి కూడా తన వర్గీయుులకు అవకాశాలు దక్కేలా తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న బడా కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల్లో ఇద్దరి పేర్లను తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. గత రాజ్యసభ ఎన్నికల్లో రఘురామిరెడ్డి తదితరుల పేర్లు సీఎం కోటాకింద ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈసారీ ఇవే పేర్లు ఉండవచ్చంటున్నారు. రెండోస్థానంపై టీడీపీ దృష్టి ప్రస్తుత సంఖ్యా బలం మేరకు రెండు స్థానాలను గెలుచుకోవచ్చని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. దీంతో గత రాజ్యసభ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన గరికపాటి మోహన్‌రావుకు ఈసారి టికెట్ ఖాయమని వినిపిస్తోంది. ఆర్థికంగా బలమైన నారాయణ విద్యా సంస్థల చైర్మన్ పి.నారాయణ ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, బక్కని నర్సింహులు, అరవింద్‌కుమార్‌గౌడ్, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎంఏ షరీఫ్, పంచుమర్తి అనురాధ ఆశావహుల జాబితాలో ఉన్నారు. అరుుతే నందమూరి హరికృష్ణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో ఎన్టీఆర్ కుటుంబసభ్యుల నుంచే ఒకరికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ కారణంగా బాలకృష్ణకు అవకాశం కల్పిస్తారని కూడా చెబుతున్నారు. -
కమిషనర్ పోస్టుకు పోటాపోటీ
వైద్యవిధాన పరిషత్‌లో పైరవీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య విధానపరిషత్ కమిషనర్ పోస్టుకోసం పోటాపోటీగా యత్నాలు సాగుతున్నాయి. రాష్ట్రంలోని 212 ప్రభుత్వ ఆస్పత్రులకు అధిపతి, కమిషనరే కావడంతో ఈ పదవికోసం ఐదారుగురు వైద్యులు ముమ్మరంగా యత్నిస్తున్నారు. సీనియారిటీలు, పదోన్నతుల ప్రాతిపదిక నియామకం అనే ప్రాథమిక సూత్రాలు పనిచేయకపోవడంతో నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి లేదా ముఖ్య కార్యదర్శికి నచ్చిన వాళ్లే కమిషనర్లు అవుతున్నారు. ప్రస్తుత కమిషనర్ ఈనెల 31తో పదవీ విరమణ చేసేలోగానే ఇన్చార్జిగా కమిషనర్‌ను నియమించాల్సి ఉంది. వైద్య విధానపరిషత్‌లోని విజిలెన్స్ అధికారి డాక్టర్ కనకదుర్గతో పాటు, కార్యదర్శి గోపీకృష్ణలు ప్రస్తుతం ఈ పోస్టుకు పోటీపడుతున్నారు. కుటుంబ సంక్షేమశాఖ జాయింట్ డెరైక్టర్ జయకుమారి, ఏపీశాక్స్‌లో జేడీగా ఉన్న జయచంద్రారెడ్డి కూడా రేసులో ఉన్నారు. అయితే, హెచ్ఐవీ కిట్ల కేసుకు సంబంధించి జయచంద్రారెడ్డిపై ఇటీవలే అవినీతి ఆరోపణలు వచ్చాయి కాబట్టి, ఆయనకు కమిషనర్ పోస్టు దక్కకపోవచ్చని ఓ అధికారి అన్నారు. మరో ఇద్దరు కూడా కమిషనర్ పదవికి పోటీలో ఉన్నట్టు తెలిసింది. ఆశావహులంతా, వారం రోజులుగా అటు ముఖ్యమంత్రి చుట్టూ, ఇటు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి చుట్టూ తిరుగుతున్నారు. తమకు నచ్చిన అధికారి కమిషనర్‌గా వస్తే బావుంటుందనే ఆశతో ఆస్పత్రుల నిర్వహణను చూసే కాంట్రాక్టర్లూ రంగంలోకి దిగారు. కమిషనర్ పోస్టుతోపాటు పరిషత్ కార్యదర్శిని నియమించేందుకు, పదోన్నతుల కమిటీ (డీపీసీ)ని శనివారం ఏర్పాటు చేశారు. నచ్చిన ఓ అధికారిని కార్యదర్శిగా నియమించడానికి రంగం సిద్ధమైనట్టు తెలిసింది. దీనిపై సీఎం పేషీనుంచి ఒత్తిళ్లు రావడంతో ముఖ్య కార్యదర్శి కూడా ఓకే చెప్పినట్టు తెలిసింది! -
పంచాయతీ కార్యదర్శి పోస్టులకు తీవ్ర పోటీ
సాక్షి, నల్లగొండ : పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లాలో 38 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేయగా 5,640 దరఖాస్తులు అధికారులకు అం దాయి. ఒక్కో పోస్టుకు దాదాపు 149 మంది పోటీ పడుతున్నారు. జిల్లాలో నిరుద్యోగ తీవ్రతకు ఇది అద్దం పడుతోంది. ఉన్నత చదువులు అభ్యసించినా ప్రభుత్వం ఏదైనా పర్వాలేదని భావించి అధిక సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాంట్రాక్ట్ కార్యదర్శులను వెయిటేజీ పద్ధతిన నియమిస్తారు. ఏడాది సర్వీసుకు మూడు మార్కులు చొప్పున మొత్తం 15, డిగ్రీ పూర్తయినప్పటి నుంచి ఏడాదికి ఒక మార్కు లెక్కన 10కి మించకుండా వేయిటేజీ కల్పిస్తారు. అభ్యర్థికి గరిష్టంగా 25 మార్కులు వెయిటేజీ రూపంలో లభిస్తాయి. మిగిలిన అభ్యర్థులను కేవలం మెరిట్ ప్రాతిపదికనే ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఇం టర్వ్యూలు ఉండవు. చర్యలు తప్పవు : కలెక్టర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులను పార్శదర్శకంగా భర్తీ చేస్తామని కలెక్టర్ చిరంజీవులు పేర్కొన్నారు. మధ్యవర్తులు, దళారులను నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సూచించారు. అభ్యర్థులను మోసం చేసినట్లు గుర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.