వరంగల్ టికెట్ కోసం పోటాపోటీ! | heavy competition in congress for warangal lok sabha ticket, says uttam kumar reddy | Sakshi
Sakshi News home page

వరంగల్ టికెట్ కోసం పోటాపోటీ!

Published Mon, Aug 3 2015 4:26 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

వరంగల్ టికెట్ కోసం పోటాపోటీ! - Sakshi

వరంగల్ టికెట్ కోసం పోటాపోటీ!

హైదరాబాద్: మీకు తెలుసా.. వరంగల్ లోక్సభ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో పోటీ ఎక్కువగా ఉందట! స్వయంగా తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డే ఈ విషయం చెప్పారు. వరంగల్ లోక్సభ టికెట్ కావాలని ఎనిమిది మంది కోరారని ఆయన వెల్లడించారు.

తెలంగాణ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కడియం శ్రీహరి వరంగల్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. గెలుపు అవకాశాలపై సర్వే చేయించినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ నెల 21, 22 తేదీల్లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వరంగల్, హైదరాబాద్లలో పర్యటిస్తారని తెలిపారు. ఈ నెల 17న జగ్గారెడ్డి కాంగ్రెస్లో చేరుతారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement