ఎన్నికల షెడ్యూలు విడుదలతో నేతల యత్నాలు
తమకు మళ్లీ అవకాశం ఇవ్వాలంటున్న సిట్టింగ్ సభ్యులు
బడా పారిశ్రామికవేత్తలను దింపే యోచనలో కాంగ్రెస్, టీడీపీ
తన వర్గీయుల కోసం సీఎం తెరవెనుక యత్నాలు
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో టికెట్ కోసం ఆయా పార్టీల్లో చాలామంది నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్, టీడీపీలు బడా పారిశ్రామికవేత్తలను రంగంలో నిలిపే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి కేవీపీ రామచంద్రరావు, ఎంఏ ఖాన్, నంది ఎల్లయ్య, రత్నాభాయి, టి.సుబ్బిరామిరెడ్డిల పదవీ కాలం ముగుస్తుండగా.. తిరిగి తమకే అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. కేవీపీ రామచంద్రరావు, నంది ఎల్లయ్యలకు మరోసారి అవకాశం కల్పిస్తారని పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఈసారి రంగంలో నిలవాల్సిందిగా పారిశ్రామికవేత్త, జీవీకే గ్రూపు చైర్మన్ జీవీకే రెడ్డిని కాంగ్రెస్ కోరే అవకాశాలున్నాయి.
ఈసారి అభ్యర్థుల ఎంపికను పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యవేక్షిస్తారని చెబుతుండటంతో ఒకరిద్దరి పేర్లు అనూహ్యంగా తెరపైకి రావొచ్చని వినిపిస్తోంది. సుబ్బిరామిరెడ్డి విశాఖపట్నం నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నందున ఆయన పేరు పరిశీలనలో ఉండే అవకాశం లేదు. కేంద్ర కేబినెట్‌లో అత్యధికంగా సీమాంధ్రకు చెందిన వారికే చోటు కల్పించినందున.. రాజ్యసభ స్థానాల్లో రెండింటిని విభజన పరిణామాల నేపథ్యంలో తెలంగాణ వారికి ఇస్తారని భావిస్తున్నారు. ఎంఐఎంతో ఉన్న చెలిమి దృష్ట్యా ఆపార్టీ సభ్యుల వుద్దతు కోసం మైనార్టీ కోటా కింద ఆపార్టీ సహకారం అందించే నేతను కాంగ్రెస్ ఎంపిక చేయువచ్చని చెబుతున్నారు. ఇదివరకు ఈ కోవలో ఎంఏ ఖాన్ ఎంపికయ్యూరు. ఈసారి కూడా తనకు అవకాశం ఇవ్వాలని ఆయున అధిష్టానాన్ని కోరుతున్నారు.
ఇలా ఉండగా విభజనను విభేదిస్తున్నట్లుగా పైకి ప్రకటనలు చేస్తూ లోలోపల అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్న వుుఖ్యవుంత్రి కూడా తన వర్గీయుులకు అవకాశాలు దక్కేలా తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న బడా కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల్లో ఇద్దరి పేర్లను తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. గత రాజ్యసభ ఎన్నికల్లో రఘురామిరెడ్డి తదితరుల పేర్లు సీఎం కోటాకింద ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈసారీ ఇవే పేర్లు ఉండవచ్చంటున్నారు.
రెండోస్థానంపై టీడీపీ దృష్టి
ప్రస్తుత సంఖ్యా బలం మేరకు రెండు స్థానాలను గెలుచుకోవచ్చని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. దీంతో గత రాజ్యసభ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన గరికపాటి మోహన్‌రావుకు ఈసారి టికెట్ ఖాయమని వినిపిస్తోంది. ఆర్థికంగా బలమైన నారాయణ విద్యా సంస్థల చైర్మన్ పి.నారాయణ ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, బక్కని నర్సింహులు, అరవింద్‌కుమార్‌గౌడ్, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎంఏ షరీఫ్, పంచుమర్తి అనురాధ ఆశావహుల జాబితాలో ఉన్నారు. అరుుతే నందమూరి హరికృష్ణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో ఎన్టీఆర్ కుటుంబసభ్యుల నుంచే ఒకరికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ కారణంగా బాలకృష్ణకు అవకాశం కల్పిస్తారని కూడా చెబుతున్నారు.
'రాజ్యసభ' కోసం నేతల పోటాపోటీ
Published Tue, Jan 14 2014 7:25 PM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement
Advertisement