సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. గత రెండు, మూడు రోజులుగా కురిసిన వర్షానికి జనజీవనం స్థంభించిపోయింది. సోమవారం ఉదయం కాస్త తగ్గిన వర్షం మధ్యాహ‍్నం నుంచి మళ్లీ మొదలైంది. భారీ వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
పెన్నా, కుందు, పాపాగ్ని నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. భారీ వర్షానికి సగిలేరు, మాండవ్య నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. అన్నమయ్య ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు. భారీ వర్షం ధాటికి వరి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment