ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలు
సాక్షి, కడప: అధికారుల నిర్లక్ష్యం కారణంగా 90 ఏళ్ల వృద్ధురాలు కూలిన రేకుల షెడ్డు కింద మూడు రోజులుగా ప్రాణాలతో పోరాడాల్సిన పరిస్థితి తలెత్తింది. వివరాలు.. శుక్రవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురియడంతో వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయం వద్ద ఏర్పాటు చేసిన రేకుల షెడ్డు కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు చనిపోవడం, 32 మందికి గాయాలైన సంగతి తెల్సిందే.
అధికారులు సరిగ్గా గమనించకపోవడంతో రేకుల షెడ్డు కింద ఉన్న 90 ఏళ్ల వృద్ధురాలు మూడు రోజులుగా అక్కడే ఉండిపోయింది. సోమవారం రేకులను తొలగిస్తుండగా కార్మికులు గమనించడంతో ప్రాణాలతో బయటపడగలిగింది. అనంతరం ఆమెను హుటాహుటిన 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment