శ్రీశైలం : శ్రీశైలమహాక్షేత్రం నిమజ్జన భక్తజనంతో సోమవారం కళకళలాడుతూ కనిపించింది. అదేరోజు రాత్రి ఆలయప్రాంగణంలోని దీపార్చన మండపంలో సహస్రదీపోత్సవం, ప్రత్యేకపూజలను అర్చకులు నిర్వహించిన తరువాత స్వామిఅమ్మవార్లను వెండిరథంపై ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణ చేయించారు. మల్లన్న దర్శనం, సహస్రదీపార్చన, వెండిరథోత్సవసేవను తిలకించిన భక్తులు ఆధ్యాత్మికానందంతో పులకించిపోయారు.