
'మత్స్యకారులను స్వస్థలాలకు చేర్చండి'
హైదరాబాద్: బంగ్లాదేశ్‌కు చేరిన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సూర్యారావుపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారుల్ని క్షేమంగా స్వస్థలానికి చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గల్లంతయిన మత్స్యకారులు బంగ్లాదేశ్‌లోని ఓ తీరానికి సురక్షితంగా చేరినట్లు సమాచారం తెలియడంతో స్పందించిన సీఎం ఢిల్లోని రెసిడెంట్ కమిషనర్‌తో శనివారం ఫోన్‌లో మాట్లాడారు.
బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి ఆ ఆరుగురిని వెంటనే కాకినాడ చేర్చేలా ఏర్పాట్లు చేయించాలని సీఎం చూచించారు. బంగ్లాదేశ్‌కు చేరిన బోటులో తొండంగి మండలం హుకుంపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులను కూడా ఉన్నారు. వారందరినీ క్షేమంగా చేర్చే విషయంలో మంత్రి కొల్లు రవీంద్రకు బాధ్యతలు అప్పగించినట్లు ప్రభుత్వ సమాచారం సలహాదారు కార్యాలయం ఒక ప్రటకనలో తెలిపింది.