ఆ అధికారం మాకెక్కడిది?: హైకోర్టు | High Court comments | Sakshi
Sakshi News home page

ఆ అధికారం మాకెక్కడిది?: హైకోర్టు

Published Wed, Oct 19 2016 1:12 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

High Court comments

సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో చేసిన ప్రకటనలను అమలు చేయాలంటూ ఆదేశాలిచ్చే అధికారం తమకు ఎక్కడ ఉందో చూపాలని హైకోర్టు మంగళవారం పిటిషనర్‌ను అడిగింది. అధికారం ఉందని చూపించడంతో పాటు వాదనలతో తమను సంతృప్తిపరిస్తే తప్పకుండా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటామని పేర్కొంది. లోతుగా అధ్యయనం చేసి న్యాయస్థానానికి సహకరించాలని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి అంబటి శంకర నారాయణతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్‌ను ఆదేశించాలని, అలాగే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న హామీలన్నింటినీ వేగంగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు పై ఆదేశాలిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement