దుగ్గరాజపట్నం ఓడరేవుకు కేంద్రం బ్రేక్
- వాణిజ్యపరంగా ఉపయోగం లేదు..
- రాష్ట్ర సర్కారుకు స్పష్టం చేసిన ఓడరేవుల మంత్రిత్వ శాఖ
సాక్షి, అమరావతి: రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్రం ప్రకటించిన దుగ్గరాజపట్నం భారీ ఓడరేవు నిర్మాణంపై నీలి నీడలు అలు ముకున్నాయి. రాష్ట్ర విభజన జరిగి రెండు న్నరేళ్లు పూర్తయినప్పటికీ ఈ ఓడరేవు నిర్మా ణానికి సంబంధించి ఒక్క అడుగూ ముం దుకు పడలేదు. ఈ నేపథ్యంలో అసలు ఈ ఓడరేవు వల్ల వాణిజ్యపరంగా ఎలాంటి ప్రయోజనం లేదని కేంద్ర ప్రభుత్వం ఏర్పా టు చేసిన కన్సల్టెన్సీ తేల్చి చెప్పింది. గతంలో కూడా ఇదే విషయం స్పష్టం చేసినప్పటికీ ప్రధాన మంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని ఓడరేవు పునర్‌వ్యవస్థీకరణకు సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందించాలని ఆదేశించింది.
ఇందు కోసం ఏర్పాటు చేసిన కన్సెల్టెన్సీ ఇటీవల నివేదిక సమర్పిం చింది. ఓడరేవును పునర్ వ్యవస్థీకరించినప్పటికీ వాణిజ్య పరంగా ప్రయోజనం ఉండదంది. నీతి ఆయోగ్.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసి నివేదికలో పేర్కొన్న అంశాలపై చర్చిం చింది. పోర్టు నిర్మాణం బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని, తాము ఆర్థిక భారాన్ని భరించలేమని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేయడంతో ఎలాంటి పురోగతి లేకుండానే ఆ సమావేశం ముగిసింది.