ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టు ఆగ్రహం
ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్రం ప్రభుత్వం తీసుకున్న రాజకీయ నిర్ణయాన్ని మీరెలా సవాల్ చేస్తారని హైకోర్టు ఎపీఎన్జీవోల సంఘాన్ని ప్రశ్నించింది. సమ్మె చేయాలని మీకు అంతగా ఆసక్తి ఉంటే ఉద్యోగాలకు రాజీనామా చేసి సమ్మెలో పాల్గొనాలని ఎపీఎన్జీవోలకు సూచించింది.
సమ్మెకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయడానికి తమకు కొంత గడువు కావాలని ఏపీఎన్జీవో సంఘం హైకోర్టును కోరింది. దాంతో ఆ కేసు తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
ఏపీఎన్జీవోలు చేపట్టిన సమ్మె అనైతికం అంటూ రవికుమార్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రవికుమార్ వేసిన పిటిషన్ బుధవారం హైకోర్టులో వాదనకు వచ్చింది. హైకోర్టులో జరిగిన వాదనకు ఎపీఎన్జీవోల తరుఫున సీమాంధ్ర సచివాలయం ఉద్యోగులు ఫోరం హజరైంది.