రస్తాకుంటుబాయి(కురుపాం)న్యూస్‌లైన్: వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు ప్రతి గిరిజన రైతు పాటిస్తే ఆర్థికంగా ఎంతో మేలు ఉంటుందని పార్వతీపురం ఐటీడీఏ పీఓ రజిత్‌కుమార్‌షైనీ అన్నారు. అలాగే అధిక దిగుబడులు వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా సాధ్యపడతాయన్నారు. రస్తాకుంటుబా యి కృషి విజ్ఞాన కేంద్రంలో కృషి విజ్ఞాన కేం ద్రం-వ్యవసాయ సాంకేతిక యాజమాన్యసంస్థ లు మంగళవారం సంయుక్తంగా నిర్వహించిన వ్యవసాయ సాంకేతిక వారోత్సవాలకు పీఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి వెలిగించి వ్యవసాయసాంకేతిక వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈసందర్బం గా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇటీవలే బెంగళూరులో జరిగిన 600 కేవీకేల జాతీయ సదస్సులో రస్తాకుంటుబాయి కేవీకే చర్చల్లో పాల్గొనడం సంతోషించదగ్గ విషయమని అభినందించారు.
గిరిజన రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి ఐటీడీఏ ద్వారా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి గిరిజన రైతు వ్యవసాయ సాంకేతిక వారోత్సవాలను సద్వినియోగం చేసుకుని శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలని సూచిం చారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించి న ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం సంచాలకుడు డాక్టర్ ఎ.శివశంకర్ మాట్లాడుతూ 1990లో సాగులో విత్తనాలను వెదజల్లే పద్ధతు ల్లో ఉండేవారని నేడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అవగాహన కల్పించుకుని వ్యవసాయంలో నూతన పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించేలా ఎదిగారన్నారు ప్రస్తుతం కూలీలు దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు కాబట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడు లు సాధించేందుకు సాంకేతిక పద్ధతులను విని యోగించుకోవాలన్నారు. అలాగే జిల్లాలో సవ ర భాషలో కూడా వివిధ పంటల కరపత్రాలను అందించడం దేశంలోనే ప్రప్రథమమన్నారు.
ఈ వ్యవసాయ సాంకేతిక వారోత్సవాల్లో చింతపల్లి ఎ.డి.ఆర్ డాక్టర్ ఎన్.వేణుగోపాల్, నైరాకళాశాల అధిపతి డాక్టర్ ఎరుకునాయుడు, ఆత్మ పథకం పీడీ రాజబాబు, అనకాపల్లి ఎ.డి.డిఆర్ జమున మాట్లాడారు, అనంతరం కోసివేసిన పంటపొలాల్లో జీరో టిల్లేజ్ పద్ధతులు ద్వారా మొక్క జొన్న పంటవేసే కరదీపికతోపాటు ఇతర వ్యవసాయ పద్ధతులు పాటించే కరపత్రాలను పీఓతోపాటు, శాస్త్రవేత్తలు విడుదల చేశారు. కార్యక్రమంలో కేవీకే ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ కెల్ల లక్ష్మణ్, కేవీకే సీనియర్ శాస్త్రవేత్తలు డి.చిన్నంనాయుడు, ఎ.ఉపేంద్ర, శ్రీనివాసరావు, భూసార కేంద్రం ఏడీఏలు నాగభూషణం,నాగాచారితోపాటు శాస్త్రవేత్తలు, అధిక సంఖ్యలో గిరిజన రైతులు పాల్గొన్నారు.
యాంత్రీకరణతోనే అధిక దిగుబడి
Published Wed, Dec 18 2013 4:22 AM | Last Updated on Fri, Aug 17 2018 2:08 PM
Advertisement