హిందూ-ముస్లింల ‘సమైక్య’ ప్రార్థన | hindhu-muslim samaikyandhra prayer | Sakshi
Sakshi News home page

హిందూ-ముస్లింల ‘సమైక్య’ ప్రార్థన

Published Sat, Aug 17 2013 2:56 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM

hindhu-muslim samaikyandhra prayer


 వాల్మీకిపురం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా వాల్మీకిపురంలో శుక్రవారం రాత్రి హిందూ-ముస్లిం  సోదరులు కలసికట్టుగా ప్రా ర్థనలు చేశారు. స్థానిక నమాజ్ కట్ట వీధిలోని మసీదులో నమాజ్ చేసి రాష్ట్రం సమైక్యంగా ఉండేలా చూడాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఢిల్లీ పె ద్దలు తీసుకుంటున్న మతిస్థిమితం లే ని నిర్ణయాలను, వారి ఆలోచన ధోరణి ని మార్చుకునేలా భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. ఈ ప్రార్థనా కార్యక్రమంలో తహశీల్దారు కిరణ్‌కుమార్, సర్పంచ్ రాజేంద్రాచారి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విభాకర్‌రెడ్డి, పంచాయితీ కార్యదర్శి రమణ, పెద్దసంఖ్యలో హిందూ,    ముస్లింలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement