thasildhar
-
ఆయనో తహశీల్దార్.. కానీ చిరంజీవి స్టెప్పులతో రఫ్ఫాడించాడు..
-
గుట్టకే ఎసరుకు యత్నం
సాక్షి, మెదక్: అదనపు కలెక్టర్ అవినీతి బాగోతంలో కొత్తకోణం వెలుగుచూసింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలో తన బినామీతో కలసి సుమారు 20 ఎకరాల్లో ఉన్న గుట్టకే ఎసరు పెట్టేందుకే యత్నించారు. ఈ విషయం తాజాగా శనివారం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. పాంబండ గ్రామ శివారులో సర్వే నంబర్ 142లోని ప్రభుత్వ భూమిలో ఇరవై ఎకరాల్లో గుట్ట విస్తరించి ఉంది. ఇందులో క్వారీ ఏర్పాటుకు రెండేళ్ల క్రితం అదనపు కలెక్టర్ నగేశ్ బినామీ కోల జీవన్ గౌడ్ శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే తహసీల్దార్ భానుప్రకాశ్ దీనికి అనుమతి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. గుట్టకు ఆనుకుని అటవీ ప్రాంతం, గ్రామం ఉండటంతో నిబంధనల ప్రకారం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అంతే కాదు.. ఫైలును వెనక్కి పంపించారు. పలు రకాలుగా ఒత్తిళ్లు ఎలాగైనా క్వారీకి అనుమతులు పొందాలని జీవన్‌గౌడ్ విశ్వ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. క్వారీ ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు లేనప్పటికీ.. ఎలాగైనా చేజిక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎత్తుగడలు వేశారు. అదనపు కలెక్టర్ నగేశ్‌ను రంగంలోకి దించడంతో పాటు పలువురు ప్రజాప్రతినిధులతో సిఫార్సుసు చేయించినట్లు తెలిసింది. క్వారీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని తహసీల్దార్‌పై పలు రకాలుగా ఒత్తిడి తెచ్చారు. అయినా ఆయన ససేమిరా అన్నారు. కాగా, ఎవరు చెప్పినా తహసీల్దార్ వినకపోవడంతో అదనపు కలెక్టర్ దీన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. క్వారీ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని నాలుగైదు నెలలుగా సదరు తహసీల్దార్‌పై ఒత్తిడి పెంచారు. అయినప్పటికీ ఆయన స్పందించలేదు. దీన్ని మనసులో పెట్టుకుని తహసీల్దారుపై ఏసీ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించే వారని.. ఎప్పుడూ ఏదో రకంగా ఇబ్బంది పెట్టేవారని కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఏసీబీ దాడులతో వెలుగులోకి.. నిజామాబాద్ జిల్లాలో ఆర్డీఓగా పనిచేసినప్పుడు నగేశ్‌కు నిర్మల్ జిల్లాకు చెందిన జీవన్‌గౌడ్ పరిచయమయ్యాడు. అప్పటి నుంచి భూ వ్యవహార లావాదేవీల్లో అదనపు కలెక్టర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు. జాయింట్ కలెక్టర్‌గా నగేశ్ మెదక్ జిల్లాకు వచ్చినప్పటికీ అతడికి జీవన్‌గౌడ్ బినామీగా వ్యవహరించడం.. వారిద్దరి మధ్య స్నేహం ఏ పాటిదో తెలుస్తోంది. అయితే రూ.112 ఎకరాల భూమికి ఎంఓసీ కోసం రూ.1.12 కోట్ల లంచం ఘటనలో అదనపు కలెక్టర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడం.. అతడి బినామీ జీవన్‌గౌడ్‌నూ అరెస్టు చేయడంతో జీవన్‌గౌడ్ పాంబండ కేంద్రంగా గుట్టకు ఎసరు పెట్టిన ప్రయత్నాలు వెలుగు చూశాయి. కాగా.. క్వారీ లీజుకు తీసుకోవాలని అదనపు కలెక్టర్ భావించారా.. జీవన్ గౌడ్ సొంతంగా తీసుకోవాలని అనుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఒత్తిడికి తలొగ్గలేదు: శివ్వంపేట తహసీల్దార్ మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో నెలకొన్న పలు భూ వివాదాలపై తనపై ఎంతో మంది ఒత్తిడి తీసుకొచ్చినా.. తలొగ్గ లేదని, అందుకే ఈ రోజు తలెత్తుకొని ఉన్నానని, లేకుంటే తాను కూడా జైలులో ఉండేవాడినని తహసీల్దార్ భానుప్రకాశ్ అన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ శివ్వంపేటలో నెలకొన్న భూ సమస్యల గురించి ప్రస్తావించిన విషయం గురించి తహసీల్దార్ భానుప్రకాశ్ వివరణ ఇచ్చారు. పాంబండ, పిల్లుట్ల గ్రామాలకు సంబంధించిన వివాదాస్పద భూముల విషయంపై చాలా మంది ఒత్తిడి తీసుకొచ్చారని, అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయిన జీవన్‌గౌడ్ సైతం ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. -
హయత్‌నగర్‌లో అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్ కార్యాలయం?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయాన్ని హయత్‌నగర్‌లో ఏర్పాటు చేసే అంశాన్ని జిల్లా యంత్రాంగం పరిశీలిస్తోంది. స్థానిక మండల పరిషత్ ప్రాంగణంలో తాత్కాలికంగా కొనసాగించాలని యోచిస్తోంది. ఇక్కడైతే అబ్దుల్లాపూర్‌మెట్ మండల ప్రజలకు అందుబాటులో ఉండటంతోపాటు విస్తృతంగా రవాణా సౌకర్యాలు ఉన్నాయని భావిస్తోంది. అబ్బుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయా రెడ్డి సజీవదహనంతో అక్కడి ఉద్యోగులు సదరు కార్యాలయంలో పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇన్చార్జి తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన సరూర్‌నగర్ తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి సైతం కార్యాలయానికి వెళ్లేందుకు సాహసించడం లేదు. విజయారెడ్డి హత్య కు గురైన భవనంలో తాము విధులు నిర్వహించబోమని ఉద్యోగులు తేల్చి చెప్పారు. దీంతో ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించిన యంత్రాంగం..హయత్‌నగర్‌లోని మండల పరిషత్ ప్రాంగణంలోని భవన సముదాయంలో ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుం దని యంత్రాంగం నిర్ణయానికి వచ్చింది. దీని పట్ల ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ హరీశ్, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని ఇన్చార్జి కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. -
పట్టా చేయకుంటే చంపేస్తా!
తిరుమలాయపాలెం: తనకున్న 12 గుంటల భూమిని ఎందుకు పట్టా చేయడం లేదని పెట్రోల్ బాటిల్‌తో వచ్చిన ఓ రైతు తహసీల్దార్‌ను నిలదీశాడు. పట్టా చేయకుంటే చంపుతానని బెదిరించడంతో కలకలం సృష్టించింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం తహసీల్దార్ కార్యాలయంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని బాలాజీనగర్ తండా పంచాయతీ పరిధిలోని రమణ తండాకు చెందిన చాందావత్ వాల్యా తనకున్న 12 గుంటల భూమిని పట్టా చేయడం లేదని పెట్రోల్ బాటిల్ సంచిలో పెట్టుకొని ఉదయం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. చాంబర్లో తహసీల్దార్ అనురాధబాయిని దుర్భాషలాడాడు. పట్టా చేయకపోతే చంపుతానని బెది రించాడు. దీంతో తహసీల్దార్.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాల్యాను పోలీసులు అదుపులోకి తీసుకుని.. పెట్రోల్ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. చాందావత్ వాల్యా భూమి పట్టా అయిందని, తను అమ్ముకున్న 12 గుంటల భూమిని కూడా పట్టా చేయాలని పట్టుబడుతున్నాడని తహసీల్దార్ వివరణ ఇచ్చారు. -
అందుకే అక్కడికి వెళ్లాడు: సురేశ్ భార్య
పెద్దఅంబర్‌పేట: తన భర్త సురేశ్ తహసీల్దార్‌ను హత్య చేయడానికి వెళ్లలేదని, ఆత్మహత్యాయత్నం చేసి భయపెట్టాలనుకున్నాడని.. ఈ విషయం ఆస్పత్రిలో తనతో చెప్పాడని సురేశ్ భార్య లత వెల్లడించింది. శుక్రవారం ఆమె గౌరెల్లిలో విలేకరులతో మాట్లాడింది. తహసీల్దార్‌కు లంచం ఇచ్చానని, మిగిలిన డబ్బులు ఇళ్లు అమ్మి ఇస్తానని ఒప్పుకున్నట్లు సురేశ్ తనతో చెప్పాడని వెల్లడించింది. తహసీల్దార్ మేడమ్ వినకపోవడంతోనే ఆమెను హత్య చేయాలని అనుకున్నట్లు చెప్పాడని తెలిపింది. తమ భూముల వివాదాలను అధికారులే తేల్చాలని లత వేడుకుంది. 1950 నుంచి తమ భూములను తామే సాగుచేసుకుం టున్నామని, అప్పటి నుంచి లేని సమస్యలు ఇప్పుడెందుకు వచ్చాయని సురేశ్ తండ్రి కృష్ణ ప్రశ్నించారు. సమస్యలన్నీ అధికారులే సృష్టించారన్నారు. తమ తండ్రి కూర వెంకయ్య పేరుతో అధికారులు గతంలోనే పట్టా పాసుపుస్తకాలు ఇచ్చారన్నారు. అయితే, 2016లో వాటిని రద్దు చేశారని తెలిపారు. కాగా అబ్దుల్లార్‌పూర్‌మెట్ తహశీల్దార్ చెరుకూరి విజయారెడ్డిని సురేశ్ అనే రైతు సోమవారం సజీవ దహనం చేసిన విషయం తెలిసిందే. తన భూమికి సంబంధించి పట్టా ఇవ్వలేదనే కోపంతోనే ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించానని అతడు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సురేశ్ కూడా ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం విదితమే. -
తహసీల్దార్ హత్య కేసు నిందితుడు మృతి
సాక్షి, హైదరాబాద్/అఫ్జల్‌గంజ్: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకేసు నిందితుడు కూర సురేశ్ గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఈ నెల 4న విధినిర్వహణలో ఉన్న తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్‌పోసి నిప్పంటించిన ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, ఆమెను కాపాడే ప్రయత్నంలో నిప్పంటుకుని ఆస్పత్రిలో చేరిన డ్రైవర్ గుర్నాధం రెండ్రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. ఇటు నిందితుడు సురేశ్ కూడా ఘటనలో గాయపడిన విషయం విదితమే. గాయాలతోనే సురేశ్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవడంతో పోలీసులు ఆరోజే చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సురేశ్ ఛాతీ, ముఖం, చేతులు.. ఇలా 65 శాతం కాలిన గాయాలయ్యాయి. మంటల్లో చర్మం కాలిపోవడంతో పాటు మంటల వేడికి రక్తనాళాలు దెబ్బతిన్నాయి. శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది. దీంతో బుధవారం సాయంత్రం సురేశ్‌ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందజేశారు. అయితే గురువారం ఉదయమే ఆయన చనిపోయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే ఉస్మానియా వైద్యులు సురేశ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించారు. తీరా గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు సురేశ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు. భర్త సురేశ్ మరణవార్తతో భార్య లత అస్వస్థతకు గురైంది. ఆమెను అత్యవసర విభాగానికి తరలించి ప్రాథమిక చికిత్సలు అందజేశారు. పోలీసుల భద్రత మధ్య సురేశ్ మృతదేహాన్ని సొంతూరు గౌరెల్లికి తరలించారు. అక్కడ రాత్రి భారీ బందోబస్తు మధ్య సురేశ్ అంత్యక్రియలు జరిగాయి. నా భర్త అమాయకుడు: లత నా భర్త సురేశ్ అమాయకుడు. ఎవరితో గొడవలకు వెళ్లేవాడు కాదు. ఆయనను ఎవరో పావుగా వాడుకున్నారు. ఎమ్మార్వో హత్య కేసులో వెనుకున్న వారెవరో పోలీసులే బయటకు తీయాలని వేడుకుంటున్నా. -
రూ.9 లక్షల పట్టివేత
పాచిపెంట, న్యూస్‌లైన్ : ఎన్నికల నేపథ్యంలో పి.కోనవలస ఆంధ్ర-ఒడిశా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద బుధవారం ఉదయం తనిఖీ చేస్తున్న పోలీసులకు.. భారీ మొత్తంలో నగదు లభ్యమైంది. ఒడిశా నుంచి వస్తున్న వాహనంలో రూ.9 లక్షలకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న సాలూరు సీఐ జి.దేముళ్లు పాచిపెంట పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. డబ్బు తరలిస్తున్న వ్యక్తుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ పాసింజర్ వాహనాన్ని తనిఖీ చేస్తుండగా నలుపు రంగు బ్యాగులో రూ.9 లక్షలకుపైగా నగదు లభ్యమైందని చెప్పారు. ఒడిశాలోని సుంకి గ్రామానికి చెందిన అభిషేక్ కుమార్, నిర్మల్ యాదవ్ ఈ మొత్తాన్ని తరలిస్తున్నారని తెలిపారు. వారిని ప్రశ్నించగా.. మద్యం బేవరేజెస్ కంపెనీకి తీసుకెళ్తున్నట్లు చెప్పారని తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలను చూపలేకపోయారని చెప్పారు. సరిపడా ఆధారాలు చూపిస్తే.. ఎన్నికల తర్వాత ఆ మొత్తాన్ని వారికి అప్పగిస్తామని చెప్పారు. మూడురోజులుగా బ్యాంకు సెలవు కావడంతో రాయగడలో గల బ్రాందీ విక్రయ కేంద్రానికి నేరుగా నగదు తీసుకెళ్లాల్సి వచ్చిందని బాధితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. స్వాధీనం చేసుకున్న నగదును స్థానిక తహశీల్దార్ ఎల్లారావుకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాచిపెంట ఎస్సై రవికుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
శాంతమ్మ సేవలు భేష్
చెన్నూరు : చెన్నూరు మండలంలో తహశీల్దార్‌గా శాంతమ్మ చేసిన సేవలు భేష్ అని నాయకులు, అధికారులు, డీలర్లు, సిబ్బంది కొనియాడారు. ఎన్నికల బదిల్లో భాగంగా కర్నూలుకు వెళుతున్న ఆమెను సర్వేయర్ నాగభూషణం అధ్యక్షతన బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ వెంటకసుబ్బమ్మ మాట్లాడుతూ తహశీల్దార్ శాంతమ్మ అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన సేవలు సకాలంలో అందించారన్నారు. విద్యార్థులకు ధ్రువీకరణ ప త్రాలు కోరిన సమయంలో ఇచ్చారన్నారు. అనంతరం శాం తమ్మ మాట్లాడుతూ మండలంలోని ప్రజలు, అధికారుల, నాయకుల, సిబ్బంది ఆదారాభిమానాలను ఎప్పటికి మరువలేనన్నారు. సూపరింటెండెంట్ రవికుమార్‌రెడ్డి, ఏఏస్‌ఓ కృష్ణవేణి, డీటీ వెంకటసుబ్బయ్య, ఆర్ఐ శివప్రసాద్, మాజీ వీఆర్ఓ నాగసుబ్బారెడ్డి, వీఆర్ఓలు భాస్కర్‌రెడ్డి, నరసారెడ్డి, నాగమునెమ్మ, డీలర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
తహశీల్ ఆఫీస్ ఎదుట అంగన్వాడీల ధర్నా
తహశీల్ ఆఫీస్ ఎదుట అంగన్వాడీల ధర్నా బోధన్ రూరల్, : పట్టణంలోని తహశీల్ కార్యాలయం ఎదుట మంగళవారం అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేశారు. తహశీల్ కార్యాలయంలోకి సిబ్బంది వీధుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. తహశీల్దార్ సీహెచ్. శ్రీకాంత్‌ను కార్యాలయంలోకి రాకుండా కార్యకర్తలు అడ్డుకుని నినాదాలు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యాలయంలో కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు శంకర్‌గౌడ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. నేడు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చాలిచాలని జీతాలతో కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల నుంచి వారు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఇకనైనా స్పందించి అంగన్వాడీల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగ భద్రత కల్పించాల్సిందే రెంజల్ : తమ సమస్యల పరిష్కారానికి అంగన్వాడీలు ఆందోళన బాట పట్టారు. పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వారు మంగళవారం తహశీల్ కార్యాలయాన్ని ముట్టడించారు. పలు గ్రామాల కార్యకర్తలు ముందుగా తహశీల్ వద్దకు చేరుకున్నారు. ర్యాలీగా వెళ్లి బైఠాయించారు. దీనికి సీఐటీయూ బోధన్ డివిజన్ నాయకుడు ఏశాల గంగాధర్ ఆధ్వర్యంలో ఉదయం కొద్ది సేపు కార్యాలయంలోనికి అధికారులు వెళ్లకుండా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో సిబ్బంది బయటే ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండల అంగన్వాడీల సంఘం అధ్యక్షురాలు సురేఖ, నాయకులు పద్మావతి, భాగ్యలక్ష్మి, బాలహంస, రాధిక పాల్గొన్నారు. -
విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : పౌర సేవలందించడంలో తహసీల్దార్లు అలసత్వం వహిస్తున్నారని కలెక్టర్ బి.శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ల పనితీరుపై కలెక్టరేట్‌కు పలు ఫిర్యాదులు వస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. మీ సేవ కేంద్రాల ద్వారా వచ్చే ఆర్జీలను త్వరితంగా పరిశీలించి సర్టిఫికెట్లు జారీ చేయాలని, అలసత్వం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో మీసేవ, భూకేటాయింపులు, పరిరక్షణ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్లతో కలిసి రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాలానగర్, కుత్బుల్లాపూర్, కీసర మండలాల్లో సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ వెనుకబడి ఉందన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు 50యూనిట్ల లోపు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తోందని, ఇందుకోసం వారికి కులధ్రువీకరణ పత్రం అవసరమన్నారు. ఈ సర్టిఫికెట్లను వెంటనే జారీ చేసేందుకు తహసీల్దార్లు శ్రద్ధ చూపాల న్నారు. జిల్లాలో 78 ఎకరాల ప్రభుత్వ భూమికి ప్రహరీలు నిర్మిస్తున్నామని, సంబంధిత జాయింట్ కలెక్టర్, భూపరిరక్షణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లదే ఈ బాధ్యత అని అన్నారు. మార్చి నెలాఖరుకల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఏడో విడత భూపంపిణీకి సంబంధించి క్షేత్ర పరిశీలన పూర్తిచేయని బషీరాబాద్ తహసీల్దార్‌పై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఓటర్ల నమోదుకు సంబంధించి అర్హులను గుర్తించి వివరాలు నమోదు చేయాలని, పొరపాట్లు జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్లు చంపాలాల్, ఎంవీరెడ్డి, సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి, డీఆర్వో వెంకటేశ్వర్లు తదిత రులు పాల్గొన్నారు. -
హిందూ-ముస్లింల ‘సమైక్య’ ప్రార్థన
వాల్మీకిపురం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా వాల్మీకిపురంలో శుక్రవారం రాత్రి హిందూ-ముస్లిం సోదరులు కలసికట్టుగా ప్రా ర్థనలు చేశారు. స్థానిక నమాజ్ కట్ట వీధిలోని మసీదులో నమాజ్ చేసి రాష్ట్రం సమైక్యంగా ఉండేలా చూడాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఢిల్లీ పె ద్దలు తీసుకుంటున్న మతిస్థిమితం లే ని నిర్ణయాలను, వారి ఆలోచన ధోరణి ని మార్చుకునేలా భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. ఈ ప్రార్థనా కార్యక్రమంలో తహశీల్దారు కిరణ్‌కుమార్, సర్పంచ్ రాజేంద్రాచారి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విభాకర్‌రెడ్డి, పంచాయితీ కార్యదర్శి రమణ, పెద్దసంఖ్యలో హిందూ, ముస్లింలు పాల్గొన్నారు.