
రైతు చాందావత్ వాల్యా..
తిరుమలాయపాలెం: తనకున్న 12 గుంటల భూమిని ఎందుకు పట్టా చేయడం లేదని పెట్రోల్ బాటిల్‌తో వచ్చిన ఓ రైతు తహసీల్దార్‌ను నిలదీశాడు. పట్టా చేయకుంటే చంపుతానని బెదిరించడంతో కలకలం సృష్టించింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం తహసీల్దార్ కార్యాలయంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని బాలాజీనగర్ తండా పంచాయతీ పరిధిలోని రమణ తండాకు చెందిన చాందావత్ వాల్యా తనకున్న 12 గుంటల భూమిని పట్టా చేయడం లేదని పెట్రోల్ బాటిల్ సంచిలో పెట్టుకొని ఉదయం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. చాంబర్‌లో తహసీల్దార్ అనురాధబాయిని దుర్భాషలాడాడు. పట్టా చేయకపోతే చంపుతానని బెది రించాడు. దీంతో తహసీల్దార్.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాల్యాను పోలీసులు అదుపులోకి తీసుకుని.. పెట్రోల్ బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. చాందావత్ వాల్యా భూమి పట్టా అయిందని, తను అమ్ముకున్న 12 గుంటల భూమిని కూడా పట్టా చేయాలని పట్టుబడుతున్నాడని తహసీల్దార్ వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment