శాంతమ్మ సేవలు భేష్ | welldone to santhamma | Sakshi
Sakshi News home page

శాంతమ్మ సేవలు భేష్

Published Thu, Feb 20 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM

శాంతమ్మ సేవలు భేష్

శాంతమ్మ సేవలు భేష్


 
 చెన్నూరు : చెన్నూరు మండలంలో తహశీల్దార్‌గా శాంతమ్మ చేసిన సేవలు భేష్ అని నాయకులు, అధికారులు, డీలర్లు, సిబ్బంది కొనియాడారు.
  ఎన్నికల బదిల్లో భాగంగా కర్నూలుకు వెళుతున్న ఆమెను సర్వేయర్ నాగభూషణం అధ్యక్షతన బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ వెంటకసుబ్బమ్మ మాట్లాడుతూ తహశీల్దార్  శాంతమ్మ అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన సేవలు సకాలంలో అందించారన్నారు. విద్యార్థులకు ధ్రువీకరణ ప త్రాలు కోరిన సమయంలో ఇచ్చారన్నారు.
  అనంతరం శాం తమ్మ మాట్లాడుతూ మండలంలోని ప్రజలు, అధికారుల, నాయకుల, సిబ్బంది ఆదారాభిమానాలను ఎప్పటికి మరువలేనన్నారు. సూపరింటెండెంట్ రవికుమార్‌రెడ్డి, ఏఏస్‌ఓ కృష్ణవేణి, డీటీ వెంకటసుబ్బయ్య, ఆర్‌ఐ శివప్రసాద్, మాజీ వీఆర్‌ఓ నాగసుబ్బారెడ్డి, వీఆర్‌ఓలు భాస్కర్‌రెడ్డి, నరసారెడ్డి, నాగమునెమ్మ, డీలర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement