శ్రీకాకుళం జిల్లా కొత్తూరులోని ఎస్సీ కాలనీలో భారీ వర్షాలకు ఇళ్ల పైకప్పులు కూలిపోతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
కొత్తూరు: శ్రీకాకుళం జిల్లా కొత్తూరులోని ఎస్సీ కాలనీలో భారీ వర్షాలకు ఇళ్ల పైకప్పులు కూలిపోతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజులుగా ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 25 ఏళ్ల క్రితం ఇక్కడ అధునాత విధానంలో నిర్మించిన ఇళ్లు దెబ్బతింటున్నాయి. ఎం.జనార్దన్‌రావు, జవరాజు, బుచ్చెమ్మ తదితరుల ఇళ్ల పైకప్పులు కూలిపోవడందో బుధవారం వారందరూ వీధుల్లోకి వచ్చారు.
అప్పట్లో అగ్ని పమాదం సంభవించి కాలనీలోని ఇళ్లు దగ్ధం కావడంతో మోడల్ విధానంలో సిమెంట్ ప్లేట్లతో ఇళ్లను నిర్మించారు. అయితే, ఇవి దెబ్బతింటున్నాయని అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని స్థానికులు వాపోతున్నారు.