
హాస్టల్స్‌ను ఎత్తివేయడం అన్యాయం
పాలకొల్లు సెంట్రల్ : విద్యార్థులు లేరని కుంటిసాకులు చెబుతూ జిల్లాలోని ఎస్సీ, బీసీ హాస్టళ్లను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు చెల్లెం ఆనందప్రకాష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖండవల్లి వాసు నివాసంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.
జిల్లాలో సుమారు 132 హాస్టళ్లు ఉన్నాయని, వాటిలో దాదాపు 30 హాస్టళ్లను ఎత్తేయాలని అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించడాన్ని ఖండిస్తున్నామన్నారు. హాస్టళ్లు ప్రారంభించి రెండు నెలలు కావస్తున్నా విద్యార్థులకు దుస్తులు, దుప్పట్లు ఇప్పటివరకూ ఇవ్వలేదన్నారు. కాస్మోస్టిక్స్, మెస్ చార్జీలకు ఇంతవరకూ నిధులు మంజూరు చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. హాస్టళ్ల తొలగింపు నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.