ఎంత మోసం!
‘ఇసుక దోపిడీని నివారించి సామాన్యులకు అందుబాటు ధరలో విక్రరుుస్తాం. ఇసుక రీచులను డ్వాక్రా సంఘాలకు అప్పగించి వారు అనతి కాలంలో లక్షాధికారులయ్యేలా ప్రోత్సహిస్తాం..’ అని కొద్ది నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలకు అర్థం మారిపోరుుంది. ఇసుక మాఫియూ వేళ్లూనుకోవడంతో సామాన్యుడికి అందని ద్రాక్షలా మారింది. టీడీపీ నేతల చేతుల్లో డ్వాక్రా సంఘాలు కీలు బొమ్మలయ్యూరుు. వారి కనుసన్నల్లో ఉల్లికల్లు నుంచి తరలిపోతున్న ఇసుక కొండంతైతే రికార్డుల్లోకి ఎక్కుతున్నది మాత్రం అంతంతే.
ఉల్లికల్లు (శింగనమల) : ఇసుక తవ్వకాలు ఇష్టానుసారంగా సాగుతున్నారుు. పేరుకు డ్వాక్రా సంఘాలకు ఇసుక రీచును అప్పగించినా, వ్యవహారమంతా టీడీపీ నేతల కనుసన్నల్లోనే సాగుతోంది. ఉల్లికల్లు వద్ద డిసెంబరు 18వ తేది నుంచి ఇసుక విక్రయాలు చేపట్టారు. తొలుత గ్రామం బయట ఏర్పాటు చేసిన డంప్‌కు ఇసుక తరలించి, అక్కడి నుంచి ఇసుకను విక్రయించారు. పది రోజుల తర్వాత నిబంధనలను గాలికొదిలేసి పెన్నా నదిలోకి నేరుగా ట్రాక్టర్లను తీసుకెళ్లి జేసీబీలతో నింపుకు పోవడం మొదలు పెట్టారు.
భూగర్భ జల శాఖ అధికారులు గుర్తించిన స్థలంలో కాకుండా, ఎవరికి ఇష్టం వచ్చిన చోట వారు జోరుగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రతి రోజు 400 ట్రాక్టర్ల దాకా ఇసుకను తరలిస్తున్నారు. ఉల్లికల్లులో ఇసుక రీచును ఏర్పాటు చేసిన తరువాత ఇసుక మాఫియూ పని సులువైంది. ఇసుక అవసరమైన వారికి కాకుండా, బినామీ పేర్ల మీద ‘మీ సేవ’లో బిల్లు తీసుకుంటున్నారు. మూడు క్యూబిక్ మీటర్లకు రూ.1900 చెల్లించి బిల్లు తెచ్చుకుని, నాలుగు క్యూబిక్ మీటర్లు తరలిస్తున్నారు. ఇది బహిరంగ దందా.
ఇక రాత్రిళ్లు అనధికారికంగా తరలిపోతున్నదెంతో లెక్కేలేదు. నార్పల, నంద్యాల, అనంతపురం, గుంతకల్లులో డంప్‌లకు తరలించి.. అక్కడి నుంచి కావలసిన చోటుకు చేరుస్తున్నారు. ఇప్పటిదాకా 9,600 క్యూబిక్ మీటర్ల ఇసుక తరలించినట్లు రికార్డులు చెబుతున్నారుు. వాస్తవంగా ఇంతకు మూడింతలు తరలి వెళ్లిందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఉల్లికల్లులోని గ్రామ ఐక్య సంఘం ఏర్పాటు చేసుకున్న ‘సారుుబాబా శాండ్ మైనింగ్ ఉమెన్స్ మ్యూచువల్లీ ఎరుుడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్’కు ఇప్పటిదాకా ఒక్క రూపారుు కూడా జమ కాలేదు.
ఒకే బిల్లుపై రెండు సార్లు
‘మీసేవ’లో చెల్లించిన బిల్లును ఇసుక రీచులో ఐకేపీ అధికారులకు ఇచ్చిన తరువాత, పర్మిట్ బిల్లు తీసుకుంటున్నారు. ఇక్కడే ట్రాక్టర్ యజమానులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. సీసీల చేతులు తడిపి పర్మిట్‌పై సమయం వేరుుంచుకోవడం లేదు. మధ్యలో వాగులు, వంకల్లో ఇసుకను తోడేసుకుంటూ ఇదే బిల్లును రెండు మూడు ట్రిప్పులకు వాడుకుంటున్నారు. మరి కొందరు ‘మీసేవ’లో ఇచ్చిన బిల్లును వారి వద్దే ఉంచుకుని కలర్ జిరాక్స్ తీరుుంచి ఇస్తున్నట్లు తెలిసింది.
ఈ తతంగం అందరికీ తెలిసినా ఎవరూ నోరు మెదపడం లేదు. ఇసుక రీచు వద్ద ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఇసుకను విక్రరుుంచాలి. ఈ నిబంధనను గాలికి వదిలి రేరుుంబవళ్లు విక్రరుుస్తున్నారు. ఇసుక రీచు వద్ద ఇద్దరు సీసీ (కమ్యూనిటీ కో ఆర్డినేటర్)లను నియమించారు. వీరు పెద్ద సంఖ్యలో వస్తున్న ట్రాక్టర్లును చూసుకోలేకపోతున్నారు. ఇసుకాసురులకు ఇది మరో వరంగా మారింది. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం మీటరు లోతు మాత్రమే ఇసుకను తీయాలి. వాస్తవంగా 15 అడుగుల లోతు వరకు ఇసుకను తీస్తున్నారు.
ట్రాక్టర్లతో ప్రజలకు ఇక్కట్లు
ఉల్లికల్లు ఇసుక రీచులోకి వచ్చే ట్రాక్టర్లు, టిప్పర్లతో ఉల్లికల్లు, ఉల్లికంటిపల్లి, కొరివిపల్లి, జూలకాల్వ, అలంకరాయునిపేట, నాయనపల్లి క్రాస్, సలకంచెర్వు, రాచేపల్లి, నిదనవాడ, తరిమెల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్టర్లు అతి వేగంగా వస్తుండటం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నారుు. ట్రాక్టర్ల శబ్ధాలకు రాత్రిళ్లు నిద్ర కరువైందని ఉల్లికల్లు, కొరివిపల్లి, సలకంచెర్వు, జూలకాల్వ గ్రామల ప్రజలు వాపోతున్నారు.