నత్తనడక | Hudood Storm devastation no Transport Facility works Still slow | Sakshi
Sakshi News home page

నత్తనడక

Published Fri, Oct 17 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM

నత్తనడక

నత్తనడక

 తుపాను బీభత్సం సృష్టించి ఐదు రోజులు అయింది. జిల్లావాసులను ఇంకా ఆ కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రకృతి చేసింది కొంతైతే...పాలనా యంత్రాంగం నిర్లక్ష్యం మరీ ఎక్కువగా ప్రజలను బాధిస్తోంది. ఆకలి మంటలతో అలమటిస్తున్న వారు కొందరైతే... గుక్కెడు నీటి కోసం రాత్రీ పగలు తేడాలేకుండా బోర్ల వద్ద పడిగాపులు కాస్తున్నవారు మరికొందరు. రోడ్డుకు అడ్డం గా పడిన చెట్లను ఇంకా తొలగించకపోవడంతో రవాణా సౌకర్యం లేక అనారోగ్యం ఉన్నా ఇంట్లో మగ్గుతున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే వీరి ఆక్రందనలు అధికారుల చెవులకు చేరడం లేదు. అట్టడుగు వర్గాల ప్రజలను పట్టించుకునే నాథుడే కరువ య్యాడు. మంత్రుల వద్ద మార్కులు కొట్టేయడానికో... వారి ఆగ్రహానికి గురికాకుండా తప్పించుకోడానికో అన్నట్టుగా మాత్రమే పనులు సాగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీరు లేక, బయటకు వెళ్లే దారి లేక, ఉపాధి లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న బడుగులకు ఆశించిన స్థాయిలో సాయం అందడం లేదు. పునరుద్ధరణ
 పనులు కూడా అదే బాటలో ఉండడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం : తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. తుపాను  తీరం దాటి ఐదు రోజులు కావస్తున్నా...ఎక్కడికక్కడ పడిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్ల శిథిలాలతో వాతావరణం ఇంకా భీతావహంగా కనిపిస్తోంది. జిల్లా కేంద్రమైన విజయనగరంలోనే ఆశించినంతంగా పునరుద్ధరణ పనులు సాగడం లేదు. ఇక మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటోఅర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే పూసపాటిరేగ, భోగాపురం, నెల్లిమర్ల, డెంకాడ, గంట్యాడ, జామి, ఎస్.కోట, కొత్తవలస మండలాలు మరో వారం రోజులైనా తేరుకునే పరి స్థితి లేదు. జిల్లా యంత్రాంగమంతా ఉన్న విజయనగరం పట్టణంలోనే ఇప్పటికీ ఎక్కడికక్కడ నేల కూ లిన చెట్లు దర్శనమిస్తున్నాయి. యుద్ధ ప్రాతిపదికన వాటిని తొలగించవలసి ఉండగా పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. మున్సిపాలిటీ పరిధిలో ఒక జేసీబీ మూడు రోజులుగా ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ ఏరియా లో మూలన పడి ఉన్నా.. దాని జోలికెళ్లలేదు. ఇంత విపత్తు సంభవించిన సమయంలో కూడా ఉన్న జేసీబీని కూడా వినియోగించ లేదంటే పునరుద్ధరణ పనులపై ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
 
 పేరుకుపోయిన చెత్త, చెట్ల ఆకులను తొల గిస్తే పునరుద్ధరణ అయిపోయిందనే ధోరణిలో ఉన్నా రు. అధికారులు వచ్చేంత వరకు వేచి చూస్తే తమకు ఇక్కట్లు తప్పవని స్థానికులే సొంత ఖర్చులతో తొల గించుకునేందుకు సిద్ధమవుతున్నారు. పట్టణంలో చాలాచోట్ల స్థానికులే చెట్లను తొలగించారు. ఇలాంటి విమర్శలు వెల్లువెత్తుతున్న దృష్ట్యా గురువారం మా త్రం అధికారులు కాస్త హడావుడి చేశారు. కట్టర్లతో చెట్లు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక పారిశుద్ధ్యం నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది. వర్షాలు పడిన తరువాత వ్యాధులు ప్రబలుతాయని తెలిసినా.. వాటి నివారణ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికీ చాలా వీధుల్లో చెత్త పేరుకుపోయి అధ్వానంగా ఉంది. దీంతో రోగాలు ప్రబలుతాయన్న భయాందోళన నెలకొంది.  శివారు కాలనీల గురించి అధికారులు అసలు పట్టించుకోవ డం లేదు. ఇక, జిల్లాలో మిగతా ప్రభావిత ప్రాంతాల విషయానికొస్తే ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటించే గ్రామాల్లోనే పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. మిగతా చోట్ల చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.
 
 వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే రహదారుల్లో అడ్డంగా పడిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్నారు. వాహనాల రద్దీ తక్కువ ప్రాం తాల వైపు కన్నెత్తి చూడటం లేదు. పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ, గంట్యాడ, నెల్లిమర్ల, జామి, ఎస్‌కోట తదితర మండలాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. గ్రామాల్లోనైతే విద్యుత్ స్తంబాలను ఎక్కడా తొలగించలేదు. దీంతో విజయనగరం తప్ప మిగతా మండలాల్లోని ప్రభావిత గ్రామాలకు విద్యుత్ సరఫరా పది రోజులకైనా జరుగుతుందా అనే అనుమానం తలెత్తుతోంది. మంచినీటి ఇక్కట్లైతే చెప్పనక్కర్లేదు. జిల్లా కేంద్రంలోనే తాగునీరును సరఫరా చేయడం లేదు. దీంతో చాలామంది చేతిపంపులను ఆశ్రయిస్తున్నారు. పగలురేయి లేకుండా బోరుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బిందె నీళ్లు దొరికితే చాల న్నట్టుగా చాలా ప్రాంతాల ప్రజలు నీటి కోసం వెంపర్లాడుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు తీసుకొచ్చే వాటర్ ట్యాంకులపై ఎగబడుతున్నారు. జిల్లాలోని మిగతా చోట్లైతే తాగునీటి ఇబ్బందులు వర్ణా తీతం. మంచినీటి పథకాలు పని చేయకపోవడం, ట్యాంకర్ల ద్వారా సరఫరా లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. స్నానాలు చేయడం మానేసే పరిస్థితి నెలకొంది.  
 
 రహదారులు తెగిపడటం, కల్వర్టులు కొట్టుకుపోవడంతో చాలా గ్రామాలు దిగ్బంధంలో ఉన్నాయి. అధికారులు ఎంతసేపూ జిల్లా కేంద్రంపైనే దృష్టి పెడుతున్నారే తప్ప గ్రామీణ ప్రాంతాల వైపు చూడ డం లేదు. నెల్లిమర్ల, గంట్యాడ, జామి, భోగాపురం మండలాల్లో ఇప్పటికీ పలు గ్రామాలకు రాకపోకలు జరగడం లేదు. ఫోన్‌లు పనిచేయకపోవడంతో తమ ఇబ్బందులను ఇతరులకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సహాయక చర్యలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. తుపాను ప్రకటన నేపథ్యంలో డీలర్ల  వద్ద ముందస్తుగానే నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలి. కానీ ఆ దిశగా ఏర్పాట్లు  చేయలేదు. దీంతో దాదాపు గ్రామీణ ప్రాంతంలో నిత్యావసర సరుకుల కోసం నానా అగచాట్లు పడుతున్నారు. ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. ఐఏఎస్‌లు, ప్రత్యేక అధికారుల హడావుడి తప్ప జిల్లాలో ఇంకేమీ కన్పించడం లేదు. యుద్ధ ప్రాతిపదిక చర్యలనేవి కానరావడం లేదు. హైరానా తప్ప మరేది సహాయక చర్యలు వేగవంతం కావడంలేదు. ఒక్కొక్క అధికారి ఒక్కొక్క మండలం చొప్పున దత్తత తీసుకుని పనిచేసినా ఈపాటికి  పునరుద్ధరణ,సహాయ కార్యక్రమాలు  జరిగిపోయేవి. విశేషమేమిటంటే ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఎన్యుమరేషన్ బృందాలు చురుగ్గా నష్టాల అంచనా వేస్తున్నాయి. కానీ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టాల్సిన జిల్లా అధికారులు, సిబ్బందిలో ఆ చొరవ కన్పించడం లేదు.
 
 వెలుగు చూడని నష్టమెంతో...
 అధికారులకు ప్రాథమిక అంచనాకు రాని నష్టాలు ఎన్నో ఉన్నాయి...వ్యవసాయం, ఇళ్లు , రోడ్లు, విద్యుత్ స్తంభాలు, చెట్లు, చెరువు లకే నష్టం జరిగిందనుకుంటున్న అధికారులకు లోతుగా పరిశీలించే కొలదీ అనేక ఆసక్తి కరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. హుదూద్ తుపాను ప్రభావం 11 మండలాలపైనే త్రీవంగా ఉందని, 385 గ్రామాల్లోనే తీవ్రనష్టం సంభవించిందని అధికారులు ప్రాథమిక లెక్కలు వేస్తున్నా క్షేత్రస్థాయికి వెళ్లే సరికి ఆ గ్రామాల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. వ్యక్తిగత నష్టం ఎక్కువగా ఉం ది. వాహనాలు, షాపులు నష్టపోయిన వారెంతో మంది ఉన్నారు. వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు, షోరూమ్‌లు చాలా వరకు ధ్వంసమయ్యాయి. వాటిపై ఆధారపడ్డ ఉద్యోగ, కార్మికులు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇవన్నీ ఎన్యుమరేషన్ అధికారుల దృష్టికొస్తున్నాయి. ఈ లెక్కలు చూసి సదరు బృందాలు  నష్టం  వేయి కోట్లు కాదు కదా రెండు వేల కోట్లు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.  కాకపోతే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవన్నీ రికార్డు చేయలేమని మనసులో మాటను   చెబుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement