చిత్తూరు జిల్లాలో భారీగా పట్టుబడుతున్న నగదు, మద్యం!
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో భారీగా మొత్తంలో నగదు, మద్యం పట్టుబడుతున్నాయి. ఓటర్లను మభ్యపెట్టేందుకు పత్తివేడు మండలం టీవీపురంలో టీడీపీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. టీవీ పురంలో ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తుండగా పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 9 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకుని, ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.
ఇంకా పలమనేరు మండలం సముద్రపల్లిలో టీడీపీ నేతలకు చెందిన 90 కేసుల మద్యం స్వాధీనం చేసుకున్నారు. అలాగే నగరి నియోజకవర్గంలో ఓటర్లకు టీడీపీ ప్రలోభాలు గురిచేస్తూ వడమాలపేట వద్ద 1.80 లక్షల రూపాయలతో టీడీపీ నేత అజారుద్దీన్ పట్టుబడ్డారు.
పాకాలలో ఓటర్లను మభ్య పెడుతున్న టీడీపీ నేత మునీశ్వర్‌రెడ్డి నుంచి 3 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకుని, వాహనం సీజ్ చేశారు.