ప్రశాంతంగా రీపోలింగ్ | huge security for re polling | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా రీపోలింగ్

Published Wed, Apr 2 2014 3:09 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

ప్రశాంతంగా రీపోలింగ్ - Sakshi

ప్రశాంతంగా రీపోలింగ్

మదనపల్లె, న్యూస్‌లైన్: మదనపల్లె మున్సిపాలిటీలోని 14వ వార్డులో మంగళవారం జరిగిన రీపోలిం గ్ ప్రశాంతంగా ముగిసింది. తొలుత మందకొడిగా సాగినా 9 గంటల నుంచి పుంజుకొంది. మొత్తం 888 ఓట్లు ఉండగా 581 ఓట్లు పోలయ్యాయి. 65.42 శాతంగా నమోదైంది. అయితే ఆదివారం జరిగిన పోలింగ్‌లో 582 ఓట్లు పోలవ్వగా ఓటు వేసి న వెంటనే యశోద అనే వృద్ధురాలు మృతి చెందా రు.
 
మంగళవారం పోలైన ఓట్లను పరిశీలిస్తే ఆమె ఓటే తగ్గిందని అధికారుల అంచనా. పోలింగ్‌కు రీపోలింగ్‌కు ఒక్క ఓటు మాత్రమే తేడా రావడం గమనార్హం. మొత్తానికి రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కమిషనర్ దేవ్‌సింగ్ తెలిపారు. కౌం టింగ్ ఈనెల 2న జరగాల్సి ఉండగా హైకోర్టు ఆదేశాల మేరకు 9వ తేదీ జరుగుతుందన్నారు. కౌంటింగ్‌కు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
 
భారీ బందోబస్తు
రీపోలింగ్‌కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్‌కు అమలు చేశారు. ఒక ట్రైనీ ఎస్పీ, ఒక డీ ఎస్పీ, ఆరుగురు సీఐలు 10 మంది ఎస్‌ఐలు, ఐదుగురు ఏఎస్‌ఐలతో పాటు దాదాపు 60 మంది సివిల్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. డీఎస్పీ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పట్టణ సీఐలు శివన్న, గం గయ్య పర్యవేక్షణలో బందోబస్తును ఏర్పాటు చేశా రు. ఓటర్లను తనిఖీ చేసి కేంద్రంలోనికి అనుమతిం చారు. సెల్‌ఫోన్లను అనుమతించలేదు.
 
రీపోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సబ్‌కలెక్టర్

మదనపల్లె పట్టణంలోని 14వ వార్డులో జరిగిన రీ పోలింగ్ కేంద్రాన్ని సబ్‌కలెక్టర్ నారాయణ్ భరత్‌గుప్తా మంగళవారం ఉదయం పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల అధికారి దేవ్‌సింగ్ పోలింగ్ సరళిని వివరించారు. అనంతరం సబ్‌కలెక్టర్ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాం తంగా ముగిశాయని, రానున్న ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగేలా కృషి చేస్తామన్నారు. డీఎస్పీ రాఘవరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement