Ripoling
-
ఒక్కో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో రీపోలింగ్
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలంలోని పెదవీడు–2 ఎంపీటీసీ, మటంపల్లి జెడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 25న రీపోలింగ్‌నకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఆదేశించింది. ఈనెల 14న జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా గుర్రంబోడ్ తండా (పోలింగ్ స్టేషన్ :39)లో రహస్య ఓటింగ్‌కు ఆటంకం కలగడంతోపాటు ఒకరికి బదులు మరొకరు ఓటేయడం, ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఒక ఓటరు ఉండగానే, మరొకరు ప్రవేశించడం, కొందరు రెండుసార్లు ఓటు వేయడం వంటి ఘటనలతో ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగలేదని, ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా ఎన్నికలను సరిగా నిర్వహించడంలో విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ పోలింగ్ స్టేషన్లో రిగ్గింగ్ జరిగినట్టు, చనిపోయిన వారి ఓట్లను కొందరు వేశారని, కొందరు ఓటేశాక బ్యాలెట్ పత్రాలను పోలింగ్ ఏజెంట్లకు చూపారని చిలకా కిషోర్‌కుమార్ అనే గ్రామస్తుడు ఎస్ఈసీకి చేసిన ఫిర్యాదుపై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారులు, సాధారణ పరిశీలకుల నుంచి తీసుకున్న నివేదికల్లోనూ ఇదే అంశం స్పష్టమైందన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 14న సూర్యాపేట జిల్లాలోని పెదవీడు–2 ఎంపీటీసీ, మటంపల్లి జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నిక రద్దు చేస్తున్నట్టు ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. 14న ఈ స్థానాల్లో (పోలింగ్ కేంద్రం–39) పోలైన బ్యాలెట్‌బాక్స్‌లను విడిగా భద్రపరచాలని, ఓట్లను లెక్కించరాదని స్పష్టం చేశారు. -
ఐదు వార్డుల్లో రీపోలింగ్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల గుర్తుల కేటాయిం పులో జరిగిన పొరపాటు కారణంగా ఒక పంచాయతీ సర్పంచ్ ఎన్నిక, దాని పరిధిలోని ఐదు వార్డులకు రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం జల్లపల్లి గ్రామ పంచాయతీకి రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు జరగాల్సి ఉండగా, అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను పొరపాటుగా కేటా యించడంతో రీపోలింగ్ జరగనుంది. దీంతో మూడో విడతలో భాగంగా ఈ నెల 30న జల్లపల్లి సర్పంచ్ స్థానానికి 3, 4, 5, 6, 7, 8 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. 30న సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటిం చాక ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహించాలని ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ సూచిం చారు. మిర్యాలగూడ మండలం ముల్కలచెరు వు గ్రామ పంచాయతీలోని ఐదో వార్డు స్థానానికి రిజర్వేషన్ ఖరారులో పొరపాటు చోటుచేసుకుం ది. దీంతో ఈ నెల 25న జరిగిన ఎన్నిక ప్రక్రియను రద్దు చేసి, ఫిబ్రవరి 8కి ఎస్ఈసీ రీషెడ్యూ ల్ చేసింది. 8న ఐదో వార్డులో ఫలితాన్ని ప్రకటిం చాక ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలంది. సోమవారం శివ్వారం ఫలితం ప్రకటన.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివ్వారం పంచాయతీ సర్పంచ్ స్థానానికి సోమవారం ఉదయం 11.30కి ఫలితాన్ని ప్రకటించాలని ఎస్ఈసీ సూచించింది. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహించాలని, ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఇది జరగకపోతే మరుసటిరోజు ఈ ఎన్నికను నిర్వహించవచ్చని పేర్కొంది. -
13న రీపోలింగ్
కూకట్పల్లి నియోజకవర్గంలోని 371/ఎ పోలింగ్ కేంద్రంలో.. కూకట్పల్లి, న్యూస్‌లైన్: కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని వసంత్‌నగర్ కాలనీ ఐడీపీఎల్ కోపరేటివ్ సోసైటీ కమ్యూనిటీ హాల్లో ఉన్న 371/ఎ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ జరగనుంది. ఈవీఎంలు ఫ్యాక్టరీ మోడ్‌లోకి వెళ్లిపోవడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానికి అనుగుణంగా ఈ కేంద్రంలో రీపోలింగ్ జరుగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి గంగాధర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 13వ తేదీన రీపోలింగ్ జరుగుతుందన్నారు. కేపీహెచ్‌బీ డివిజన్‌లోకి వచ్చే ఈ కేంద్రంలో మొత్తం 835 మంది ఓటర్లుండగా, గతనెల 30న జరిగిన పోలింగ్‌లో 462 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
12 చోట్ల నేడు రీపోలింగ్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో 12 బూత్‌లలో మంగళవారం రీపోలింగ్‌ను చేపట్టనున్నారు. ఈ నెల 17న పోలింగ్ సందర్భంగా ఈవీఎంలు మొరాయించడం, ఒక చోట పోలింగ్ సిబ్బంది తప్పిదాల వల్ల రీపోలింగ్‌ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనిల్ కుమార్ ఝా సోమవారం తెలిపారు. మొత్తం తొమ్మిది లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు రీపోలింగ్‌ను నిర్వహించనున్నారు. హావేరి నియోజక వర్గంలోని రాణిబెన్నూరు, బాలగలకోటెలోని జమఖండి, బాగలకోటె, బిజాపురలోని సిందగి, గుల్బర్గలోని సేడం, రాయచూరులోని షాపూర్, యాదగిరి, బీదర్‌లో రెండు, శివమొగ్గలోని బైందూరు, హాసనలోని అరసికెరె, తుమకూరు నియోజక వర్గంలోని తురువెకెరె బూత్‌లలో రీపోలింగ్ జరుగనుంది. కాగా రాష్ట్రంలో ఒకే దశలో ఈ నెల 17న ముగిసిన ఎన్నిక్లలో 67.3 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్న సంగతి తెలిసిందే. -
చెర్లగూడెం ఎంపీటీసీ స్థానానికి 11న రీపోలింగ్
సంగారెడ్డి రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం సంగారెడ్డి మండలంలోని ఓ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్‌కు దారితీసింది. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లు త ప్పుగా ముద్రించడంతో చెర్లగూడెం ఎంపీటీసీ స్థానం పరిధిలోని కాశీపూర్‌లో గల 43వ పోలింగ్ కేంద్రంలో ఈనెల 11న రీపోలింగ్ నిర్వహించనున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ రీపోలింగ్ విషయాన్ని ప్రకటించారు. దీంతో 11వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు కాశీపూర్‌లోని 43వ పోలింగ్ కేంద్రంలో ఎంపీటీసీ స్థానానికి మాత్రమే తిరిగి పోలింగ్ నిర్వహిస్తారు. సంగారెడ్డి మండలం చెర్లగూడెం ఎంపీటీసీ స్థానానికి సంబంధించి చెర్లగూడెం, కలివేముల, కాశీపూర్ గ్రామాల్లో మొత్తం ఆరు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కాశీపూర్‌లో 43వ, 44వ నంబర్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 43వ నంబరు పోలింగ్ కేంద్రంలో ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. బ్యాలెట్ పత్రాల్లో ఎంపీటీసీ అభ్యర్థుల పేర్లు తప్పుగా ఉన్నాయని మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పలువురు ఓటర్లు గుర్తించి విషయాన్ని అధికారులకు తెలియజేశారు.మండలంలోని పోతిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని మూడో ఎంపీటీసీ స్థానానికి చెందిన బ్యాలెట్ పత్రాలు పొరపాటున కాశీపూర్‌లోని 43వ నంబరు పోలింగ్ కేంద్రానికి వచ్చినట్టు ఎన్నికల సిబ్బంది గుర్తించారు. అప్పటికే 187 ఓట్లు పోల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం, ఎన్నికల అధికారి యాస్మీన్ బాషా, ఎంపీడీఓ సంధ్యాగురునాథ్ కాశీపూర్‌కు చేరుకుని ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాలను పరిశీలించారు. ఆ వెంటనే చెర్లగూడెం, కలివేములలో అదనంగా ఉన్న ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్లను తెప్పించి ఎన్నికల సిబ్బందికి అందజేశారు. దీంతో తిరిగి 43వ నంబరు పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ తిరిగి ప్రారంభమైంది. సాయంత్రం వరకు మొత్తం 550 ఓట్లు పోలయ్యాయి. అయితే కాశీపూర్ 43వ పోలింగ్ కేంద్రంలో ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాల ముద్రణలో జరిగిన తప్పిదం తెలుసుకున్న కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్మితా సబర్వాల్ రీపోలింగ్ నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపారు. వీటిని పరిశీలించిన ఎన్నికల కమిషన్ సదరు కేంద్రంలో కేవలం ఎంపీటీసీ స్థానానికి మాత్రమే ఈనెల 11న రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. బ్యాలెట్ పత్రాల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి స్మితా సబర్వాల్ తెలిపారు. -
ప్రశాంతంగా రీపోలింగ్
మదనపల్లె, న్యూస్‌లైన్: మదనపల్లె మున్సిపాలిటీలోని 14వ వార్డులో మంగళవారం జరిగిన రీపోలిం గ్ ప్రశాంతంగా ముగిసింది. తొలుత మందకొడిగా సాగినా 9 గంటల నుంచి పుంజుకొంది. మొత్తం 888 ఓట్లు ఉండగా 581 ఓట్లు పోలయ్యాయి. 65.42 శాతంగా నమోదైంది. అయితే ఆదివారం జరిగిన పోలింగ్‌లో 582 ఓట్లు పోలవ్వగా ఓటు వేసి న వెంటనే యశోద అనే వృద్ధురాలు మృతి చెందా రు. మంగళవారం పోలైన ఓట్లను పరిశీలిస్తే ఆమె ఓటే తగ్గిందని అధికారుల అంచనా. పోలింగ్‌కు రీపోలింగ్‌కు ఒక్క ఓటు మాత్రమే తేడా రావడం గమనార్హం. మొత్తానికి రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కమిషనర్ దేవ్‌సింగ్ తెలిపారు. కౌం టింగ్ ఈనెల 2న జరగాల్సి ఉండగా హైకోర్టు ఆదేశాల మేరకు 9వ తేదీ జరుగుతుందన్నారు. కౌంటింగ్‌కు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆయన పేర్కొన్నారు. భారీ బందోబస్తు రీపోలింగ్‌కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్‌కు అమలు చేశారు. ఒక ట్రైనీ ఎస్పీ, ఒక డీ ఎస్పీ, ఆరుగురు సీఐలు 10 మంది ఎస్ఐలు, ఐదుగురు ఏఎస్ఐలతో పాటు దాదాపు 60 మంది సివిల్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. డీఎస్పీ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పట్టణ సీఐలు శివన్న, గం గయ్య పర్యవేక్షణలో బందోబస్తును ఏర్పాటు చేశా రు. ఓటర్లను తనిఖీ చేసి కేంద్రంలోనికి అనుమతిం చారు. సెల్ఫోన్లను అనుమతించలేదు. రీపోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సబ్‌కలెక్టర్ మదనపల్లె పట్టణంలోని 14వ వార్డులో జరిగిన రీ పోలింగ్ కేంద్రాన్ని సబ్‌కలెక్టర్ నారాయణ్ భరత్‌గుప్తా మంగళవారం ఉదయం పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల అధికారి దేవ్‌సింగ్ పోలింగ్ సరళిని వివరించారు. అనంతరం సబ్‌కలెక్టర్ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాం తంగా ముగిశాయని, రానున్న ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగేలా కృషి చేస్తామన్నారు. డీఎస్పీ రాఘవరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.