సాక్షి, హైదరాబాద్: ఎన్నికల గుర్తుల కేటాయిం పులో జరిగిన పొరపాటు కారణంగా ఒక పంచాయతీ సర్పంచ్ ఎన్నిక, దాని పరిధిలోని ఐదు వార్డులకు రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఆదేశించింది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం జల్లపల్లి గ్రామ పంచాయతీకి రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు జరగాల్సి ఉండగా, అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను పొరపాటుగా కేటా యించడంతో రీపోలింగ్ జరగనుంది.
దీంతో మూడో విడతలో భాగంగా ఈ నెల 30న జల్లపల్లి సర్పంచ్ స్థానానికి 3, 4, 5, 6, 7, 8 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. 30న సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటిం చాక ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహించాలని ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ సూచిం చారు. మిర్యాలగూడ మండలం ముల్కలచెరు వు గ్రామ పంచాయతీలోని ఐదో వార్డు స్థానానికి రిజర్వేషన్ ఖరారులో పొరపాటు చోటుచేసుకుం ది. దీంతో ఈ నెల 25న జరిగిన ఎన్నిక ప్రక్రియను రద్దు చేసి, ఫిబ్రవరి 8కి ఎస్‌ఈసీ రీషెడ్యూ ల్ చేసింది. 8న ఐదో వార్డులో ఫలితాన్ని ప్రకటిం చాక ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలంది.
సోమవారం శివ్వారం ఫలితం ప్రకటన..
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివ్వారం పంచాయతీ సర్పంచ్ స్థానానికి సోమవారం ఉదయం 11.30కి ఫలితాన్ని ప్రకటించాలని ఎస్‌ఈసీ సూచించింది. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహించాలని, ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఇది జరగకపోతే మరుసటిరోజు ఈ ఎన్నికను నిర్వహించవచ్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment