13న రీపోలింగ్
కూకట్‌పల్లి నియోజకవర్గంలోని 371/ఎ పోలింగ్ కేంద్రంలో..
కూకట్‌పల్లి, న్యూస్‌లైన్: కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని వసంత్‌నగర్ కాలనీ ఐడీపీఎల్ కోపరేటివ్ సోసైటీ కమ్యూనిటీ హాల్‌లో ఉన్న 371/ఎ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ జరగనుంది. ఈవీఎంలు ఫ్యాక్టరీ మోడ్‌లోకి వెళ్లిపోవడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానికి అనుగుణంగా ఈ కేంద్రంలో రీపోలింగ్ జరుగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి గంగాధర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 13వ తేదీన రీపోలింగ్ జరుగుతుందన్నారు. కేపీహెచ్‌బీ డివిజన్‌లోకి వచ్చే ఈ కేంద్రంలో మొత్తం 835 మంది ఓటర్లుండగా, గతనెల 30న జరిగిన పోలింగ్‌లో 462 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.