
యువతి వివరాలు తెలుసుకుంటున్న గ్రామస్తులు
అనంతపురం, పుట్టపర్తి అర్బన్: ప్రేమించి పెళ్లి చేసుకుని వారం రోజులకే యువకుడు పరారవడంతో యువతి కన్నీటి పర్యంతమవుతోంది. బాధితురాలు తెలిపిన మేరకు... పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలోని ఎనుములపల్లికి చెందిన సౌభాగ్యబాయి టీటీసీ కోర్సు చేసింది. కోనాపురానికి చెందిన గోవర్ధన్‌రెడ్డి ఆమెను ప్రేమిస్తున్నానంటూ రెండేళ్లుగా వెంట పడ్డాడు. ఎట్టకేలకు వారం క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి గోవర్ధన్‌రెడ్డి కనిపించడం లేదు. మొబైల్ ఫోన్ కూడా స్విచాఫ్ వస్తోంది. గురువారం ఆమె భర్త కోసం కోనాపురం వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉండటంతో వెనుదిరిగింది. మార్గం మధ్యలో పెడపల్లి బస్టాండ్‌లో కన్నీటి పర్యంతమవుతున్న సౌభాగ్యబాయిని గ్రామస్తులు చేరదీసి ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment