అనుమానం పెనుభూతమై.. | HusbandT he ax ,wife cut down | Sakshi
Sakshi News home page

అనుమానం పెనుభూతమై..

Published Sun, Apr 10 2016 4:31 AM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

అనుమానం పెనుభూతమై.. - Sakshi

అనుమానం పెనుభూతమై..

భార్యను గొడ్డలితో నరికిన భర్త
పరిస్థితి విషమం
తల్లికోసం తల్లడిల్లిన చిన్నారులు

 
గాజులపల్లె(మహానంది): అనుమానం పెనుభూతమై  భార్యపై గొడ్డలితో దాడి చేశాడు భర్త. తీవ్ర రక్తస్రావమైన ఆమె ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. గాజులపల్లెలో శ నివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న దాడి ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..   మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి చెందిన చిన్న వెంకటసుబ్బమ్మకు బేతంచర్ల మండలం గూటిపల్లె గ్రామానికి చెందిన పుడుగొల్ల పులిరాజు ఆలియాస్ పులికొండతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల నుంచి భార్య మీద అనుమానం పెంచుకుని తర చూ గొడవపడేవాడు పులికొండ.

ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి గొడవకు దిగి  గొడ్డలితో తలపై నరికాడు.  తీవ్రగాయాలైన ఆమెను స్థానికులు, పోలీసులు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుత్రికి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహానంది ఎస్‌ఐ శ్రీకాంతరెడ్డి, ఏఎస్‌ఐ సుబ్బయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


అమ్మకు ఏమైంది.. తీవ్రగాయాలతో నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి కోసం పిల్లలు తల్లడిల్లారు. అమ్మకు ఏమైందంటూ అమాయక చూపులతో అవ్వను అడుగుతుంటే పక్కనున్న వారు చూసి కంటతడిపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement