హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో దొంగలు వరుస దారి దోపిడీలతో పోలీసులను పరుగులెత్తిస్తున్నారు. సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్ఖానాలో నేడు వృద్దుడిపై దాడి చేసి రూ. 5 లక్షలు దోచుకున్నారు. యాప్రాల్‌కు చెందిన అనిల్ దంపతులు మూడు బ్యాంకుల నుంచి ఐదు లక్షలు డ్రా చేశారు. రోడ్డు దాటుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు దాడి చేసి డబ్బు బ్యాగుతో పరారయ్యారు. దీంతో లబోదిబోమంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సిసి కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దొంగల వేటలో పడ్డారు పోలీసులు.
దారి దోపిడీలు పెరుగుతుండడంతో నగర వాసులు భయాందోళన చెందుతున్నారు. బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకువస్తున్న వారిని లక్ష్యంగా చేసుకున్న దోపిడీదారులు రెచ్చిపోతున్నారు. క్షణాల్లో వచ్చి డబ్బు సంచులు లాక్కుపోతున్నారు. ఇకనైనా దారి దోపిడీలకు అడ్డుకట్ట వేయాలని పోలీసులను హైదరాబాద్ వాసులు కోరుతున్నారు.
దారి దోపిడీలతో వణుకుతున్న భాగ్యనగర వాసులు
Published Thu, Nov 28 2013 7:00 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement