
నేను పక్కా సమైక్యవాదిని: ఎమ్మెల్యే జయమణి
సమైక్యాంధ్ర ఉద్యమానికి పార్వతీపురం ఎమ్మెల్యే జయమణి శుక్రవారం మద్దతు తెలిపారు. తాను పక్కా సమైక్యవాదినని జయమణి స్పష్టం చేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యోమంలో పాల్గొంటానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై యూపీఏ తీసుకున్న నిర్ణయం పట్ల ఆమె ఈ సందర్బంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా జిల్లాలో రెవె న్యూ ఉద్యోగులు ఉద్యమ బాటపట్టనున్నారు. 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేయనున్న ట్టు సీమాంధ్ర రెవెన్యూ ఉద్యోగులు సీసీఎల్‌ఏ కు నోటీసు అందజేసిన విషయం విదితమే. కాగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సొంత జిల్లాలోనూ నిరసన సెగలు రగులుతునే ఉన్నాయి. జిల్లాలో ఎక్కడికక్కడ నిరసనకారులు రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు.