
‘సాక్షి’లో యాంకర్‌గా చేశా: గాయని దామిని
మొగల్తూరు : సాక్షి టీవీలో ఏడాది పాటు చిన్నారిలోకం, సింగర్స్ షోకు యాంకర్‌గా పనిచేశానని గాయని దామిని అన్నారు. ముత్యాలపల్లిలో బండి ముత్యాలమ్మ జాతర సందర్భంగా ఏర్పాటుచేసిన సంగీత విభావరిలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. 2011లో మాటీవీలో వచ్చిన పాడుతాతీయగా కార్యక్రమంలో రెం డో స్థానంలో నిలవడం ద్వారా సినిమాల్లో అవకాశం వచ్చిందని చెప్పా రు. రాష్ట్రంలో 100 వరకు, అమెరికాలో నాలుగు సంగీత ప్రదర్శనలు ఇచ్చానన్నారు. సంగీత దర్శకులు కీరవాణి, అనూప్ రూబెన్స్, మణిశర్మ వద్ద పనిచేశానని చెప్పారు. లవ్ ఇన్ లండన్, ఎవరికి ఎవరు, ఇక ఆట నాదే సినిమాల్లో అన్ని పాటలు పాడే అవకాశం తనకే వచ్చిందన్నారు.